SGSTV NEWS
SpiritualVastu Tips

Vastu Shastra for Money: ఈ దిశ కుబేర దిశ.. ఆర్దిక ఇబ్బందులు తొలగాలంటే ఈ వాస్తు చిట్కాలు అనుసరించండి

వాస్తు శాస్త్రంలో ఇంటి నిర్మాణానికి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు.. సంపద, ఆర్థిక శ్రేయస్సును పెంచడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఈశాన్య మూల ప్రాముఖ్యత గురించి, ఇంట్లోనే పూజ గది స్థానం.. కుబేర యంత్రం ప్రయోజనాలను వివరించారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, దీపాలు వెలిగించడంలో ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. వాస్తును పాటించడం ద్వారా ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు.


వాస్తు శాస్త్రంలో దిక్కులు, మూలాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంటిలో వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి, ఈశాన్య మూలలు ఉంటాయి. వీటిని వాయు మూల, అగ్ని మూల, కుబేర మూల అని పిలుస్తారు. దీనితో పాటు, ఈశాన్య దిశకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కారణం ఏమిటంటే ఈ దిశను కుబేరుని నివాసంగా భావిస్తారు. కుబేరుడు సంపదలకు అధిపతి. కనుక ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.


ఈశాన్యంలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ బరువైన వస్తువులను ఈ దిశలో ఉంచకూడదు. బరువైన వస్తువులను ఈ దిశలో పెట్టుకోవడం వలన ఆర్థిక సమస్యలు వస్తాయని వాస్తుశాస్త్రం పేర్కొంది. అలాగే ఇంట్లో కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. దీనివల్ల ఇంటికి ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం.

ఆర్థిక సమస్యలను అధిగమించే మార్గాలు:
లక్ష్మీ దేవి ఆశీస్సులు పొందడానికి కొన్ని వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నిర్దిష్ట పనులు చేయడం వల్ల ఇంట్లో సంపద నిరంతరం పెరుగుతుంది. ఇంట్లో సిరి సంపదలకు కొరత లేకుండా ఉండడం కోసం కొన్ని వాస్తు చిట్కాలు సూచించింది.




కుబేరుడు సంపదకు అధిపతి కనుక ఆయనను ప్రసన్నం చేసుకోవడం.. ఇంట్లో ఆర్థిక సమస్యలను అధిగమించడానికి మంచి మార్గం. కుబేరుడిని యంత్ర రూపంలో పూజించడం చాలా మంచిది. ఇంకా కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు ఈశాన్య దిశ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ దిశలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

ఈశాన్యంలో మెట్లు నిర్మించకూడదు. మెట్లు నిర్మించడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాగే చెప్పులు, చెత్తను ఈశాన్య దిశలో ఉంచకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. అంతే కాదు ఈశాన్య దిశలో బాత్రూమ్‌లు నిర్మించకూడదు. బాత్రూమ్ నిర్మించడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుంది.

డబ్బును దాచే సేఫ్ ను ఎల్లప్పుడూ ఉత్తరం వైపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు మురికిగా ఉంటే.. ఆ ఇంట్లో లక్ష్మీ దేవి ఉండదు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి. ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. సిరి సంపదలు పెరుగుతాయి

Also read

Related posts

Share this