November 22, 2024
SGSTV NEWS
Spiritual

Tholi Ekadashi: వివాహంలో జాప్యమా..! జాతక దోషమా..! తొలి ఏకాదశి రోజున ఈ చర్యలు చేసి చూడండి.. గుడ్ న్యూస్ వింటారు..

హిందువులు తొలి ఏకాదశిని ఎంతో పవిత్రమైనదిగా భావించి నియమ నిష్టలతో పూజ చేస్తారు. ఈరోజున చేసే చిన్న పూజ, ఉపవాసం, నియమం, వ్రతం ఇలా ఏదైనా సరే వెయ్యిరెట్లు ఫలితం ఇస్తుందని నమ్మకం. ఈ నేపధ్యంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్నా వివాహం జరగడంలో జాప్యం అవుతుంటే ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని పరిహారాలు చేసి చూడండి. శుభవార్త వింటారు అని పురోహితులు చెబుతున్నారు

Also read :Tholi Ekadashi: తొలి ఏకాదశి ఎప్పుడు? జూలై 16 లేదా 17న? ఈ రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా..!

హిందూ ధర్మంలో ప్రతి తిదికి ఒకొక్క విశిష్టత ఉంది. అదే విధంగా ఏకాదశి తిదికి కూడా సొంత ప్రాముఖ్యత ఉంది. ఒకొక్క ఏకాదశిని ఒకొక్క పేరుతో పిలుస్తారు. ఉపవాశం, పూజ వలన వివిధ రకాల ప్రయోజనాలు లభిస్తాయని హిందువుల విశ్వాసం. ఈ నేపధ్యంలో ఆషాడ మాసంలో వచ్చే ఏకాదశిని తెలుగు ప్రజలు తొలి ఏకాదశి అని పిలుస్తారు. మిగిలిన వారు దేవ శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువుని అత్యంత భక్తీ శ్రద్దలతో పుజిస్తారు. అంతేకాదు ఈ రోజు పాలకడలిలో శ్రీమహావిష్ణువు యోగ నిద్రకు వెళ్తారని విశ్వాసం ఇక ఈ రోజు నుంచి హిందువుల పండగలు మొదలవుతాయి. అంతేకాదు చాతుర్మాస్యవ్రతం కూడా ప్రరంభామ అవుతుందని. ఈ రోజున చాలా మంది అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువుని పూజిస్తారు.

తొలి ఏకాదశి రోజున తెలుగు రాష్ట్రాల్లో రామాలయాలు భక్తుల రద్దీతో నిండిపోతాయి. ఇక చాలా మంది పండరీపురం యాత్రను అత్యంత భక్తిశ్రద్ధలతో చేస్తారు. ముఖ్యంగా వార్కరీలు పండరీనాథుని దర్శనం కోసం పండరీపురంకు యాత్రను చేస్తారు.

ఇక హిందువులు తొలి ఏకాదశిని ఎంతో పవిత్రమైనదిగా భావించి నియమ నిష్టలతో పూజ చేస్తారు. ఈరోజున చేసే చిన్న పూజ, ఉపవాసం, నియమం, వ్రతం ఇలా ఏదైనా సరే వెయ్యిరెట్లు ఫలితం ఇస్తుందని నమ్మకం. ఈ నేపధ్యంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్నా వివాహం జరగడంలో జాప్యం అవుతుంటే ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని పరిహారాలు చేసి చూడండి. శుభవార్త వింటారు అని పురోహితులు చెబుతున్నారు.

తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అభ్యంగ స్నానం చేయాలి. తర్వాత పూజగదిని శుభ్రం చేసి అందంగా రంగవల్లిని తీర్చిదిద్దుకోవాలి. ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువుని పూజించే సంప్రదాయం ఉంది కనుక ముందుగా ఆయనకు ఇష్టమైన పసుపు రంగు పువ్వులు, అరటి పండ్లు, పూజా సామగ్రిని రెడీ చేసి పెట్టుకోవాలి. విష్ణువు అలంకార ప్రియుడు కనుక రకరకాల పువ్వులతో పూజ చేసి, పండ్లను నైవేద్యం సమర్పించాలి.

తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేసే భక్తుల కోరికలను ఆ స్వామివారు వెంటనే తీరుస్తారని నమ్మకం. ముఖ్యంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహ ప్రయత్నాలు ఫలించక పొతే తొలి ఏకాదశి రోజున యువతీ యువకులు రుక్మిణి కల్యాణాన్ని 11 సార్లు చదివితే శుభ ఫలితం ఉంటుందని..నెల తిరిగే సరికి వివాహం కుదురుతుందని నమ్మకం.

దంపతుల మధ్య ఏమైనా వివాదాలు ఉంటె తొలి ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామీ వ్రతం చేయడం వలన వివాదాలు తొలగి సుఖ సంతోషాలతో జీవితస్తారని విశ్వాసం. అంతేకాదు సత్యానారాయణ స్వామి వ్రతం చేయడం వలన తెలిసి తెలియక చేసిన పాపలు తొలగి విముక్తి లభిస్తుందని నమ్మకం. అందుకనే తొలి ఏకాదశి రోజున ఎక్కువ మంది ఉపవాసం ఉంటారు.

ఇక ఏకాదశి ఉపవాసం రోజున చేసే పూజతో పాటు చేసే దానాలకు కూడా విశిష్ట ఫలితాలు ఇస్తాయని నమ్మకం. ఈ రోజున పేదలకు, అవసరం ఉన్న వారికి అన్న వితరణ, వస్త్ర దానం, వంటివి తోచిన విధంగా సాయం చేయడం వలన ఆ శ్రీమన్నారాయణ కరుణా కటాక్షంతో జీవితంలో అన్నపానాదులకు లోటు ఉండదని పండితులు చెబుతారు.

తొలి ఏకాదశి రోజున నెమలి ఫించాన్ని ఇంటికి తీసుకొచ్చి పూజించడం మంచిది. పూజ అనంతరం ఈ నెమలి ఈకను డబ్బులు పెట్టె లాకర్ లో పెట్టడం వలన జీవితంలో డబ్బులకు ఎన్నటికీ లోటు ఉండదని విశ్వాసం.

జాతకంలో గ్రహ దోషాలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మూగ జీవులకు తినడానికి ఆహారం అందించడం విశిష్ట ఫలితాలను ఇస్తుందని విశ్వాసం. తొలి ఏకాదశి రోజున గోశాలలోని ఆవులకు మేతను అందిచడం శుభ ప్రదం. కుక్కలు, ఆవులు, మూగ జీవులకు ఆహరం అందించడం వలన జాతకంలోని దోషాలు తొలగి పోయి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయని.. సంపదకు లోటు ఉండదని చెబుతుంటారు.

Related posts

Share via