SGSTV NEWS online
Famous Hindu TemplesSpiritual

సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!

 


భక్తజనకోటి హృదయాలపై ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే సుప్రసిద్ధ పంచారామ క్షేత్రాలలో ‘సోమారామం’ ఒకటి. ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం అంటారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి $2$ కి.మీ దూరంలో ఉన్న గుణిపూడి గ్రామంలో ఈ క్షేత్రం వెలసింది. పంచారామాలలో రెండవదైన సోమారామంలో భక్త సులభుడైన శివయ్య ‘సోమేశ్వరస్వామి’ పేరుతో నిత్య పూజలు అందుకుంటూ ఉంటారు. చంద్రుడికి సోముడన్న పేరు ఉంది. అందువల్లే ఈ క్షేత్రాన్ని సోమారామం అని, ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని సోమేశ్వరుడని పిలుస్తారు.




పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఉన్న గుణిపూడిలో సోమారామం వెలసింది. ఇక్కడ కొలువై ఉన్న సోమేశ్వరుడి లింగం, అమ్మవారి ఆలయ నిర్మాణం దేశంలో మరెక్కడా లేని విధంగా అద్భుతంగా ఉంటుంది. సోమేశ్వర క్షేత్రం భీమవరం పట్టణానికి 2 కి.మీ. దూరంలో గుణిపూడి గ్రామంలో ఉంది. చంద్రుడికి సోముడన్న పేరు ఉంది కాబట్టి, ఆ పేరు మీదుగానే ఇక్కడి స్వామిని సోమేశ్వరుడు అంటారు. ఈ క్షేత్రం సోమారామంగా ప్రసిద్ధి చెందింది.

👉   ద్వివర్ణ శివలింగం ప్రత్యేకత

ఇక్కడి శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య వచ్చేసరికి మాత్రం గోధుమ రంగులో మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి మామూలు శ్వేత వర్ణపు స్థితికి వచ్చేస్తుంది. దాదాపు శతాబ్దకాలంగా ఇలా జరుగుతోందని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. ఈ మార్పులను చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తారు.

ఇక్కడ గల స్వామివారిని చంద్రుడు ప్రతిష్ఠించాడు అంటారు. ఈ దేవాలయంలోని శివలింగం చంద్రునిచే ప్రతిష్ఠించిన చంద్ర శిల కాబట్టి ఇలా రంగులలో మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు.

👉  ఆలయ పురాణం – తారకాసురుని వధ

పూర్వం తారకాసురుడనే రాక్షసుడు అమృతలింగాన్ని తన కంఠాన ధరించి మహా పరాక్రమవంతుడయ్యాడు. అతడి ఆగడాలు ఎక్కువ కావడంతో పరమ శివుడు తన కుమారుడైన కుమారస్వామిని తారకాసురుణ్ణి వధించమని ఆదేశించాడు. తారకాసురుడు చనిపోకపోవడానికి కారణం అతడి మెడలో ఉన్న అమృతలింగమే అని గ్రహించిన కుమారస్వామి తన శక్తిఘాతంతో ఆ అమృతలింగాన్ని ఛేదించాడు. అది అయిదు ముక్కలుగా అయిదు ప్రాంతాలలో పడింది. రెండవ అమృతలింగ శకలం పడిన ప్రాంతమే ఈ గుణిపూడి.

గురుపత్ని అనుగమన దోషంతో పీడించబడిన చంద్రుడు ఆ శకలాన్ని గుణిపూడిలో ప్రతిష్ఠించి, లింగం పెరుగుదలను నిరోధించి పూజాదికాలు నిర్వహించాడు. చంద్రుని చేత ప్రతిష్ఠించబడిన ఈశ్వరుడు కావున ఈయన సోమేశ్వరుడుగా, ఈ ఆరామము సోమారామంగా కీర్తించబడుతున్నాయి.

👉  రెండు అంతస్తుల నిర్మాణం
ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది.

*  సోమేశ్వరుడు కింది అంతస్తులోనూ, అన్నపూర్ణాదేవి పై అంతస్తులోనూ ఉంటారు.



*  ఇక్కడి అమ్మవారు ‘అన్నపూర్ణ’గా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది.

*  ఎక్కడా లేని విధంగా సోమేశ్వర లింగం గర్భాలయం పైన నిర్మించబడిన రెండవ అంతస్తులో ఖచ్చితంగా స్వామివారి తలపై భాగాన ఈ అన్నపూర్ణాదేవి విగ్రహం ప్రతిష్ఠింపబడింది.

*  ఇది ఈ సోమారామం ప్రత్యేక విశిష్టత. ఈశ్వరుని శిరస్సుపై గంగను ధరించాడు అనడానికి ఇది ప్రతీక అని భక్తులు భావిస్తారు. ఇలా శివుడి పైన అమ్మవారు ఉండటం దేశంలో మరెక్కడా లేదని చెబుతారు.

👉  పంచ నందీశ్వరాలయం

ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్ధన స్వామి. అందువలనే ఇచ్చట ప్రతి ఏటా ఎన్నో వివాహాలు జరుగుతాయి. ఇక్కడ వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో ఆనందంగా, శుభమయంగా సాగిపోతుందని ఈ ప్రాంతంలో బలంగా విశ్వసిస్తారు.

ఈ దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉండగా, ధ్వజస్తంభం వద్ద మరో నంది ఉంటుంది. అటుపై ఆలయ ప్రాంగణంలో ఒక నంది, దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉంటుంది. అందువల్లే ఈ క్షేత్రానికి పంచ నందీశ్వర దేవాలయం అని కూడా పేరు

సేకరణ :ఆధురి భాను ప్రకాష్

Related posts