శ్రావణ మాసం అంటే పూజల మాసం. ఈ నెలలో ప్రతి రోజూ ఆధ్యాత్మికంగా శుభప్రదంగా భావిస్తారు. అంతేకాదు శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారం అత్యంత ఫలవంతమైన రోజులుగా పరిగణింపబడుతున్నాయి. ఈ నెలలో మంగళవారం రోజున మంగళ గౌరీ ని పుజిస్తారు. ఉపవాసం ఉండి.. అమ్మవారిని పూజిస్తారు. ఇలా చేయడం శుభప్రదం, ఫలవంతంగా పరిగణింపబడుతున్నది. అంతేకాదు ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని వివాహితస్త్రీలు మాత్రమే కాదు.. పెళ్లికాని యువతలు,.. పెళ్ళికి పదే పదే అడ్డంకులు ఎదుర్కొంటున్నవారు చేయడం అత్యంత ఫలవంతంగా చెబుతున్నారు.
హిందువులకు శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం. ఈ పవిత్ర మాసంలో భక్తుల కోరికలను నెరవేర్చడంలో సహాయపడే అనేక ఉపవాసాలు, వ్రతాలు, పండుగలు ఉన్నాయి. వీటిలో ఒకటి మంగళ గౌరీ వ్రతం. ఇది ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్న లేదా పెళ్లి జరగడంలో అడ్డంకులను ఎదుర్కొంటున్న పెళ్లికాని యువతులకు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. నిర్మలమైన హృదయంతో ఈ ఉపవాసం పాటించడం ద్వారా వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలను గౌరీ దేవి కృపతో అధిగమించవచ్చు. ఈ ఏడాది శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం ఎప్పుడు వచ్చింది. ఈ ఉపవాసం ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాం.
శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి శ్రావణ శుద్ధ అమావాస్య వరకు శ్రావణ మాసం. అంటే 2025 శ్రావణ మాసం జూలై 25న ప్రారంభమై ఆగస్టు 23న ముగుస్తుంది.
మంగళ గౌరీ వ్రతం ఎప్పుడంటే
శ్రావణ మాసంలో నాలుగు మంగళవారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఈ మంగళ గౌరీపుజని, ఉపవాసం పాటిస్తారు.
29జూలై 2025 5 ఆగస్టు 2025 12ఆగస్టు 2025 19ఆగస్టు 2025
మంగళ గౌరీ వ్రతం ప్రాముఖ్యత ఏమిటి?
మంగళ గౌరీ వ్రతాన్ని శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం నాడు ఆచరిస్తారు. ఈ ఉపవాసం ముఖ్యంగా సంతోషకరమైన వైవాహిక జీవితం, తగిన జీవిత భాగస్వామిని పొందడానికి అంకితం చేయబడింది. పురాణ నమ్మకాల ప్రకారం ఈ ఉపవాసం పాటించడం వల్ల గౌరీ దేవి (పార్వతి దేవి రూపం) సంతోషిస్తుంది. వివాహంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. పెళ్లికాని అమ్మాయిలు మంచి వరుడిని కోసం ఈ వ్రతం చేస్తారు. వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షు, సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఈ రోజు వ్రతాన్ని ఆచరిస్తారు.
మంగళ గౌరీ ఉపవాస పూజా విధానం
మంగళవారం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. ఆ తర్వాత చేతిలో నీరు తీసుకుని ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి. ఇంటి ఈశాన్య మూలలో ఒక పీటాన్ని ఏర్పాటు చేసి దానిపై ఎర్రటి వస్త్రాన్ని పరచండి. గౌరీ దేవీ విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్టించండి. గంగాజలంతో పూజా స్థలాన్ని శుద్ధి చేయండి. దీపం వెలిగించి గౌరీ దేవిని ధ్యానించండి. పసుపు, కుంకుమ, గాజులు, మెహందీ మొదలైన పదహారు వస్తువులు, పండ్లు, పువ్వులు, స్వీట్లు, తమలపాకులు, లవంగాలు, యాలకులు, ధూపం, దీపాలు, అగర్బత్తి, కొబ్బరి కాయ చీర జాకెట్ దుపట్టా వంటివి పూజలో చేర్చండి. గౌరీ దేవికి వీటిని సమర్పించండి.
“ఓం గౌరీ శంకరాయ నమః” లేదా “ఓం మంగళ గౌర్యై నమః” అనే మంత్రాన్ని జపించండి. మంగళ గౌరీ కథను పఠించి చివరగా హారతి ఇవ్వండి. ఉపవాసం సమయంలో రోజుకు ఒకసారి పండ్లు లేదా సాత్విక ఆహారం తినవచ్చు. ఉప్పు తినకండి. మర్నాడు అంటే బుధవారం ఉదయం పూజ చేసి ఉపవాసం ముగించండి.
వివాహాలలో అడ్డంకులను తొలగించడానికి చేయాల్సిన చర్యలు
1 పసుపు రంగు దుస్తులు ధరించండి: పూజ సమయంలో పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. సాధారణంగా పసుపు రంగు బృహస్పతి గ్రహంతో (వివాహానికి సంకేతం) సంబంధం కలిగి ఉంటుంది
2 శివాలయ దర్శనం: మంగళ గౌరీ వ్రతం రోజున శివాలయాన్ని సందర్శించి శివపార్వతి దర్శనం చేసుకుని త్వరగా వివాహం కావాలని ప్రార్థించండి.
3 పార్వతి దేవికి కుంకుమ సమర్పించండి: పూజ సమయంలో గౌరీ దేవికి సిందూరం సమర్పించండి. వివహత స్త్రీలు తమ పాపిట సింధూరాన్ని ధరించండి.
4 తులసి వివాహం: శ్రావణ మాసంలో తులసి మొక్కకి వివాహం నిర్వహించడం లేదా ఎవరైనా తులసి మొక్కకు వివాహం చేస్తుంటే ఆ కార్యక్రమంలో పాల్గొనడం కూడా వివాహంలో అడ్డంకులను తొలగించడంలో సహాయకరంగా పరిగణించబడుతుంది.
5 దానధర్మాలు: పేదలకు ఆహారం లేదా బట్టలు దానం చేయండి.
6 మంగళవారం గోసేవ కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
