July 5, 2024
SGSTV NEWS
Spiritual

అప్పులతో ఇబ్బందులా.. విముక్తి కోసం సోమ ప్రదోష వ్రతం రోజున శివయ్యకు వీటితో అభిషేకం చేయండి..

సోమ ప్రదోష ఉపవాసం శివుని ఆశీర్వాదాన్ని పొందేందుకు పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తెలిసి, తెలియక చేసిన పాపాలు నశించి పుణ్యాలు లభిస్తాయని నమ్మకం. ఎవరైతే వ్రతాన్ని హృదయపూర్వకంగా.. భక్తితో ఆచరిస్తారో ఆ భక్తుల కోరికలన్నింటినీ శివుడు తీరుస్తాడని నమ్మకం. ఉపవాసం చేయడం వలన బాధల నుండి ఉపశమనం పొందుతారని భావిస్తారు. సోమ ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వల్ల అదృష్టం పెరుగుతుందని విశ్వాసం.

హిందూ మతంలో ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఉపవాసం శివ పార్వతులకు అంకితం చేయబడింది. ఈ పవిత్రమైన రోజున భక్తులు శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే ఆయన ఆశీస్సులు పొందేందుకు ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్తారు. ఈసారి సోమ ప్రదోష వ్రతం 2024  మే 20 సోమవారం నాడు ఆచరించాల్సి ఉంది.  సోమవారం నాడు వస్తుందికనుక దీనిని సోమ ప్రదోష వ్రతం అంటారు. సోమ ప్రదోష వ్రతం శివునికి అంకితం చేయబడిన చాలా ముఖ్యమైన ఉపవాసంగా పరిగణించబడుతుంది. ఈ వ్రతం ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి సోమవారం ఆచరిస్తారు. సోమ ప్రదోష వ్రతాన్ని సంధ్యా కాలంలో పాటిస్తారు.ఇది శివుడిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది

సోమ ప్రదోష ఉపవాసం శివుని ఆశీర్వాదాన్ని పొందేందుకు పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తెలిసి, తెలియక చేసిన పాపాలు నశించి పుణ్యాలు లభిస్తాయని నమ్మకం. ఎవరైతే వ్రతాన్ని హృదయపూర్వకంగా.. భక్తితో ఆచరిస్తారో ఆ భక్తుల కోరికలన్నింటినీ శివుడు తీరుస్తాడని నమ్మకం. ఉపవాసం చేయడం వలన బాధల నుండి ఉపశమనం పొందుతారని భావిస్తారు. సోమ ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వల్ల అదృష్టం పెరుగుతుందని విశ్వాసం. అటువంటి పరిస్థితిలో సోమ ప్రదోష వ్రతం రోజున శివలింగానికి వేటిని సమర్పించడం వలన ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పని ప్రదేశంలో విజయం కోసం
ఎంత కష్టపడి పనిచేసినా విజయం సాధించలేకపోతే మళ్లీ మళ్లీ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తే సోమ ప్రదోషం రోజున శివలింగానికి అక్షతలు, తేనె సమర్పించండి. ఇలా చేయడం ద్వారా ఆఫీసులో విజయం సాధించడంతో పాటు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయని చెబుతారు.

పితృదోషం నుండి ఉపశమనం పొందడానికి
పితృదోషం తొలగిపోవాలన్నా, పూర్వీకులను ప్రసన్నం చేసుకోవాలన్నా సోమ ప్రదోష వ్రతం రోజున శివలింగానికి నల్ల నువ్వులను సమర్పించాలి. దీని ద్వారా పితృదోషం నుంచి విముక్తి పొంది సుఖ సంతోషాలు పొందవచ్చని నమ్ముతారు.

ఆర్థిక లాభం కోసం పాలు
ఎంత కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు రాకపోతే సోమ ప్రదోషం రోజున శివలింగానికి పాలు సమర్పించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.

అప్పుల నుంచి విముక్తి పొందడానికి
పాత అప్పుతో ఇబ్బంది పడుతుంటే లేదా అప్పుల భారం పెరిగిపోతుంటే ఖచ్చితంగా సోమ ప్రదోష వ్రతం రోజున శివలింగానికి పెరుగును సమర్పించాలి. దీని ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయని, రుణ విముక్తి పొందవచ్చని చెబుతారు. సుఖ సంతోషాలతో పాటు అదృష్టం కుడా కలిసి వస్తుందని నమ్మకం.

సంతోషకరమైన వైవాహిక జీవితం
వివాహం జరగడంలో ఆటంకాలు ఏర్పడినా, వైవాహిక జీవితంలో ఉద్రిక్తతలు ఏర్పడితే ఖచ్చితంగా సోమ ప్రదోష వ్రతం రోజున శివలింగానికి బిల్వ పాత్రలను సమర్పించండి. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అదే సమయంలో వ్యక్తి శాశ్వతమైన ఫలాలను పొందుతారని నమ్ముతారు.

Also read

Related posts

Share via