రాత్రి సమయంలో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయని పెద్దలు చెబుతారు? అంతేకాదు రాత్రి పూట రావి చెట్టును తాకకూడదు. ఇలాంటి ఎన్నో విషయాలు వినే ఉంటారు. అయితే వీటన్నింటికీ అసలు ఆధారం ఏమిటి? ఇది నిజంగా నిజమా లేక కేవలం మూఢనమ్మకమా లేక దీనిలో శాస్త్రీయ కోణం దాగి ఉందా ఈ రోజు దీని గురించి తెలుసుకుందాం..
పురాణగ్రంధాల్లో రావి చెట్టు విష్ణువు స్వరూపంగా పరిగణించబడుతుంది. అందువల్ల హిందూ మతంలో రావి చెట్టు ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. పూజా కార్యక్రమాలను రావి చెట్టు కింద చేస్తారు. మత విశ్వాసాల ప్రకారం ప్రతి శనివారం రావి చెట్టు క్రింద ఆవాల నూనె దీపం వెలిగించడం జీవితంలో ఆనందం, శాంతిని కలిగిస్తుంది.
అయితే రాత్రి సమయంలో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయని పెద్దలు చెబుతారు? అంతేకాదు రాత్రి పూట రావి చెట్టును తాకకూడదు. ఇలాంటి ఎన్నో విషయాలు వినే ఉంటారు. అయితే వీటన్నింటికీ అసలు ఆధారం ఏమిటి? ఇది నిజంగా నిజమా లేక కేవలం మూఢనమ్మకమా లేక దీనిలో శాస్త్రీయ కోణం దాగి ఉందా ఈ రోజు దీని గురించి తెలుసుకుందాం..
శాస్త్రీయ విధానం ప్రకారం
రాత్రి సమయంలో రావి చెట్టు లేదా ఇతర చెట్ల కింద పడుకోవడం నిషేధించబడింది ఎందుకంటే చెట్లు రాత్రిలో కార్బన్ డయాక్సైడ్‌ను గాలిలోకి విడుదల చేస్తాయి. మానవ శరీరానికి అది మంచిది కాదు, ఎక్కువ సమయం కార్బన్ డయాక్సైడ్ పీలిస్తే శరీరంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. అందుకే రాత్రి సమయంలో రావి చెట్టు దగ్గరికి వెళ్లకూడదని అంటారు.
పురాణ గ్రంథాల ప్రకారం
హిందూ మతంలో రావి చెట్టును దైవ స్వరూపంగా భావిస్తారు. విశ్వాసం ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు రావి చెట్టులో నివసిస్తారు. మహావిష్ణువు రావి చెట్టు మూలాలలో, కేశవుడు కాండం.. సకల దేవతలు ఆకులలో నివసిస్తున్నట్లు పురాణాలలో చెప్పబడింది. అందువల్ల రావి చెట్టును పూజిస్తారు. కనుక గ్రంధాల ప్రకారం రాత్రి సమయంలో రావి చెట్టు కిందకు వెళ్లడం లేదా నిద్రించడం శుభప్రదంగా పరిగణించబడదు.
రావి చెట్టులో ఆత్మలు నివసిస్తాయా?
పురాణ గ్రంధాల ప్రకారం రావి చెట్టుపై ఆత్మలు నివసిస్తాయనేది కేవలం ఊహాత్మకమైనవి. గ్రంథాలలో రావి చెట్టును దేవతల మొక్కగా పరిగణిస్తారు. కనుక ఈ చెట్టులో ఆత్మ నివసిస్తుందనేది మనుషులు రాత్రి ఈ చెట్టుకు దూరంగా ఉంచడానికి మాత్రమే అని శాస్త్రీయ కోణంలో రాత్రిపూట రావి చెట్టు దగ్గరికి వెళ్లకూడదు.
Also read
- భార్యాభర్తల సెల్ఫీ వీడియో – ఆపై సూసైడ్ – భార్యాభర్తలిద్దరూ మృతి… వీడియో
- కురిక్యాల పాఠశాల ఘటనపై మహిళా కమిషన్ సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం!
- Jangaon District :విద్యర్థులందరు భోజనం చేశాక సాంబార్లో బల్లి ప్రత్యక్షం.. జనగామ జిల్లాలో ఘటన
- సినిమా రేంజ్ ట్విస్ట్.. భార్యను ఇంటికి పంపించి.. గుట్టుగా ఆ పని చేశాడు.. కట్ చేస్తే సీన్ ఇది
- Telangana: అంత చిన్న విషయానికే.. ఇంత దారుణమా.. అసలు ఏం జరిగిందంటే?





