June 29, 2024
SGSTV NEWS
Spiritual

Skanda Sashti Vratam: సంతానం, సంతోషం కోసం స్కంద షష్ఠి రోజున ఇలా పూజ చేయండి.. శుభ ఫలితాలు మీ సొంతం


ఈ షష్ఠిని సూర్య భగవానుని పూజించే రోజుగా కూడా పరిగణిస్తారు. ఈ రోజున సూర్యభగవానుని ఆరాధించడం ద్వారా ప్రజలు వ్యాధుల నుంచి విముక్తి లభించి, ఆరోగ్యం, ఆనందం, సంపదను పొందుతారు. సంతానం పొందాలనుకునే వారు ఈ రోజు షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు. జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష షష్ఠి తిథి జూన్ 11వ తేదీ మంగళవారం సాయంత్రం 5:27 గంటలకు ప్రారంభమై జూన్ 12వ తేదీ బుధవారం సాయంత్రం 7:17 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం స్కంద షష్ఠి పండుగను జూన్ 12న మాత్రమే జరుపుకోవాలి.


హిందూ మతంలో జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష షష్ఠి రోజున శివపార్వతి దేవిల ముద్దుల తనయుడు స్కందుడిని (కార్తికేయ) నియమ నిష్టలతో పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో ఈ తిధిని స్కంద షష్ఠిగా కూడా జరుపుకుంటారు. ఈ షష్ఠిని సూర్య భగవానుని పూజించే రోజుగా కూడా పరిగణిస్తారు. ఈ రోజున సూర్యభగవానుని ఆరాధించడం ద్వారా ప్రజలు వ్యాధుల నుంచి విముక్తి లభించి, ఆరోగ్యం, ఆనందం, సంపదను పొందుతారు. సంతానం పొందాలనుకునే వారు ఈ రోజు షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు.


జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష షష్ఠి తిథి జూన్ 11వ తేదీ మంగళవారం సాయంత్రం 5:27 గంటలకు ప్రారంభమై జూన్ 12వ తేదీ బుధవారం సాయంత్రం 7:17 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం స్కంద షష్ఠి పండుగను జూన్ 12న మాత్రమే జరుపుకోవాలి.

స్కంద షష్ఠి రోజున ఇలా పూజించండి
స్కంద షష్ఠి రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి.. సూర్యుడికి సంబంధించిన మంత్రాలను జపించండి.
ముందుగా గణేశుడిని, నవగ్రహాలను పూజించండి.
కార్తికేయుని విగ్రహాన్ని ప్రతిష్టించి షోడశోపచార పద్ధతిలో పూజించండి.
స్కంద షష్ఠి రోజున కార్తికేయ స్వామికి వస్త్రాలు, ఆభరణాలు, సువాసనలు, పువ్వులు, ధూపం, దీపం, నైవేద్యం మొదలైన వాటిని సమర్పించండి.
కార్తికేయ భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి హారతి ఇచ్చి పూజను ముగించండి.
దీని తరువాత సుబ్రమణ్యస్వామిని ప్రార్ధించి కోరికను నెరవేర్చమని ప్రార్థించండి.
పూజ సమయంలో “ఓం స్కంద శివాయ నమః” అనే మంత్రాన్ని జపించండి.
కార్తికేయ భగవానుని హారతి పాడి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించండి. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేయండి.
స్కంద షష్ఠి రోజున పేదలకు, ఆపన్నులకు అవసరమైన వస్తువులను దానం చేయండి.
ఈ ప్రత్యేక విషయాలపై శ్రద్ధ వహించండి
స్కంద షష్ఠి వ్రతం సూర్యోదయ సమయంలో ప్రారంభమై మరుసటి రోజు సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ముగుస్తుంది.
షష్ఠి వ్రతం చేసే వారు ఈ రోజున పండ్లు తినండి. సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఆహారం తీసుకోండి.
ఆరోగ్య సంబంధిత సమస్యలున్నవారు షష్ఠి వ్రతాన్ని ఆచరించడం వలన ఆరోగ్యంగా ఉంటారు.
షష్ఠి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి ఆ రోజున కొన్ని సుగంధ ద్రవ్యాలు, మాంసాహారం, మద్యపానం తీసుకోకూడదు.
స్కంద షష్ఠి అంటే ఏమిటో తెలుసుకోండి
స్కంద షష్ఠి అంటే కార్తికేయుడిని పూజించే తిధి. శివ పార్వతుల తనయుడు ‘కార్తికేయ’, ‘సుబ్రమణ్యం’, ‘స్కంద’, ‘కుమార స్వామి’, ‘సుబ్రహ్మణ్య స్వామి ‘ వంటి వివిధ పేర్లతో పిలువబడుతున్నాడు. కార్తికేయుడు శివపార్వతిల తనయుడు. దేవ సైన్యానికి అధిపతి. షష్ఠి రోజున ఆయన్ని పూజించి, ఉపవాసం చేసే భక్తులపై కార్తికేయుడి అనుగ్రహం లభిస్తుందని.. కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.

Related posts

Share via