SGSTV NEWS online
Spiritual

Shravana Masam: ఈ నెల 28వ తేదీ వెరీ వెరీ స్పెషల్.. శివ గణపయ్యలను పూజిస్తే అనుగ్రహం మీ సొంతం..



శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈ నెల ఆధ్యాత్మిక మాసం. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో ఆధ్యాత్మిక కార్యకలాపాలకు, వ్రతాలకు, నోములకు ఎంతో ప్రాముఖ్యత ఉంది, ముఖ్యంగా స్త్రీలు వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరి వ్రతం వంటి పూజలు, నోములు నోచుకుంటారు. శివ భక్తులు సోమవారాల్లో ఉపవాసాలు చేస్తారు. ఈ నెలలో శివ కేశవులను లక్ష్మిదేవి మంగళ గౌరీ లను పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. అయితే ఈ శ్రావణ మాసంలో జూలై 28వ తేదీకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకు జూలై 28వ తేదీ శక్తివంతమైన రోజో తెలుసుకుందాం..


శ్రావణ మాసంలో శివ కేశవులను లక్ష్మిదేవి మంగళ గౌరీ లను పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ సంవత్సరం, జూలై 28 కోరికలను కోరుకోవడానికి.. వాటిని నెరవేర్చుకోవడానికి శక్తివంతమైన రోజు. ఎందుకు అని ఆలోచిస్తున్నారా? దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఈ రోజు శ్రావణ మాసం మొదటి సోమవారం అంతేకాదు సంకహర వినాయక చవితి. ఈ రెండు రెండు సందర్భాలు ఈ రోజును చాలా ప్రత్యేకమైనవిగా చేస్తున్నాయి. భక్తులు నిర్మల మైన హృదయంతో తమకు కావలసినది కోరుకోవచ్చు. శివుడు, గణేశులు సంతోషించి తన భక్తులను అనుగ్రహించే అవకాశం ఉందని నమ్మకం.


శ్రావణ మాసంలోని ప్రతి రోజూ ప్రవిత్రమైనవే.. అయితే సోమవారాలను శివుడిని పూజించే పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఎందుకంటే శివుని ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. అంతే కాదు సంకహర వినాయక చవితి అనేది గణేశుడిని పూజించే పండుగ. జీవితంలోని అన్ని కష్టాలను, అడ్డంకులను తొలగించే దేవుడు. జూలై 28న చతుర్థి తిథి జూలై 27న రాత్రి 10:40 గంటలకు ప్రారంభమై జూలై 28న రాత్రి 11:24 గంటలకు ముగుస్తుంది. ఈ నేపధ్యంలో సంకహర వినాయక చవితిని జూలై 28న జరుపుకోవాల్సి ఉంటుంది.

శ్రావణ సోమవారం జూలై 28వ తేదీ ప్రాముఖ్యత

1   ఎవరైనా వివాహం, సంతానం, శాంతి, విజయం కోసం ప్రార్థిస్తుంటే.. ఈ రోజున శివుడు, గణపతిని పూజించాలి. తండ్రి తనయుడు మీ కోరికలు విని.. త్వరగా మీ కోరికలను తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

2   వ్యాధులు, దోషాలు, పితృ శాపాల నుంచి కూడా ఈ రోజున ఉపశమనం పొందే అవకాశం ఉంది.

3 ఈ రోజు మానసిక ప్రశాంతతను కూడా పెంపొందిస్తుంది. ఇది మనస్సులో స్పష్టతను తెస్తుంది.

4  ఇది చంద్రుడు, రాహువు, కేతువు వంటి గ్రహాలను ప్రభావితం చేసే గ్రహ బాధలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.


5  స్టూడెంట్స్ పరీక్షలలో మంచి ఫలితాలు, ఉన్నత విద్యలో మంచి ఫలితాలు మొదలైన వాటి కోసం ఈరోజు శివుడు, గణపతిని ప్రార్థించవచ్చు.

Related posts