SGSTV NEWS
Astro TipsSpiritual

Lord Shani: శని దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. శనీశ్వర అనుగ్రహం కోసం ఈ పరిహారాలు చేసి చూడండి..



హిందూ మతంలో శనీశ్వరుడిని న్యాయ దేవుడుగా , కర్మ ఫలితాలను ఇచ్చేవాడిగా భావిస్తారు. జ్యోతిషశాస్త్రంలో శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని సులభమైన చర్యలు ఇవ్వబడ్డాయి. వీటిని పాటించడం ద్వారా మీరు శనీశ్వరుడి కోపాన్ని నివారించవచ్చు. ఈ రోజు శనీశ్వరుడిని ఆగ్రహం కోసం ఏ నివారణ చర్యలు చేయాలో తెలుసుకుందాం..

హిందూ మతంలో కర్మ ఫలాలను ఇచ్చే శనిదేవుడిని పూజించడం ద్వారా మనుషుల జీవితంలో శుభ ఫలితాలు పొందుతారని నమ్ముతారు. మరోవైపు శని ప్రభావంతో బాధపడేవారికి లేదా శని దోషంతో బాధపడేవారికి కొన్ని ఉత్తమ పరిహారాలు ఉన్నాయి. శనీశ్వరుడి అనుగ్రహం కోసం ఎటువంటి నివారణ చర్యలు చేయడం శుభప్రదమో ఈ రోజు తెలుసుకుందాం.. ఈ నివారణ చర్యలు చేయడం ద్వారా శనిశ్వరుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీ దేవి ఆశీర్వాదాలను కూడా పొందవచ్చు.

శని దేవుడితో పాటు లక్ష్మీదేవి కూడా మన పట్ల దయతో ఉంటుంది.
శని దేవుడిని కర్మఫలదత అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అతను వ్యక్తులు చేసే కర్మల ఆధారంగా శుభ లేదా అశుభ ఫలితాలను ఇస్తాడు. శనిశ్వరుడి కోపాన్ని నివారించడానికి కొన్ని పరిహారాలు చేయడం శుభ ప్రదం. ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తే.. శనిశ్వరుడి కోపం నుంచి రక్షించబడతారు. దీనితో పాటు సంపద దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీస్సులు కూడా మీపై ఉంటాయి.

శని దేవుని అనుగ్రహం కోసం ఏమి చేయాలంటే
రావి చెట్టుకి పూజ: హిందూ మత విశ్వాసాల ప్రకారం సకల దేవుళ్ళు, దేవతలు రావి చెట్టులో నివసిస్తున్నారని నమ్ముతారు. శనీశ్వరుడి ఆశీర్వాదం పొందడానికి రోజూ రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే రావి చెట్టు నీడలో నిలబడి.. ఒక ఇనుప పాత్రలో నీరు, చక్కెర, నెయ్యి, పాలు కలిపి రావి చెట్టుకి సమర్పించండి. ఇలా చేయడం వల్ల శనిశ్వరుడి అనుగ్రహంతో ఆనందం, శ్రేయస్సు మీ సొంతం.

హనుమంతుని పూజ: శనిదేవునితో కలిసి హనుమంతుని పూజించడం వల్ల శనీశ్వరుడి కలిగించే అడ్డంకుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు శనివారం శనిశ్వరుడి ఆలయానికి వెళ్లి ఆవ నూనె దీపం వెలిగించండి. ఇలా చేయడం ద్వారా శని కోపం నుంచి ఉపశమనం లభించి.. ఆయన అనుగ్రహం లభిస్తుంది.

నల్ల ఆవును సేవించడం: హిందూ మత విశ్వాసం ప్రకారం నల్ల ఆవును సేవించడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. నల్ల ఆవుకి పూజ చేసి నుదుటిన కుంకుమ దిద్ది, ఆవు కొమ్ములకు పవిత్ర దారం కట్టి, ధూపం వేయండి. ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా శనిశ్వరుడి ఆశీస్సులు త్వరలోనే లభిస్తాయని.. లక్ష్మీదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలు మీ సొంతం అని నమ్ముతారు.

Also Read

Related posts

Share this