November 21, 2024
SGSTV NEWS
CrimeSpiritual

Basara Temple: బాసర సరస్వతి ఆలయంలో బయటపడ్డ ఇంటి దొంగల బాగోతం..!

బాసర ఆలయంలో లడ్డూ టిక్కెట్ల గోల్‌మాల్‌ కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై స్పందించిన అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు బాధ్యులైన ఇద్దరు ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్‌తోపాటు, నలుగురు రోజువారీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు బాసర ఆలయ ఈవో.

నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో ఇంటి దొంగల బాగోతం బయటపడింది. లడ్డూ, పులిహోర ప్రసాదాల్లో గోల్‌మాల్ చేస్తున్న సిబ్బంది గుట్టురట్టు అయింది. బాసర ఆలయ సిబ్బంది.. లడ్డూ, పులిహోర ప్యాకెట్లను రిజిస్టర్లలో తక్కువ ఎంట్రీ చేసి.. ఎక్కువ తీసుకొచ్చి టికెట్‌ కౌంటర్లలో అమ్ముతున్నట్లు గ్రామస్తులకు తెలియడంతో ఆలయ ఈవో విజయరామారావు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో.. బాసర ఆలయంలో లడ్డూ, పులిహోర కౌంటర్లలో ఈవో తనిఖీలు చేయగా..ప్రసాదాల్లో గోల్‌మాల్ చేస్తూ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

Also read :Shadnagar: షాద్‌నగర్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. ముక్కముక్కలైన మృతదేహాలు

అలాగే.. టికెట్లు కూడా రీసైక్లింగ్ అవుతున్నట్లు గుర్తించి.. చింపకుండా ఉన్న టికెట్లను సేకరించారు. వీటి ఆధారంగా ప్రసాదాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. పులిహోర బండిలో 690 ప్యాకెట్లు ఉండగా రిజిస్టర్‌లో మాత్రం 350 నమోదు చేశారు. రిజిస్టర్‌లో లెక్కలకంటే అదనంగా భారీస్థాయిలో ప్రసాదం ప్యాకెట్లు ఉండడంతో షాకయ్యారు. వాస్తవానికి.. ఒక్కొక్క బాక్స్‌లో 100 లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు మాత్రమే ఉండాలి. కానీ.. ఒక్కో బాక్స్‌లో 50 నుంచి 60 ప్యాకెట్లు అదనంగా ఉన్నట్లు తేలింది.

Also read :VJA Murder: తండ్రి ప్రాణాలు బలి తీసిన కుమార్తె ప్రేమ.. ప్రేమికుడి ఘాతుకం, నడిరోడ్డుపై దారుణ హత్య

ఈ క్రమంలోనే.. ఆలయ ప్రసాదాల ఇన్‌ఛార్జ్‌ అధికారులపై ఈవో సీరియస్ అయ్యారు. లడ్డూ, పులిహోర స్టోర్ ఇన్ఛార్జ్, టికెట్ కౌంటర్ ఇన్ఛార్జ్‌లను సస్పెండ్ చేయడంతోపాటు.. మరో నలుగురు రోజువారీ సిబ్బందిని విధులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈవో విజయరామారావు. ఇలాంటి చర్యలు ఇక ముందు జరగకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు.. బాసర సరస్వతి అమ్మవారి ప్రసాదంలో చేతివాటం ప్రదర్శించడంపై భక్తులు మండిపడుతున్నారు. అయితే.. లడ్డూ, పులిహోర టికెట్లు కౌంటర్లలో ఆలయ అధికారులను కాకుండా తాత్కాలిక ఉద్యోగులు నియమించడంతోనే కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి

Also read :Andhra Pradesh: ఛీ.. ఛీ.. వీడిని ఏమనాలి.. అంతటి నీచానికి దిగజారాడు.. వాడికి తగిన శాస్తే జరిగింది..

Related posts

Share via