SGSTV NEWS
Spiritual

Pitru Paksha: పితృపక్షంలో ఇవి తింటే దోషాలు తప్పవు! పితృదేవతల ఆగ్రహానికి కారణమయ్యే పదార్థాలివే



పితృపక్షం.. ఇది మన సంస్కృతిలో పూర్వీకులను స్మరించుకునే అత్యంత పవిత్రమైన సమయం. మన పెద్దలు మన మధ్య లేకపోయినా, ఈ పదిహేను రోజులు వారు మనతోనే ఉంటారని, వారి ఆశీర్వాదం పొందాలంటే కొన్ని నియమాలను పాటించాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏవి తినకూడదు అనే విషయాలపై ఎన్నో సందేహాలు ఉంటాయి. పితృపక్షం రోజులలో పితృదేవతలకు ప్రీతికరమైన ఆహారమేంటో, వారి ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే ఏ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.


హిందూ ధర్మంలో పితృపక్షానికి అత్యంత పవిత్రమైన ప్రాముఖ్యత ఉంది. దీనిని శ్రాద్ధ పక్షం అని కూడా అంటారు. పితృపక్షం సమయంలో పితృదేవతలు భూమి మీదకు వచ్చి తమ వంశీయుల నుంచి అన్నం, నీరు, దానం ఆశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 21 వరకు పితృపక్షం కొనసాగుతుంది. ఈ 15 రోజులు పితృదేవతల ఆత్మ శాంతికై ప్రజలు శ్రాద్ధం, పిండ ప్రదానం, తర్పణం నిర్వహిస్తారు.

ఢిల్లీకి చెందిన ప్రముఖ జ్యోతిష పండితురాలు మనీషా కౌశిక్ ప్రకారం, పితృపక్షం రోజుల్లో సాత్విక జీవనశైలి, సంయమనం అవసరం. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాటిలో కొన్ని..

మాంసాహారం: పితృదోషానికి కారణం
పితృపక్షంలో మాంసాహారం, చేపలు, గుడ్లు వంటి వాటిని తినకూడదు. ఈ ఆహారాలు తామసిక గుణం కలిగి ఉంటాయి. ఇవి పితృదేవతల ఆత్మ శాంతికి ఆటంకం కలిగిస్తాయి.


ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా తినకూడదు
పూజలలో, ఇతర శుభ కార్యాలలో ఉల్లిపాయ, వెల్లుల్లిని తినడం అశుభమని భావిస్తారు. ఈ రెండూ శ్రాద్ధం, తర్పణం పవిత్రతను ప్రభావితం చేస్తాయి. ఈ కాలంలో సాత్విక ఆహారం మాత్రమే ఉత్తమమని జ్యోతిష నిపుణులు తెలిపారు.

మసాలాలు, పప్పులతో జాగ్రత్త
తామసిక ఆహార జాబితాలోకి వచ్చే మినుము, కందిపప్పు, ఇతర మసాలా వంటకాలను కూడా పితృపక్షంలో తినకూడదు. వీటిని తినడం పితృదోషానికి కారణం అవుతుంది.

సాత్విక జీవనశైలి పాటించండి
పితృపక్షం సమయంలో సాత్విక ఆహారం మాత్రమే కాకుండా, మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ప్రతిరోజూ సూర్యుడికి నీరు సమర్పించడం, బ్రాహ్మణులకు, పేదలకు దానం ఇవ్వడం, శ్రాద్ధ కార్యక్రమాలను విధిగా చేయడం ద్వారా పితృదేవతలు సంతోషిస్తారని జ్యోతిష పండితురాలు చెప్పారు.

Related posts

Share this