April 14, 2025
SGSTV NEWS
Astrology

Weekly Horoscope: ఆ రాశుల వారికి రాజయోగాలు పట్టే ఛాన్స్..12 రాశుల వారికి వారఫలాలు




వార ఫలాలు (ఏప్రిల్ 13-19, 2025): మేష రాశి వారికి ఏలిన్నాటి శని ప్రభావం వల్ల ఖర్చులు పెరగడం, మధ్య మధ్య ఆరోగ్య సమస్యలు తలెత్తడం, ప్రతి పనిలోనూ ఆటంకాలు ఉండడం, ఆలస్యాలు చోటు చేసుకోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి కొంత కాలం పాటు ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. మిథున రాశివారికి ఈ వారం రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..



మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఏలిన్నాటి శని వల్ల ఖర్చులు పెరగడం, మధ్య మధ్య ఆరోగ్య సమస్యలు తలెత్తడం, ప్రతి పనిలోనూ ఆటంకాలు ఉండడం, ఆలస్యాలు చోటు చేసుకోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. అయితే, ధన స్థానంలో ఉన్న గురువు, చతుర్థ స్థానంలో ఉన్న రాశ్యదిపతి కుజుడి వల్ల కష్ట నష్టాలు బాగా తగ్గి శుభ ఫలితాలు కూడా ఎక్కువగా అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సవ్యంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు, అవివాహితులకు శుభవార్తలు అందుతాయి. కొద్ది శ్రమతో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బంది పడతారు.


వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

లాభ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో సహా అయిదు గ్రహాలు సంచారం చేస్తున్నందువల్ల మరి కొంత కాలం పాటు ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలకు కొరత ఉండదు. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి తొలగిపోతుంది. కుటుంబ జీవితంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. అనుకోకుండా బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.


మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రాశ్యధిపతి బుధుడితో పాటు నాలుగు గ్రహాలు దశమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఈ వారం రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతి కలగడం, జీతభత్యాలు పెరగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఉద్యోగులకు వివిధ సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు విస్తరిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రాశ్యధిపతి బుధుడితో పాటు నాలుగు గ్రహాలు దశమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఈ వారం రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతి కలగడం, జీతభత్యాలు పెరగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఉద్యోగులకు వివిధ సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు విస్తరిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఈ రాశికి భాగ్య స్థానంలో ఉచ్ఛ శుక్రుడితో సహా నాలుగు గ్రహాలు, లాభ స్థానంలో గురువు సంచా రం వల్ల ఈ వారం ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా నూరు శాతం విజయవంతం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఒకటి రెండు శుభకార్యాల్లో పాల్గొంటారు వృత్తి, వ్యాపారాల్లో ఊహించని విధంగా రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉండవచ్చు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.


సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

దశమ స్థానంలో గురువు, లాభ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నంత కాలం ఈ రాశివారి ఉద్యోగానికి, వృత్తి, వ్యాపారాలకు, ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. అవన్నీ సాఫీగా, హ్యాపీగా సాగిపోయే అవకాశం ఉంది. అష్టమ స్థానంలో గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్ల కుటుంబ ఖర్చులతో సహా అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయం మీద శ్రద్ధ పెంచాల్సి వస్తుంది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి.


కన్య (ఉత్తర 2,3,4, హస్త,  చిత్త 1,2)

రాశ్యధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడితో కలిసి ఉండడం, భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల వారం రోజుల పాటు జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి.


తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రాశ్యధిపతి శుక్రుడు ఆరవ స్థానంలో ఉచ్ఛలో ఉండడం, అదే రాశిలో మరో నాలుగు గ్రహాలు కూడా సంచారం చేస్తుండడం వల్ల ఆర్థిక సమస్యలు, ఆస్తి వివాదాలు, అనారోగ్యాలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు విముక్తి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆదాయం పెరుగుదలకు సంబంధించి ఏ అవకాశాన్నీ జారవిడుచుకోరు. ఆర్థిక వ్యవహారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పని తీరు అధికారులకు బాగా నచ్చుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధుమిత్రుల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది.


వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఈ రాశికి పంచమంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం, సప్తమ స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. రావలసిన సొమ్ము, బాకీలు, బకాయిలు తప్పకుండా వసూలవుతాయి. ఉద్యోగంలో ఈ రాశివారి సమర్థతకు, ప్రయోజకత్వానికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్ని పెంచుతాయి. చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.


ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉచ్ఛ శుక్రుడితో పాటు నాలుగు గ్రహాలు సంచారం చేయడం ఈ రాశి వారికి అన్ని విధాలా శుభప్రదం. మానసిక, శారీరక ఒత్తిళ్లు తగ్గుతాయి. మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగ, కుటుంబ బాధ్యతల్ని సంతృప్తికరంగా నిర్వర్తించగలుగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రత్యేకతను నిరూపించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. నిరుద్యోగులకు కాలం కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.


మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో ఉచ్ఛ శుక్రుడితో కలిసి ఉండడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. అనేక విధాలుగా ఆదాయ వృద్ధికి అవకాశముంది. ఉద్యోగంలో మీ పని తీరుకు అధికారుల నుంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. హోదా పెరగడానికి అవకాశముంది. ముఖ్య మైన వ్యవహారాలను పూర్తి చేయడంలో స్నేహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేపడతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. 


కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి శనితో ఉచ్ఛ శుక్రుడు, బుధుడు కలవడం వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఆదాయం పెరగడానికి ఏ ప్రయత్నం చేపట్టినా విజయ వంతం అవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందుతుంది. వివాహ ప్రయత్నాలు సానుకూలపడతాయి. రావలసిన డబ్బును, బాకీలను కొద్ది ప్రయత్నంతో రాబట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలపై శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. వృథా ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది.


మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశిలో నాలుగు గ్రహాలు సంచారం చేస్తుండడం, రాశ్యధిపతి గురువు తృతీయస్థానంలో ఉండడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా నెరవేరుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభసాటి వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది.

Spiritual

  Weekly horoscope

13 april 2025 19 april 2025

astrological predictions

Related posts

Share via