వారఫలాలు (నవంబర్ 9-15, 2025): మేష రాశి వారికి ఈ వారం ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోతాయి. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. వృషభ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. మిథున రాశి వారు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆదివారం (09 నవంబర్) మొదలు శనివారం(15 నవంబర్) వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలను అందుకుంటారు. వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోతాయి. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. తోబుట్టువులతో ఆస్తి వివాదాలను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. తరచూ విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని పఠించడం వల్ల లాభం ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రావలసిన సొమ్ము తప్పకుండా చేతికి అందుతుంది. వ్యయ ప్రయాసాలను లెక్క చేయకుండా పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కుటుంబపరంగా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆస్తి వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. అదనపు ఆదాయానికి అవకాశముంది. వృత్తి, ఉద్యోగాలలో ఇతరుల వ్యవహారాలకు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాల పరిస్థితి నిలకడగానే సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. తరచూ గణపతి స్తోత్రాన్ని పఠించడం చాలా అవసరం.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. మంచి పరిచయాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల మార్పులు చేపడతారు. కొత్త నిర్ణయాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. ఆస్తి సంబంధమైన విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తలపెట్టిన పనుల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. తరచూ లలితా సహస్ర నామ స్తోత్ర పఠనం శుభ ఫలితాలనిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అన్ని విధాలుగానూ కలిసి వస్తుంది. రాజపూజ్యాలు కూడా కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. కొందరు మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవ కాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తరచూ స్కంద స్తోత్రం పఠించడం వల్ల అష్టమ రాహువు దోషం తొలగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగులతో కూడా ఇబ్బందులుంటాయి. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజ కీయాలు, ఇతర బిజినెట్ రంగంలో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. చిన్న నాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. తలపెట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు సర్దుమణుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ధనప రంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఆశించిన శుభవార్తలు వింటారు. ఈ రాశివారికి ప్రస్తుతం సుందరకాండ పారాయణం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవు తుంది. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఉద్యోగంలో అధికారులు ఈ రాశివారి మీద ఎక్కువగా ఆధారపడతారు. తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తులవారికి గుర్తింపుతో పాటు డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. ఇంటికి ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. ముఖ్యమైన ఆర్థిక ప్రయత్నాలు అంచనాలకు మించి సత్ఫలితా లనిస్తాయి. మిత్రుల సహాయంతో అత్యవసర పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ రాశివారు తరచూ శివార్చన చేయడం లాభిస్తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదాయంతో సమానంగా ఖర్చులుంటాయి. వృత్తి, ఉద్యోగాల మీద ఎక్కువ సమయం పెట్టాల్సి వస్తుంది. ఆదాయానికి, ప్రతిఫలానికి లోటుండదు. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాలలో కొద్దిపాటి మార్పులను చేపట్టి, ఆర్థికంగా లబ్ధి పొందు తారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ప్రముఖ వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. దుర్గాస్తుతి పఠించడం వల్ల శత్రు జయం కలుగుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
గురు బలంతో పాటు, రాశ్యధిపతి కుజుడి బలం కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. కొన్ని కష్టనష్టాలు, సమస్యలు, ఒత్తిళ్ల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృథా ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటిస్తారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఇల్లు, వాహనం కొనడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వృత్తి, ఉద్యోగాలు మెరుగ్గా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. తరచూ సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల జీవితం మరింత మెరుగుపడుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1)
కొద్ది శ్రమతో ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ, చేతిలో డబ్బు నిలిచే అవకాశం ఉండదు. ఉచిత సహాయాలు, దానధర్మాలు బాగా తగ్గించుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశివారి సలహాలు, సూచనలు అధికారులకు బాగా ఉపయోగపడతాయి. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది. విందు కార్యక్రమంలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అంది, అవసరాలు తీరిపోతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఆపర్లు అందుతాయి. దత్తాత్రేయ స్తోత్రం పఠించడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. పని ఒత్తిడి, పని భారం నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా కొద్దిపాటి ఒడిదుడుకుల తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి జీవితంలో తీరిక ఉండే అవకాశం లేదు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. జీవిత భాగస్వామి సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగవద్దు. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం పరవాలేదు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఈ రాశివారు తరచూ ఆదిత్య హృదయం పఠించడం చాలా మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో గౌరవాభిమానాలకు లోటుండదు. అధికారులు అతిగా ఆధారపడడం జరుగు తుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు వెడతాయి. చాలా కాలంగా పెండింగులోఉన్న పనుల్ని కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు. ప్రయా ణాల్లో, ఆహార నియమాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఈ రాశివారు తరచూ శివార్చన చేయడం అవసరం.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉండి శనిని వీక్షించడం వల్ల ఏలిన్నాటి శని ప్రభావమేమీ ఉండకపోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. స్వయం ఉపాధి, వ్యాపారాలు ఆర్థికంగా బాగా కలిసి వస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. నిరు ద్యోగులకు మంచి ఆఫర్ అంది వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి అనుకోకుండా ఉప శమనం లభిస్తుంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఈ రాశివారు శివార్చన చేయడం మంచిది.
Also read
- వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్దామనకుంటున్నారా..? అయితే మీకే ఈ అలెర్ట్!
- నేటి జాతకములు.14 నవంబర్, 2025
- సృజన్ ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటి?
- కె జి హచ్ వైద్యం అందక గిరిజన పసికందు మృతి
- ఏడో తరగతి బాలుడిపై లైంగికదాడి





