వార ఫలాలు (నవంబర్ 2-8, 2025): మేష రాశి వారికి ఈ వారం బాగా ఆదాయ లాభాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అధికారులు ఎక్కు వగా ఆధారపడడం జరుగుతుంది. మిథున రాశి వారు ఆర్థిక సమస్యలను చాలావరకు పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గ్రహ బలం బాగా యోగదాయకంగా ఉంది. బాగా ఆదాయ లాభాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చాలా వరకు చక్కబెడతారు. వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. జీవిత భాగస్వామి కోసం వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. చదువుల్లో విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు, అవివాహితులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ధన, లాభ స్థానాలు బాగా పటిష్ఠంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన సొమ్మును, రాదనుకున్న సొమ్మును గట్టి ప్రయత్నంతో రాబట్టుకుంటారు. అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి. కానీ, అనవసర ఖర్చు లతో ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో పని భారం బాగా పెరిగే అవకాశం ఉంది. అధికారులు ఎక్కు వగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ధన స్థానంలో ఉచ్ఛ గురువు సంచారం వల్ల అనేక విధాలుగాఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే, రాశ్యధిపతి బుధుడి షష్ట స్థితి వల్ల అనవసర ఖర్చులకు, అనుకోని ఖర్చులకు బాగా అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలను కూడా చాలావరకు పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా బలం పుంజుకుంటాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం వల్ల ఇతరులకు ఇతోధికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. విద్యార్థులు చదువు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఈ రాశిలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్న తులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ లాభాలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉన్నత కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రాశ్యధిపతి రవి నీచ స్థితి వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాబల్యం బాగా తగ్గే అవకాశం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక విషయాల్లో లావాదేవీలు పెట్టుకోకపోవడం, ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం ఉత్తమం. ఇంటా బయటా ఆశించిన అనుకూలతలుంటాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు పాక్షికంగా నెరవేరుతాయి. కొద్దిపాటి అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. కీలక వ్యవహారాలు శ్రమ మీద పూర్తవుతాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఇబ్బందులు పడడం జరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఈ రాశికి లాభ స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం, ధన స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆర్థికంగా బలం పెరిగే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా. ఉత్సా హవంతంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తారు. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయపడతారు. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండవద్దు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు బాగా హ్యాపీగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఈ రాశిలో రాశినాథుడు శుక్రుడి సంచారం, దశమ స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం వంటి కారణాల వల్ల వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి బాగా అవకాశం ఉంది. కొత్త లక్ష్యాలు, కొత్త ప్రాజెక్టులు చేతికి అంది వస్తాయి. బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపో వచ్చు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వ్యాపారాల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఈ రాశిలో రాశ్యధిపతి కుజుడి సంచారం, భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛలో ఉండడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. సమర్థమైన పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. బంధుమిత్రులకు ఎంతో సహాయంగా ఉంటారు. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే ఆలోచనలు చేస్తారు. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఆర్థికంగా, కెరీర్ పరంగా ఉచ్చలోకి రావడం జరుగుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. పదోన్నతి కలిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా, లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగా వకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల్ని చాలావరకు పరిష్కరించుకుంటారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థు లకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, దశమంలో శుక్రుడు, లాభ స్థానంలో కుజుడి సంచారం వల్ల అటు ఉద్యోగ జీవితంలోనూ, ఇటు కుటుంబ జీవితంలోనూ కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయ ప్రయత్నాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. వ్యాపారాలు ప్రారంభించే అవకాశం కూడా ఉంది. కుటుంబపరంగా పురోగతి చెందడం జరుగుతుంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా, సాఫీగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఈ రాశికి ప్రస్తుతం భాగ్య స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారుల నుంచి అనుకూలతలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువు ఉచ్ఛపట్టడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం కావడం, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావడం వంటివి జరుగుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. దూరపు బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులు, సన్నిహితులతో విందులో పాల్గొంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది
Also read
- Garbarakshambigai: మహిళామూర్తులకు సుఖ ప్రసవం చేసేందుకు సాక్షాత్తు జగన్మాత వెలిసిన క్షేత్రం-‘గర్భరక్షాంబిక ఆలయం’, తిరుకరుకావుర్
- నేటి జాతకములు…3 నవంబర్, 2025
- వికారాబాద్‌లో దారుణం.. వదిన, భార్య, పిల్లలను కొడవలితో నరికి చంపి, ఆపై భర్త సూసైడ్!
- Weekly Horoscope: వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు
- ఎనిమిదో తరగతి బాలికపై లైంగిక దాడి
- ఆర్థిక ఇబ్బందులతో ఎస్సై బలవన్మరణం
- కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్
- ‘తిరుమలలో దర్శనానికి అనుమతించలేదు.. అందుకే మా పొలంలో గుడి కట్టా’.. చరిత్ర ఇదిగో
- పాలు అమ్ముతూనే కోట్లలో బంగారం వ్యాపారం.. ఇంతకీ పాలుకి, పసిడికి లింకేంటి..?
- లెక్చరల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య?.. వాట్సాప్ ఛాట్‌లో వెలుగులోకి సంచలన విషయాలు










