జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, రాశులు, నక్షత్రాలకు సంబంధించిన ప్రతి విషయం వివరిస్తుంది. అవి మానవులపై చూపించే మంచి, చెడుల ప్రభావం.. మంచి చెడుల గురించి తెలియజేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం నవ గ్రహాలకు లోహాలకు ఉన్న సంబంధం గురించి కూడా తెలియజేస్తుంది. ఏదోక గ్రహం ఏదోక లోహంతో సంబంధం ఉంటుంది. కొన్ని రాశులవారు పొరపాటున కూడా వెండి వస్తువులను దరించ వద్దని వెల్లడించింది. ఆ రాశులు ఏమిటో ఎందుకు దరించ కూడదో తెలుసుకుందాం..

జ్యోతిషశాస్త్రం ప్రకారం లోహాలు ఏదో ఒక గ్రహం ద్వారా ప్రభావితమవుతాయి. ఇనుమును శని గ్రహం లోహంగా, బంగారాన్ని బృహస్పతి లోహంగా పరిగణించినట్లే.. చంద్రుడు వెండిని పాలిస్తాడు. అంతేకాదు చంద్రుడు నీటితో సంబంధం కలిగి ఉంటాడు. చంద్రుడు చల్లదనం, చంచలతకు కారకం. రాశులు మొత్తం 12 ఉన్నాయి. వీటిలో కొన్ని అగ్ని మూలకాలు, కొన్ని నీటి మూలకాలు, కొన్ని భూమి మూలకాలుగా పరిగణించబడతాయి. మరికొన్ని గాలి మూలకాలుగా పరిగణించబడతాయి. కనుక మూడు రాశులకు చెందిన వ్యక్తులు వెండి ఆభరణాలను ధరించకూడదని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. ఈ మూడు రాశుల వ్యక్తులు వెండి వస్తువులను ధరిస్తే..అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఏ రాశుల వారు వెండిని ఎందుకు ధరించకూడదు? కలిగే నష్టాలు ఏమిటి తెలుసుకుందాం..
వెండిని ఎవరు ధరించకూడదంటే.. జ్యోతిషశాస్త్రం ప్రకారం మేషం, ధనుస్సు, సింహ రాశుల వారు వెండి వస్తువులను ధరించకూడదు. ఈ మూడు రాశులు అగ్ని రాశులకు చెందినవి. వెండిని పాలించే గ్రహం చంద్రుడికి నీటితో సంబంధం ఉంది. కనుక అగ్ని, నీరు ఈ రెండూ వ్యతిరేక అంశాలు అని.. వీటిని కలపడం వల్ల హాని కలుగుతుందని జ్యోతిషశాస్త్రం సూచిస్తుంది. వెండి వస్తువులను ధరించడం వల్ల ఈ రాశుల వారు ఎదుర్కొనే నష్టాలు ఏమిటంటే..
మేష రాశి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారికి పాలక గ్రహం కుజుడు. వెండి ఉంగరం ధరించడం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు. ఈ రాశి వారు వెండి వస్తువులను ధరిస్తే లేదా ఉపయోగిస్తే.. వీరి ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు.
సింహ రాశి : సింహ రాశిని పాలించే గ్రహం సూర్యుడు. సూర్యుడిని వేడి గ్రహంగా భావిస్తారు. చంద్రుడు చల్లని, ప్రశాంతమైన గ్రహం. కనుక వెండి వస్తువులు ధరించడం వల్ల ఈ రాశిలో జన్మించిన వారికి హాని కలుగుతుందని నమ్ముతారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు వెండిని ఉపయోగిస్తే.. వీరు ఏ పని మొదలు పెట్టినా.. ఆ పనికి అంతరాయం కలగవచ్చు . ఆర్థిక నష్టాలను కూడా చవిచూడవచ్చు.
ధనుస్సు రాశి :ధనుస్సు రాశి వారిని పాలించే గ్రహం బృహస్పతి. గురు గ్రహం లోహం బంగారం. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రాశిలో జన్మించిన వారికి వెండి కూడా మంచి లోహంగా పరిగణించబడదు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు వెండి ఉంగరం లేదా మరేదైనా ఆభరణాలను ధరిస్తే.. వీరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
Also read
- Diwali 2025: దీపావళి రోజున పాత ప్రమిదల్లో దీపాలు వెలిగించడం శుభమా? అశుభమా? నియమాలు తెలుసుకోండి..
- Astro Tips: ఈ రాశుల వారు వెండి ధరించారో బతుకు బస్టాండే.. తస్మాత్ జాగ్రత్త
- నేటి జాతకములు…16 అక్టోబర్, 2025
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత