మాస ఫలాలు (నవంబర్ 1-30, 2025): మేష రాశి వారికి 4 గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెలంతా అనుకూలంగానే సాగిపోతుంది. ద్వితీయార్థం కంటే ప్రథమార్థంలో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారు శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మిథున రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది కానీ, ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి నవంబర్ మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రాశ్యధిపతి కుజుడితో సహా నాలుగు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నెలంతా అనుకూలంగానే సాగిపోతుంది. ద్వితీయార్థం కంటే ప్రథమార్థంలో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇతరత్రా కూడా శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలపడతాయి. కుటుంబంలోనే కాక ఉద్యోగంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ముందుకు దూసుకువెడతారు. ఆరోగ్యానికి లోటుండదు. విదేశీ యానానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నవారు అక్కడ స్థిరత్వం సంపాదించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్థాయి. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా సానుకూలంగా, హ్యాపీగా సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశ్యధిపతి శుక్రుడు, కుజ, బుధ, శనుల అనుకూలత వల్ల నెల రోజుల జీవితం నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆస్తి వివాదం బాగా అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాలను సజావుగా చక్కబెడతారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ధన స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది కానీ, రాశ్యధిపతి బుదుడు షష్ట స్థానంలో ఉన్నందువల్ల ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం చాలా మంచిది. గురువు ఉచ్ఛ స్థితి వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి వెళ్లే అవకాశం ఉంది. మనసు లోని కోరికలు నెరవేరుతాయి. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఇతరులకు ఆర్థిక సహాయం అందించగల స్థితిలో ఉంటారు. కుటుంబపరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో కుజుడి సంచారం వల్ల నెలంతా శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం, జీతభత్యాలు పెరగడం వంటివి జరగవచ్చు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులు శుభ వార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. స్నేహితులు, సహచరుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడే సూచనలున్నాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. కొందరు బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. విద్యార్థులకు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రాశ్యధిపతి రవి ఈ నెల 16 వరకు నీచ స్థితిలో ఉండి, 16 తరువాత మిత్ర క్షేత్రమైన వృశ్చికంలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలతలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ద్వితీయార్థంలో ఈ రాశివారికి కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నవారికి ఇది చాలావరకు అనుకూల సమయం. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ప్రథమార్థంలో డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వల్ల ఇబ్బంది పడతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు హుషారుగా సాగిపోతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
రాశ్యధిపతి బుధుడు తనకు శత్రు క్షేత్రమైన వృశ్చిక రాశిలో ఈ నెలంతా సంచారం చేస్తున్నందు వల్ల ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనవసర వ్యవహారాల మీద డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. షష్ట స్థానంలో ఉన్న రాహువు వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడి, మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాల విషయంలో శుభ వార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలలో ఆశాభంగాలు తప్పకపోవచ్చు. కొందరు మిత్రులతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం అవసరం. తల్లితండ్రుల సహకారం లభిస్తుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడు సంచారం చేయడం, ధన స్థానంలో కుజ, బుధులు, దశమ స్థానంలో ఉచ్ఛ గురువు, షష్ట స్థానంలో శని సంచారం వల్ల ఈ నెలంతా ఈ రాశివారికి నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకుంటారు. ఆర్థిక విష యాల్లో కొందరు బంధుమిత్రులతో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందుడుగు వేస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
రాశ్యధిపతి కుజుడు ఇదే రాశిలో కొనసాగుతున్నందువల్ల ఈ రాశివారికి నెలంతా శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు వీరి మీద ఎక్కువగా ఆధారపడతారు. సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ధనాధిపతి గురువు భాగ్య స్థానంలో ఉచ్ఛలో ఉండడం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభి స్తుంది. కుటుంబ సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఇష్టమైన బంధువులతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు లభించే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రాశ్యధిపతి గురువు ఉచ్ఛలో ఉండడం, లాభాధిపతి శుక్రుడు లాభ స్థానంలో, రాహువు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. షేర్లు, స్పెక్యులేష న్లతో సహా అనేక ఆదాయ మార్గాలు విశేష లాభాలనిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రావలసిన బాకీలు, బకాయీలన్నీ వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశివారి సూచనలు, సలహాల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగం సంపా దించే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ జీవితంలో దూసుకుపోతారు.
.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
తృతీయంలో రాశ్యధిపతి శని, సప్తమంలో ఉచ్ఛ గురువు, దశమంలో దశమాధిపతి శుక్రుడు, లాభ స్థానంలో కుజ, బుధుల సంచారం వల్ల ఈ రాశివారి జీవితం నెలంతా నల్లేరు మీద బండిలా సాగిపోయే అవకాశం ఉంది. కొద్దిగా ధన నష్టం ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఇంటా బయటా మాటకు, చేతకు తిరుగుండదు. వ్యాపారాల్లో నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులకు సహాయంగా నిలబడతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఏలిన్నాటి శని ప్రభావం వల్ల నెలంతా కొద్దిగా శ్రమ, తిప్పట, వ్యయ ప్రయాసలు ఉండే అవకాశం ఉంది. భాగ్య స్థానంలో భాగ్యాధిపతి శుక్రుడు, దశమ స్థానంలో దశమాధిపతి కుజుడి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి, వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోవడానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆదాయం పెరగడానికి, ఆర్థికంగా స్థిరత్వం లభించడానికి అవకాశం ఉంది. అనవసర పరిచయాలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రుల సహాయ సహకారాలుంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఏలిన్నాటి శని దోషం బాగా తగ్గిపోతుంది. నెలంతా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందుల నుంచి, పని ఒత్తిడి నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం అన్యోన్యంగా, సామరస్యంగా ముందుకు సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కలుగుతుంది. కొందరు బంధువులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి.
Also read
- Wanaparthy: వివాహేతర సంబంధం మోజులో… ప్రియుడితో కలిసి భర్త హత్య
- Crime news: ఆరో తరగతి విద్యార్థినిపై అకృత్యం
- Bengaluru: ప్రవర్తనను ప్రశ్నించిందని.. తల్లిని చంపిన కుమార్తె
- తల నరికి, చేతుల వేళ్లు తొలగించి.. మహిళ దారుణ హత్య
- Kashibugga Temple Tragedy: కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట.. 9 మంది మృతి..
- నేటి జాతకములు..2 నవంబర్, 2025
- November 2025 Horoscope: వారికి ఆకస్మిక ధనలాభానికి ఛాన్స్.. 12 రాశులకు నవంబర్ మాసఫలాలు
- 2026లో ఊహించని లైఫ్ వీరి సొంతం.. 18 నెలలపాటు స్వర్ణయుగమే!
- Vastu Tips: ఇంట్లో ముగ్గు వేస్తున్నారా? వాస్తు ప్రకారం మీ కష్టాలకు అసలు కారణం ఇదే!
- ఛీ.. ఛీ.. మనిషే నా? మైనర్ బాలికను రూ.10 లక్షలకు అమ్మేసిన కన్నతల్లి!










