SGSTV NEWS online
Astro TipsAstrology

Guru Vakri: గురు వక్రంతో ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలు..! ఇందులో మీ రాశి ఉందా?




Jupiter Retrograde 2026: ఈ నెల(జనవరి) 16 నుంచి గురు గ్రహం అతి వక్రం నుంచి సాధారణ వక్ర స్థితిలోకి మారింది. దీనివల్ల గురువు స్వతంత్రంగా వ్యవహరించడంతో పాటు కొన్ని రాశులకు ఆకస్మిక ధన లాభాలను, ఆకస్మిక శుభ పరిణామాలను కలిగించే అవకాశం ఉంది. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న గురువు తన సొంత నక్షత్రమైన పునర్వసులో సంచారం చేస్తున్నందువల్ల కొన్ని రాశులకు ఊహించని అదృష్టాలు కలుగుతాయి. గురువు వక్ర గతి వల్ల వృషభం, సింహం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశులవారు శుభ యోగాలను అనుభవించడం, ఆదాయపరంగా లబ్ధి పొందడం (Money Horoscope 2026) జరుగుతుంది.


వృషభం:

ప్రస్తుతం ఈ రాశికి ధన స్థానంలో సంచారం చేస్తున్న గురువు సాధారణ వక్రగతి వల్ల ఆ గ్రహం ఆకస్మిక ధన లాభానికి, కుటుంబంలో ఆకస్మిక శుభ పరిణామాలకు బాగా అవకాశం ఉంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం ఆదా కావడం, ఆదాయాన్ని రుణ విముక్తికి ఖర్చు పెట్టడం, షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందడం, ఇంట్లో శుభకార్యాలు జరగడం వంటివి చోటు చేసుకుంటాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి పొందడం జరుగుతుంది.

సింహం:

ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న గురువు వక్రించడం వల్ల రావలసిన సొమ్ము, బాకీలు, బకాయిలన్నీ పూర్తిగా వసూలు కావడంతో పాటు, అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆగిపోయిన పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్నా శీఘ్ర పురోగతి ఉంటుంది. శుభకార్యాలు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్య కలాపాలు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.


కన్య:

చతుర్థ, సప్తమాధిపతి అయిన గురువు వక్ర గతిలో దశమ స్థానంలో సంచరించడం వల్ల ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉండడంతో పాటు, వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా కలుగుతుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ సక్సెస్ అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం దినదినాభివృద్ది చెందుతుంది. మొండి బాకీలు, బకాయిలు పూర్తిగా వసూలవుతాయి.


తుల:

ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు వక్ర సంచారం వల్ల రావలసిన డబ్బు చేతికి అందడం, జీత భత్యాలు పెరగడం, ఆశించిన స్థాయిలో లాభాలు వృద్ధి చెందడం వంటి శుభ యోగాలు కలుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి క్రమంగా బయటపడడం జరుగుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెంది, ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. అనవసర పరిచయాలు, వ్యసనాల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది.


ధనుస్సు:

రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని అసాధారణ, అనూహ్యమైన మార్గాల ద్వారా కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం, రావలసిన డబ్బు చేతికి అందడం, షేర్లు, స్పెక్యులేషన్లు లాభించడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.


కుంభం:

ఈ రాశికి అయిదవ స్థానంలో సంచారం చేస్తున్న గురువు వక్ర గతి పట్టడం వల్ల సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. తగ్గుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. రావలసిన డబ్బు పూర్తిగా చేతికి అందుతుంది. కీలక సమస్యల నుంచి క్రమంగా బయటపడడం జరుగుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశముంది.

Also read

Related posts