Divine Grace Yoga: జ్యోతిష శాస్త్రంలో దైవానుగ్రహం కూడా ఒక మహా యోగం. ఈ యోగం పట్టిన జాతకులకు జీవితం నిత్యకల్యాణం పచ్చ తోరణంగా సాగిపోతుంది. జాతక చక్రంలో ఎన్ని దోషాలున్నా, ఎన్ని అవయోగాలున్నా వర్తించే అవకాశం ఉండదు. గురు, శుక్రులిద్దరూ అనుకూలంగా ఉన్న రాశుల వారికి ఈ యోగం కలుగుతుంది. గ్రహచారంలో ఈ యోగం పట్టిన వారు ముఖ్యమైన కష్టనష్టాలు, అనారోగ్యాల నుంచి బయటపడడం, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధిలోకి రావడం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోవడం వంటివి జరుగుతాయి. ఈ ఏడాది వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ వారికి ఈ అరుదైన దైవానుగ్రహ యోగం కలిగింది.
వృషభం: ఈ రాశివారికి గురు, శుక్ర గ్రహాలు ఈ ఏడాదంతా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల దైవానుగ్రహ యోగం కలిగింది. దీనివల్ల ఈ రాశివారికి అనేక కష్టనష్టాల నుంచి రక్షణ కలుగుతుంది. సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. ప్రతిదీ కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి మెరుగుపడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.
మిథునం: ఈ రాశికి గురు శుక్రుల బలం బాగా పెరగడం వల్ల ఈ రాశివారి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. దైవానుగ్రహ యోగం కలగడం వల్ల వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచే కాక, అనా రోగ్య సమస్యల నుంచి కూడా పూర్తిగా విముక్తి లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేరుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలకు అవకాశం ఉండదు. రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సింహం: ఈ రాశివారికి శుభ గ్రహాలైన శుక్ర, గురువులతో పాటు, రాశ్యధిపతి రవి కూడా అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల దైవానుగ్రహం కలిగింది. కొద్ది ప్రయత్నంతో సంపన్నులు కావడం జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఆస్తి కలసి వస్తుంది. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సంతాన యోగం కలుగుతుంది. పట్టిందల్లా బంగారమవుతుంది. జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
తుల: సహజ శుభ గ్రహాలైన గురు, శుక్రులు గ్రహాలు ధన, భాగ్య స్థానాల్లో బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశివారికి దైవానుగ్రహ యోగం కలిగింది. దీనివల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు పరిష్కారం అయి మనశ్శాంతి ఏర్పడుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల నెరవేరుతుంది.
ధనుస్సు: రాశ్యధిపతి గురువు, లాభ స్థానాధిపతి శుక్రుడు బాగా అనుకూలం అవుతున్నందువల్ల ఈ రాశి వారికి దైవానుగ్రహ యోగం కలిగి, కోరుకున్నవన్నీ అమరుతాయి. వీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. మనసులోని కొన్ని కోరికలు నెరవేరుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కోలుకుంటారు. ఆస్తి, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. సంపన్న కుటుంబంలో పెళ్లవుతుంది.
కుంభం: ఈ రాశికి గురు, శుక్రుల బలం రానురానూ పెరుగుతున్నందువల్ల అరుదైన దైవానుగ్రహ యోగం కలిగింది. దీనివల్ల ఏలిన్నాటి శని దోషం కూడా తొలగిపోతుంది. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. గతం కంటే బాగా ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. రాజపూజ్యాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది
Also Read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





