జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని సార్లు గ్రహాలు తమ మార్గాన్ని మార్చుకోవడం, ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడం, కదలికలు జరపడం చేస్తుంటాయి. అయితే ఇటువంటి క్రమంలోనే రాజయోగాలు ఏర్పడుతాయి. అయితే అతి త్వరలో రెండు గ్రహాల కలయిక వలన మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడబోతుంది. దీని వలన మూడు రాశుల వారి ఆదాయం పెరగడమే కాకుండా పట్టిందల్లా బంగారమే కానున్నదంట.
జ్యోతిష్యశాస్త్రంలో శక్తివంతమైన గ్రహాలలో కుజ గ్రహం, చంద్రుడు ముఖ్యమైనవి. అయితే ఈ రెండు గ్రహాలు ఏప్రిల్ 16న మీన రాశిలో సంయోగం చెందనున్నాయి. దీని వలన మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఊహించని విధంగా ఆదాయం పెరగడమే కాకుండా వారి ఇంట ధన వర్షం కురుస్తుందంట. మరి ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

మిథున రాశి : మిథున రాశి వారు పెద్ద కంపెనీలో ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. ఈ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది.
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. స్థిరాస్తి లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. బడ్జెట్ నియమాలు పాటిస్తారు. దీంతో ఎక్కువ మొత్తంలో డబ్బు ఆదా చేస్తారు. ధన లాభం కలుగుతుంది.
మీన రాశి : మీన రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశి వారు కెరీర్ పరంగా మంచి అభివృద్ధి కొనసాగిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. త్వరితగతిన పనులు పూర్తి చేస్తారు. అన్నివిధాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది.