ఓం సనాతన ధర్మంలో పవిత్ర శబ్దంగా పరిగణించబడుతుంది. దీనిని “ప్రణవ” అని కూడా అంటారు. అంటే విశ్వం మూల ధ్వని అని అర్థం. ఓం మంత్రం కాదు.. జీవన విధానం. ఇది శరీరాన్ని, మనస్సు రెండింటినీ నియంత్రించగల సాధనం. దీని మహిమ పురాణాలలో వివరించబడింది. ఇది సనాతన శాస్త్రం. ఓంకార శబ్దాన్ని ఉచ్చరించడం వలెనే అనేక వ్యాధులు నశిస్తాయి. ఈ విషయం సైన్స్ నమ్ముతుంది. ఓంకారం ఓ అద్భుతమైన ఔషధం అని చెబుతుంది.
ప్రపంచంలోని అన్ని మంత్రాలకు ఓంకార శబ్దం కేంద్రంగా పరిగణించబడుతుంది. ఓం అనే పదాన్ని ఉచ్చరించడం ద్వారా శరీరంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. శరీరం, మనస్సు రెండింటినీ ఆరోగ్యంగా ఉంచడంలో ఓం ఉచ్చారణ ఉపయోగకరంగా ఉండటానికి ఇదే కారణం. ఓం ప్రయోజనాలు, దానిని జపించే నియమాలను తెలుసుకుందాం. ఓం (ॐ) ను సృష్టికి ప్రతీక అంటారు. దీనిని భక్తి , ధ్యానంల ప్రాథమిక మంత్రం అంటారు, ఓం లేకుండా శివ భక్తిని కూడా ఊహించలేము. ఓం అని ఉచ్చరించడం ద్వారా శరీరం మాత్రమే కాదు, మనస్సు కూడా ఆరోగ్యంగా మారుతుంది. ఓం ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఓం అనే పదాన్ని ఉచ్చరించడం వల్ల అనేక శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయి. ఓం అనే ఒకే ఒక్క పదాన్ని ఉచ్చరించడం ద్వారా శరీరం, మనస్సు రెండింటినీ శుద్ధి చేసుకోవచ్చు. మీరు వందలాది వ్యాధులను తరిమికొట్టవచ్చు. శారీరక మానసిక వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఈ రోజు మనం ఓం అనే ఉచ్చారణ ప్రయోజనాలను, దాని ఉచ్చరించే సరైన పద్ధతి, సరైన సమయం గురించి తెలుసుకుందాం..
ఓం జపించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది?
ఓం ఉచ్చరించడం వల్ల శరీర భాగాలలో కంపనాలు ఏర్పడతాయి, ఉదాహరణకు శరీరం దిగువ భాగంలో A(అ), శరీరం మధ్య భాగంలో U(ఉ), శరీరం పై భాగంలో M(మ్). ఓం అనే పదాన్ని ఉచ్చరించడం వల్ల అనేక శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ విషయాన్నీ భారతదేశంలోనే కాదు ఇతర దేశాలు కూడా అంగీకరించాయి. ఆధ్యాత్మికత మాత్రమే కాదు, సైన్స్ కూడా ఓం శక్తిని తిరస్కరించలేకపోయింది.
హార్మోన్లు, చక్రాలపై ప్రభావవంతంగా ఉంటుంది ధ్యానం, తపస్సు వంటి దీర్ఘ స్థితిలో శరీరం లోపల, వెలుపల ఓం వినడం వలన మనస్సు, ఆత్మ శాంతిని అనుభవిస్తాయి. ఓంకార శబ్దం శరీరంలోని అన్ని చక్రాలు, హార్మోన్ స్రవించే గ్రంథులను తాకినప్పుడు అది గ్రంథుల స్రావాన్ని నియంత్రిస్తుంది. కనుక ఓం ని జపించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఒత్తిడికి అంతిమ ఔషధం
ఎవరైనా ఒత్తిడిలో ఉన్నా చిన్న విషయాలకే బాధపడుతున్నా లేదా ఏదైనా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నా ఓం జపం వీరికి దివ్యౌషధం.
ఎప్పుడు చేయాలి ? ఎలా చేయాలి
ప్రతి ఉదయం లేచిన తర్వాత మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. ఓంకార్ శబ్దాన్ని జపించండి. ఇందుకు పద్మాసన, అర్ధ పద్మాసన, సుఖాసన, వజ్రాసనాలలో కూర్చుని ఓం జపించవచ్చు.
మీ సౌలభ్యం ప్రకారం ఓంకారాన్ని 5, 7, 11, 21,108 సార్లు జపించవచ్చు.
దీన్ని ఎప్పుడైనా జపించవచ్చు. అయితే సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో జపించడం సముచితమని భావిస్తారు.
ఓం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఓం జపించడం వల్ల ఏకాగ్రత పెరిగి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ఇది శరీరం, మనస్సును కేంద్రీకరించడంలో సహాయపడుతుంది
గుండె కొట్టుకోవడం, రక్త ప్రసరణ సక్రమంగా అవుతాయి.
మానసిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
ఓం జపించడం వల్ల థైరాయిడ్ గ్రంథిపై సానుకూల ప్రభావం ఉంటుంది. తద్వారా థైరాయిడ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఓం జపించడం ద్వారా గుండె జబ్బులు దరిదాపులకు రావు.
జీర్ణవ్యవస్థ అదుపులో ఉంటుంది.
ఇది నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఓం జపించడం వల్ల రక్తపోటు, మధుమేహం సమస్యల నివారణకు కూడా ప్రయోజనం ఉంటుంది.
ఓం జపించడం వల్ల శరీరం , మనస్సుపై సానుకూల ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు అంగీకరించారు.
ఈ మంత్రాన్ని జపించడం ద్వారా శరీరంలోని మృత కణాలు కూడా పునర్జన్మ పొందడం ప్రారంభిస్తాయి.
ఇది స్త్రీలలో వంధ్యత్వాన్ని కూడా తొలగిస్తుంది.
ఓం ఉచ్చరించేవారు, వినేవారు ఇద్దరూ ప్రయోజనం పొందుతారు.
ప్రతిరోజూ ఓం జపించడం ద్వారా మీరు మార్పును మీరే తెలుసుకుంటారు.
