July 5, 2024
SGSTV NEWS
Spiritual

సూర్యాస్తమయం సమయంలో పొరపాటున కూడా ఈ 5 పనులు చేయకండి, సమస్యలు పెరుగుతాయి

కొన్నిసార్లు ఎంత ఎక్కువుగా కష్టపడినా అందుకు తగిన ప్రతిఫలం దక్కదు. శుభ ఫలితాలు లభించవు. వ్యక్తులు చేసే చిన్న పొరపాట్లు కూడా అతని ఆనందానికి, శ్రేయస్సుకు అడ్డంకిని సృష్టిస్తాయని నమ్ముతారు. సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయ సమయంలో అస్సలు చేయకూడని నాలుగు పనులు హిందూ పురాతన గ్రంథాలలో వివరించారు. సూర్యాస్తమయం సమయంలో కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఇంట్లో ఆనందం దూరమవుతుంది. దీనితో పాటు ఒక వ్యక్తి పురోగతికి ఆటంకం ఏర్పడుతుంది. ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.


హిందూ మతంలో ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొనడానికి కొన్ని నియమాలను అనుసరిస్తారు. తమ జీవన విధానాన్ని కొనసాగిస్తారు. అలాంటి నియమాలలో ఒకటి సూర్యోదయ, సూర్యాస్తమయం సమయంలో చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు ఉన్నాయి. ఈ రోజు సూర్యాస్తమయ సమయంలో చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం.. ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఎవరైనా కొన్ని రకాల పనులు చేస్తే జీవితంలో చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు కొన్ని రకాల పనులతో ఆ ఇంట్లో సుఖ శాంతులు దూరం అవుతాయి.

ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలని, ఆర్థిక సమస్యలు రాకూడదని కోరు కుంటారు. అటువంటి పరిస్థితిలో ప్రతి వ్యక్తి కష్టపడి పని చేస్తాడు. అయితే కొన్నిసార్లు ఎంత ఎక్కువుగా కష్టపడినా అందుకు తగిన ప్రతిఫలం దక్కదు. శుభ ఫలితాలు లభించవు. వ్యక్తులు చేసే చిన్న పొరపాట్లు కూడా అతని ఆనందానికి, శ్రేయస్సుకు అడ్డంకిని సృష్టిస్తాయని నమ్ముతారు.

సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయ సమయంలో అస్సలు చేయకూడని నాలుగు పనులు హిందూ పురాతన గ్రంథాలలో వివరించారు. సూర్యాస్తమయం సమయంలో కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఇంట్లో ఆనందం దూరమవుతుంది. దీనితో పాటు ఒక వ్యక్తి పురోగతికి ఆటంకం ఏర్పడుతుంది. ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

సాయంత్రం సమయంలో ఈ నాలుగు కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.
ఆహారం, శృంగారం, నిద్ర, గోళ్లను కత్తిరించడం వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.

సాయంత్రం సమయంలో ఆహారం తినకూడదు. హిందూ మత గ్రంధాల ప్రకారం సూర్యాస్తమయం సమయంలో ఆహారం తినకూడదు. ఈ సమయంలో ఆహారం తీసుకున్న వ్యక్తి తదుపరి జన్మలో జంతువు రూపంలో జన్మిస్తాడని నమ్మకం.

అంతేకాదు సూర్యాస్తమయం సమయంలో ఆరోగ్యవంతమైన వ్యక్తి నిద్రపోకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉంచిన ధనం త్వరగా ఖర్చవుతుంది. ఆర్థిక సమస్యల కారణంగా జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

సూర్యాస్తమయ సమయంలో భగవంతుడిని పూజించండి
సూర్యాస్తమయ సమయంలో భగవంతుడిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు. సూర్యాస్తమయం సమయంలో లైంగిక కోరికను అదుపులో ఉంచుకోవాలి. ఈ సమయంలో స్త్రీ, పురుషులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో పుట్టిన బిడ్డ జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని నమ్ముతారు.

అంతేకాదు సాయంత్రం వేళల్లో వేదాలు, శాస్త్రాలు చదవకూడదని చెప్పబడింది. ఈ సమయంలో ధ్యానం, సాధన చేయడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది.

పొరపాటున గోళ్లను కత్తిరించవద్దు
సూర్యాస్తమయం సమయంలో డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడి ప్రజల ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కరంగా ఉంటుంది. అంతేకాదు సూర్యాస్తమయం సమయంలో గోర్లు కత్తిరించకూడదు లేదా జుట్టును కత్తిరించకూడదు. ఇలా చేయడం వలన జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. జీవితం కష్టాలతో నిండిపోతుంది.

Related posts

Share via