నవరాత్రి తొమ్మిది రోజుల పాటు భక్తులు దుర్గాదేవిని విశేషంగా కొలుస్తారు. ఆ సమయంలో దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలతో పాటు దుర్గా చాలీసాను పఠిస్తారు. ఇక నవరాత్రులలో పూజతో పాటు మనం ధరించే దుస్తుల రంగు సైతం ముఖ్యమే అంటున్నారు పండితులు. అందుకే ఈ 9 రోజుల్లో భక్తులు ఎలాంటి రంగు దుస్తులు ధరిస్తే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..
భారతదేశంలో అత్యంత విశిష్టమైన, పవిత్రమైన పండుగల్లో దేవీ నవరాత్రులు ఒకటి. హిందూ ధర్మంలో నవరాత్రి 9 రోజుల పాటు జరుపుకునే చాలా ముఖ్యమైన పండుగ. ఈ నవరాత్రి పండుగ దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజించే మహోత్సవం. నవరాత్రి తొమ్మిది రోజుల పాటు భక్తులు దుర్గాదేవిని విశేషంగా కొలుస్తారు. ఆ సమయంలో దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలతో పాటు దుర్గా చాలీసాను పఠిస్తారు. ఇక నవరాత్రులలో పూజతో పాటు మనం ధరించే దుస్తుల రంగు సైతం ముఖ్యమే అంటున్నారు పండితులు. అందుకే ఈ 9 రోజుల్లో భక్తులు ఎలాంటి రంగు దుస్తులు ధరిస్తే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..
నవరాత్రులలో ఏ రోజున ఏ ఏ రంగు దుస్తులను ధరించాలో ఇక్కడ చూద్దాం..
* మొదటి రోజు శైలపుత్రి- నవరాత్రి తొలి రోజున ఘట స్థాపనతో పాటు శైలపుత్రిని పూజిస్తాం. కాబట్టి తొలి రోజున తెల్లని వస్త్రాలు ధరించి పూజిస్తే మంచిది.
* రెండోరోజున బ్రహ్మచారిణి- రెండవ రోజున బ్రహ్మచారిణిగా అమ్మవారిని పూజిస్తాం కాబట్టి తెలుపు రంగు దుస్తులనే ధరించాలి. ఎందుకంటే బ్రహ్మచారిణి కూడా తెలుపు రంగు దుస్తులను ఇష్టపడుతుంది.
* మూడో రోజు చంద్రఘంటా- మూడవ రోజున చంద్రఘంట తల్లిని పూజిస్తారు. దుర్గాదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని ఎరుపు రంగు దుస్తుల్లో పూజించాలి.
* నాలుగో రోజు కూష్మాండా- నాల్గవ రోజున తల్లి కూష్మాండ దేవిని పూజిస్తారు కాబట్టి ఆమెకు ఇష్టమైన ముదురు నీలం లేదా ఊదా రంగు దుస్తులు ధరించాలి.
* ఐదో రోజు స్కందమాత- ఐదవ రోజున దుర్గాదేవిని స్కందమాతగా పూజిస్తాం కాబట్టి పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించాలి. ఇవి స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు.
* ఆరో రోజు కాత్యాయని- ఆరవ రోజు కాత్యాయని దేవిగా పూజిస్తాం. ఈ రోజున గులాబి రంగు దుస్తులు.. ఈ రంగు ప్రేమ, ఆప్యాయత మరియు సామరస్యాన్ని సూచిస్తుంది.
* ఏడో రోజు కాళరాత్రి- ఏడవ రోజు కాళరాత్రిగా పూజిస్తాం కాబట్టి బూడిద రంగు లేదా గోధుమ రంగు దుస్తులు ధరించాలి.
* ఎనిమిదో రోజు మహాగౌరి- ఎనిమిదవ రోజు మహాగౌరి దేవిగా పూజిస్తాం కాబట్టి తెలుపు లేదా ఊదా రంగు..
*తొమ్మిదో రోజు సిద్ధిధాత్రి- తొమ్మిదవ రోజున తల్లి సిద్దిధాత్రిగా పూజిస్తాం.. కాబట్టి పచ్చని వస్త్రాలు ధరించాలి.
