SGSTV NEWS
Famous Hindu TemplesSpiritual

Mahadev Temple: ఈ ఆలయంలో వింత సంప్రదాయం.. తాళం వేస్తే కోరికలు తీర్చే శివయ్య.. ఎక్కడంటే..



మన దేశంలో అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలున్నాయి. ముఖ్యంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ అనేక శివాలయలున్నాయి. వాటిల్లో కొన్ని ఆలయాలు విభిన్న సంప్రదాయాలతో ప్రఖ్యాతిగాంచాయి. అటువంటి ఒక ప్రత్యేక శివాలయం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉంది. ఇక్కడ భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి తాళాలు వేస్తారు. ఈ ఆలయాన్ని నాథేశ్వర మహాదేవ ఆలయం అని పిలుస్తారు. ఈ ప్రత్యేకమైన సంప్రదాయంపై భక్తులకు ఎంతో నమ్మకం.

ప్రయాగ్‌రాజ్ ఆధ్యాత్మికంగా పవిత్ర భూమిగా పరిగణిస్తారు. ఇక్కడ అనేక పురాతన, అద్భుత దేవాలయాలు ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి నాథేశ్వర మహాదేవ ఆలయం. ఈ ఆలయంలో ప్రత్యేకమైన సంప్రదాయం, నమ్మకం కారణంగా భక్తులకు ప్రత్యేక విశ్వాస కేంద్రంగా ఉంది. ఈ ఆలయం శివ భక్తులకు ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు.. భక్తి , విశ్వాసానికి అద్భుతమైన ఉదాహరణగా కూడా నిలుస్తుంది. ఈ ఆలయం గురించి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి భక్తులు తలుపులు తాళం వేసి కోరిక తీర్చుకుంటారు.

నాథేశ్వర మహాదేవ ఆలయ ప్రాముఖ్యత

సాధారణంగా భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి దేవాలయాలలో పూలు, పండ్లు, స్వీట్లు లేదా నీటిని సమర్పిస్తారు. అయితే నాథేశ్వర మహాదేవ ఆలయంలో దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ భక్తులు ఆలయ ప్రాంగణంలో శివలింగం చుట్టూ లేదా గోడలపై వివిధ ఆకారాల తాళాలను వేస్తారు. ఈ తాళం ఉన్నంత వరకు భక్తుడి కోరిక శివుడి వద్ద సురక్షితంగా ఉంటుందని, అది నెరవేరే అవకాశాలు పెరుగుతాయని నమ్ముతారు. కోరిక నెరవేరిన తర్వాత భక్తులు తిరిగి వచ్చి భక్తితో ఆ తాళం తెరిచి లేదా కొత్త తాళం వేసి భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతారు.

ఇక్కడ వేసే తాళాలు సంప్రదాయం, విశ్వాసాల సంగమం

స్థానిక ప్రజలు, ఆలయంతో సంబంధం ఉన్న పూజారుల ప్రకారం.. ఇది శతాబ్దాల నాటి ఆచారం. ఇది కేవలం మూఢనమ్మకం కాదు. భక్తులకు ఉన్న అచంచల విశ్వాసం, నమ్మకానికి చిహ్నంగా మారింది. వివాహం చేసుకోవాలనుకునే యువకులు, మహిళలు, ఉద్యోగాల కోసం తిరుగుతున్న వ్యక్తులు, పిల్లలు పుట్టాలనుకునే దంపతులు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులు కూడా తమ కోరికలతో ఇక్కడికి వచ్చి తలుపుకు తాళం వేసి తమ భక్తిని శివయ్యపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు.

ఉత్సవం జరిపించే భక్తులు

శ్రావణ మాసం శివుడిని పూజిస్తారు. ఈ సమయంలో భారీ సంఖ్యలో భక్తులు నాథేశ్వర మహాదేవ ఆలయానికి చేరుకుంటారు. కావడిని తీసుకుని వెళ్ళే శివుని భక్తులు ఇక్కడ జలాభిషేకం చేసి.. అనంతరం తమ కోరికలను భగవంతుడికి తెలియజేసి తాళాలు వేస్తారు

Related posts

Share this