November 21, 2024
SGSTV NEWS
Spiritual

Nag Panchami 2024: పితృ దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. నాగ పంచమి రోజున ఈ పరిహారాలు చేయండి..

ఈ ఏడాది (2024) ఆగస్టు 9న నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. పంచమి తిది ఆగస్టు 9న ఉదయం 8:15 గంటలకు ప్రారంభమై మర్నాడు ఆగస్టు 10న ఉదయం 06:09 గంటలకు ముగుస్తుంది. కనుక ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషం లేదా పితృదోషం ఉంటే నాగ పంచమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. అటువంటి పరిస్థితిలో ఈ రోజు ఆ చర్యలు ఏమిటో తెలుసుకుందాం

శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజున నాగ పంచమిని జరుపుకుంటారు. నాగ పంచమి పాములకు అంకితం చేయబడిన పండగ. శ్రావణ మాసంలో వచ్చే ఈ పండుగలో మహాభారతం, నారద పురాణం, స్కంద పురాణం మొదలైన వాటిలో శివుడితో పాటు పాము దేవుడిగా పుజిస్తారు. ఈ ఏడాది (2024) ఆగస్టు 9న నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. పంచమి తిది ఆగస్టు 9న ఉదయం 8:15 గంటలకు ప్రారంభమై మర్నాడు ఆగస్టు 10న ఉదయం 06:09 గంటలకు ముగుస్తుంది. కనుక ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషం లేదా పితృదోషం ఉంటే నాగ పంచమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. అటువంటి పరిస్థితిలో ఈ రోజు ఆ చర్యలు ఏమిటో తెలుసుకుందాం..

నాగ పంచమి రోజున పితృదోష నివారణకు చేయాల్సిన పరిహారాలు
1  ఎవరి జాతకంలోనైనా కాల సర్ప దోషం లేదా పితృ దోషం ఉంటే అటువంటి వ్యక్తుల జీవితం సమస్యలతో చుట్టుముడుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే నాగ పంచమి రోజున శ్రీ సర్ప సూక్తాన్ని పఠించాలి. ఇది మహా శక్తివంతమైన మంత్రంగా పరిగణించబడుతుంది.
2  నాగ పంచమి రోజున శ్రీమద్ భగవద్ పురాణం, శ్రీ హరివంశ పురాణాన్ని తప్పనిసరిగా పఠించాలి. ఇలా చేయడం వల్ల పితృదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది.
3  నాగ పంచమి రోజున శివునికి చందనాన్ని సమర్పించి దానిని నుదుటిపై తిలకంగా దిద్దుకోండి. అంతేకాదు ఉదయం, సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించండి. ఇలా చేయడం వలన పితృ దోషం తొలగిపోతుంది.
4  నాగ పంచమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పేడ, లేదా మట్టితో సర్ప ఆకారాన్ని తయారు చేసి పూర్తి ఆచారాలతో పూజించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ప్రయోజనాలతోపాటు పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి.

5  నాగ పంచమి రోజున ఏదైనా శివాలయానికి లేదా ఇతర ఆలయానికి వెండితో చేసిన సర్పాన్ని దానం చేయడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల ఆర్థికం ఇబ్బంది తీరి లాభాల బాట పట్టే అవకాశం ఉంది.

6  నాగ పంచమి రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పచ్చి మట్టి దీపాలలో ఆవు పాలను ఉంచి.. నాగదేవత ను స్మరిస్తూ దేవాలయంలో లేదా ఇంటి మూలల్లో పెట్టండి.

7 పితృదోషం నుండి బయటపడటానికి నాగ పంచమి రోజున నాగ దేవతను విగ్రహం లేదా చిత్రం రూపంలో పూజిస్తారు. ఈ రోజున పాములకు పాలతో అభిషేకం చేసి పూజిస్తారు. కొంతమంది పుట్టలో పాలు పోస్తారు.

8  ఈ ఏడాది నాగ పంచమి రోజున శివ్వాస యోగం, సర్వార్థ సిద్ధి యోగం, కర్ణ యోగాలు హస్తా నక్షత్రంలో ఏర్పడనున్నాయి. నాగ పంచమి రోజున ఈ అరుదైన యాదృచ్ఛిక కాలాలు సర్ప దోషం, రాహువు కలిగించే చెడు ప్రభావాలను తగ్గించడానికి ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. కనుక వీలైతే నాగేంద్రుడికి లేదా సుబ్రమణ్య స్వామిని పూజించి.. విశేష ఫలితాలను పొందండి.

Related posts

Share via