SGSTV NEWS
Spiritual

కుబేరుడికి ఇష్టమైన 4 రాశుల్లో మీరున్నారా.. 35 ఏళ్లు దాటితే నక్కతోక తొక్కినట్లే.. ఇళ్లంతా నోట్ల కట్టలే..



Lord Kubera Favorite Zodiac Signs: హిందూ మతంలో కుబేరుడిని కోశాధికారి అని పిలుస్తుంటారు. అతన్ని సంపదకు దేవుడిగా భావిస్తారు. ధనవంతులు కావడానికి కుబేరుడిని పూజిస్తుంటారు. అయితే, కుబేరుడికి ఎంతో ఇష్టమైన రాశులు కొన్ని ఉన్నాయంట. ఈ రాశుల వారిపై కుబురుడి స్పెషల్ ఫోకస్ ఉంటుందంట. ఆ లిస్ట్‌లో మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల స్థానాలు, వాటి సంచారాలు వ్యక్తి జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని గ్రహాల శుభ స్థానాలు, వాటి అనుకూల సంచారం ధన యోగాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా, 35 ఏళ్ల వయస్సు తర్వాత కొన్ని రాశుల వారికి ధనలాభం, అపారమైన సంపద కూడబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. లక్ష్మీదేవి సంపదకు దేవత అయినట్లే, కుబేరుడిని కూడా సంపదకు దేవుడిలా చూస్తుంటారు. కుబేరుడి ఆశీస్సులు ఉంటే ఆ వ్యక్తి సంపదను అనుభవిస్తాడు. కుబేరుడికి ఇష్టమైన రాశులు కొన్ని ఉన్నాయి. ఇలాంటి రాశులకు చెందిన వాళ్లు 35 సంవత్సరాల వయస్సు తర్వాత ఆకస్మిక డబ్బుతోపాటు ఆస్తిని కూడా పొందుతారంట. అలాంటి రాశుల్లో మీరున్నారేమో ఓసారి చెక్ చేసుకోండి.

వృషభ రాశి అధిపతి శుక్రుడు. ఇది సంపద, వైభవం, విలాసం, కీర్తికి కారకుడు. ఈ రాశి వారికి కుబేర దేవుడి ప్రత్యేక ఆశీస్సులు ఉన్నాయి. దీని కారణంగా వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వారికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు.

శుక్రుడు కూడా తుల రాశి వారికి అధిపతి. తుల రాశి వారికి లక్ష్మీదేవి, కుబేరుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. అలాగే, ఈ వ్యక్తులు కష్టపడి పనిచేసేవారు. ఎంతో మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. అలాగే, చాలా తెలివైనవారు. ఈ లక్షణాల కారణంగా వీరు జీవితంలో చాలా విజయవంతమవుతారు. అలాగే, ధనవంతులు అవుతారు.


కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు పదునైన మనస్తత్వం కలిగి ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో దృఢంగా ఉంటారు. ఈ రాశివారు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ వ్యక్తులు డబ్బు వసూలు చేయడంలో, ధనవంతులు కావడంలో నిపుణులు.

ధనుస్సు రాశి అధిపతి దేవగురువు బృహస్పతి. ఆయన ఆనందం, అదృష్టం, శ్రేయస్సును ప్రసాదిస్తాడు. ఈ వ్యక్తులు జన్మతః అదృష్టవంతులుగా జన్మిస్తారు. కుబేరుడి ఆశీర్వాదాలను కూడా పొందుతారు. సాధారణంగా ఈ వ్యక్తులు డబ్బుతో పాటు కీర్తిని సులభంగా పొందుతారు

Also read

Related posts

Share this