December 11, 2024
SGSTV NEWS
Astro TipsInternational

Margasira Purnima: లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం కావాలంటే.. మార్గశిర పౌర్ణమి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా



తిధుల్లో అమావాస్య, పౌర్ణమి తిధులకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కూడా చాలా పవిత్రమైన, ముఖ్యమైన పండుగగా భావిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. శుభ కార్యాలు కూడా చేస్తారు. అయితే పుణ్యప్రదమైన మార్గశిర పౌర్ణమి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం.

హిందూ మతంలో మార్గశిర పౌర్ణిమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మార్గశిర మాసం కూడా విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి దేవతలందరికీ ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూజించడం వల్ల దేవతలందరూ సంతోషిస్తారు. ఈ రోజున ఆచారాల ప్రకారం పూజించడం వల్ల సుఖం, ఐశ్వర్యం, ఆరోగ్యం, మోక్షం లభిస్తాయి.

పంచాంగం ప్రకారం మార్గశిర మాసం పౌర్ణమి తిథి డిసెంబర్ 14, శనివారం సాయంత్రం 4:58 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 15 ఆదివారం మధ్యాహ్నం 2:31 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం పౌర్ణమి తిథి ఉపవాసం డిసెంబర్ 15న ఆచరిస్తారు. డిసెంబర్ 15 న చంద్రోదయం సాయంత్రం 5:14 గంటలకు జరుగుతుంది.

మార్గశిర పౌర్ణమి రోజున ఏమి చేయాలంటే

1   స్నానం – పూజ: తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి విష్ణువును పూజించండి.
2    ఉపవాసం పాటించండి: ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

3   సత్యనారాయణ కథ వినండి: సత్యన్నారాయణ కథ వినడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పుణ్యం లభిస్తుంది.

4   రావి చెట్టును పూజించండి: రావి చెట్టును దేవతల నివాసంగా భావిస్తారు. ఈ రోజు రావి చెట్టును పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి.

5   గంగాస్నానం: వీలైతే గంగాస్నానం చేసి అవసరమైన వారికి దానం చేయండి.

6    మంత్రాన్ని జపించండి: విష్ణు సహస్రనామం, గాయత్రీ మంత్రం లేదా మీ ఇష్టమైన దేవుడికి సంబంధించిన మంత్రాన్ని జపించండి.

7    కథ వినండి: మార్గశిర పూర్ణిమ కథ వినండి.


8  భజన-కీర్తన చేయండి: భజన-కీర్తన చేయడం వల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. భక్తి భావం పెరుగుతుంది

మార్గశిర పౌర్ణమి రోజున ఏమి చేయకూడదంటే

1   ఈ పనులు చేయవద్దు: అబద్ధాలు చెప్పడం, దొంగతనం చేయడం, ఒకరిని అవమానించడం వంటివి ఈ రోజున చేయకూడదు.

2   కోపం తెచ్చుకోకండి: మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. కోపానికి దూరంగా ఉండండి

3   మాంసాహారానికి దూరంగా ఉండండి: ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి.

4  ప్రతికూల ఆలోచనలు చేయవద్దు: మీ మనస్సులో సానుకూల ఆలోచనలతో భగవంతుడిని పూజించండి.. ప్రతికూల ఆలోచనలు చేయవద్దు.

మార్గశిర పౌర్ణమి ప్రాముఖ్యత:
మార్గశిర పౌర్ణమి రోజున దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. మార్గశిర పౌర్ణమి రోజున ఆహారం, బట్టలు, డబ్బు వంటి ఏదైనా దానం చేయవచ్చు. ఈ రోజున చేసే పూజల వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి. పాపాలు నశిస్తాయి. అలాగే ఈ రోజున చేసే పూజ చంద్రుడి ఆశీస్సుతో మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది.జీవితంలో సానుకూల శక్తి వస్తుంది. అన్ని కోరికలు నెరవేరుతాయి

Related posts

Share via