ఉత్తరాఖండ్ దేవత భూమి. ఇక్కడ అడగడుగున గుడి ఉంది. గొప్ప మహిమ కలిగిన అనేక పుణ్యక్షేత్రాలున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి హరిద్వార్‌లోని మానస దేవి ఆలయం. ఇక్కడ ఇటీవల జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు, చాలా మంది గాయపడ్డారు. ఈ ఆలయానికి సంబంధించి హిందూ మతంలో చాలా నమ్మకం ఉంది. మానసాదేవిని తమ కోరికలను తీర్చమని కోరుతూ లక్షలాది మంది భక్తులు సందర్శించడానికి వస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర, నమ్మకం ఏమిటో తెలుసుకుందాం..
ప్రస్తుతం ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో జరిగిన ప్రమాదం కారణంగా వార్తల్లో నిలిచింది. దీంతో అమ్మవారి గురించి తెలుసుకోవడానికి చాలా మంది భక్తులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ ఆలయం చాలా సంవత్సరాలుగా విశ్వాస కేంద్రంగా ఉంది. మానసా దేవి భక్తుల ప్రతి కోరికను తల్లి తీరుస్తుందని, అందుకే భక్తులు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. పురాణాగ్రంథాల ప్రకారం మానసా దేవి శివుని చిన్న కుమార్తె .
మానస దేవి ఆలయం ఎందుకు ప్రసిద్ధి చెందింది ? హరిద్వార్ నుంచి మూడు కి.మీ. దూరంలో ఉన్న శివాలిక్ కొండలలోని బిల్వ పర్వతంలో మానస దేవి ఆలయం ఉంది. ఈ ఆలయం మతపరమైన ప్రాముఖ్యత, పౌరాణిక నమ్మకాలకు ప్రసిద్ధి చెందింది. మానస దేవిని శివుని కుమార్తెగా భావిస్తారు. సాధారణంగా కోరికలను తీర్చే దేవతగా పూజిస్తారు. అంతేకాదు మానస దేవి ఆలయం 51 శక్తిపీఠఠాలలో ఒకటి. ఇక్కడ సతీదేవి మెదడు పడిందని నమ్మకం.
మానస దేవిని ఎందుకు పూజిస్తారు? హిందూ మతంలో మానస దేవిని నాగ దేవత అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న అమ్మరిని పూజిస్తే సర్పాల నుంచి భయం ఉండదని.. సంతానం లేని దంపతులకు సంతానాన్ని ఇస్తుందని, శ్రేయస్సుని ఇస్తుందని నమ్మకం. మానస దేవిని పాములకు ఆదిదేవతగా భావిస్తారు. ఆమెను పూజించడం ద్వారా పాము విష భయం ఉండదని మత విశ్వాసం ఉంది.
మానసా దేవి ఆలయం పురాణ కథ పురాణ నమ్మకం ప్రకారం.. మానస దేవి శివుని మనస్సు నుంచి ఉద్భవించిందని నమ్మకం. మత విశ్వాసం ప్రకారం మానస దేవి శివుని విష ప్రభావాన్ని శాంతపరిచింది. అందుకే ఆమెకు ” విశారి ” అని పేరు వచ్చింది. మానస దేవిని పాముల సోదరి అని కూడా పిలుస్తారు. సముద్ర మథనం సమయంలో బయల్పడిన అమృత భాండం నుంచి భూమి మీద నాలు చోట్ల అమృతం చుక్కలు పడ్డాయి. అలా పడిన ప్రదేశాల్లో ఒకటి మానస దేవి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో దేవతకి సంబంధించిన రెండు విగ్రహాలు ఉన్నాయి. ఒకటి మూడు ముఖాలు ఐదు చేతులతో భక్తులకు దర్శనం ఇస్తుండగా.. మరొక విగ్రహానికి ఎనిమిది చేతులు ఉన్నాయి.
మరొక పురాణం ప్రకారం.. మానస దేవి తన భర్త జరత్కారు, కుమారుడు అస్తికులను రక్షించింది. ఆస్తికుడు సర్పాల వంశాన్ని రక్షించాడు. అందువల్ల మానస దేవిని సర్పాల దేవతగా కూడా పూజిస్తారు. పాము కాటు నుంచి రక్షించమని కోరుకుంటారు. కోరికలు నెరవేర్చమని పూజిస్తారు.
హరిద్వార్‌లోని పంచ తీర్థాలలో ఒకటి మానస దేవికి భక్తులు తమ కోరికలు తీర్చుమని కోరుతూ కొబ్బరికాయలు, పండ్లు, దండలు, అగరబత్తిలను సమర్పిస్తారు . ఈ ఆలయంలో దారం కట్టడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. అలాగే, ఈ ఆలయం హరిద్వార్‌లోని పంచ తీర్థాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఏడాది పొడవునా వేలాది మంది భక్తులు మానసాదేవి దర్శనం కోసం వస్తారు.
హర్ కి పౌరి కి సమీపంలోనే మానసా దేవి ఆలయం ఉంది. హర్ కి పౌరి నుంచి సరాసరి మానసా దేవి ఆలయానికి వెళ్ళవచ్చు., అంటే మానసా దేవి ఆలయం హర్ కి పౌరి నుంచి 1.5 కి.మీ. దూరంలో ఉంది
