హరిద్వార్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శివాలిక్ కొండలలోని బిల్వ పర్వతంలో మానస దేవికి సంబంధించిన ప్రసిద్ధ ఆలయం ఉంది. ఈ పురాతన దేవాలయం చరిత్రతో ప్రత్యేకమైనది. ఎందుకంటే సతి దేవి మెదడు పడిపోయిన ప్రదేశం ఇదే. ఎవరైతే నిర్మలమైన హృదయంతో అమ్మవారి ఆలయానికి చేరుకుని మానసాదేవిని పూజిస్తారో వారి కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు.
హిందూ మతంలో చాలా మంది దేవుళ్లను, దేవతలను పూజిస్తారు. సకల దేవతలకు వారి వారి సొంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అమ్మవారిని పూజించే సంప్రదాయం ఉంది. అలాంటి అమ్మవారి ఆలయాల్లో మానస దేవి ఆలయం ఒకటి. మానస దేవిని ఎంతో భక్తితో పూజిస్తారు. ఉత్తరాఖండ్ లోని పంచకులలోని అమ్మవారి మానస దేవి ఆలయం 51 శక్తిపీఠఠాలలో ఒకటి.
మానసా దేవి శక్తిపీఠం, హరిద్వార్ హరిద్వార్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శివాలిక్ కొండలలోని బిల్వ పర్వతంలో మానస దేవికి సంబంధించిన ప్రసిద్ధ ఆలయం ఉంది. ఈ పురాతన దేవాలయం చరిత్రతో ప్రత్యేకమైనది. ఎందుకంటే సతి దేవి మెదడు పడిపోయిన ప్రదేశం ఇదే. ఎవరైతే నిర్మలమైన హృదయంతో అమ్మవారి ఆలయానికి చేరుకుని మానసాదేవిని పూజిస్తారో వారి కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు.
సముద్ర మథనంలో అమృతపు చుక్కలు అమృత బిందువులు పడిన నాలుగు ప్రదేశాలలో హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయం ఒకటి. హరిద్వార్‌తో పాటు ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ ప్రాంతాలలో అమృత బిందువులు పడ్డాయి. పురాణాల ప్రకారం అమరత్వాని ఇచ్చే అమృతాన్ని పక్షి తీసుకువెళుతున్నప్పుడు అనుకోకుండా అమృతభాండం నుంచి కొన్ని చుక్కలు భూమి మీద పడిపోయాయి.
రక్షించడానికి ఏడు పాములు సిద్ధంగా ఉన్నాయి మానస దేవి పాము, తామరపువ్వులను పీఠంగా చేసుకుని కూర్చుంది. మానస దేవి పాముపై కూర్చున్నందున.. ఆమెను నాగ దేవత అని కూడా పిలుస్తారు. మాతృదేవత రక్షణలో 7 పాములు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు. జానపద కథల ప్రకారం ఎవరికైనా పాముకాటు వేస్తే చికిత్స కోసం మానస దేవిని కూడా పూజిస్తారు. మానస దేవి కొడుకు ఆస్తిక్ తల్లి ఒడిలో కూర్చున్నాడు. మానస మరో పేరు వాసుకి అని విశ్వాసం.
దారం కట్టే సంప్రదాయం మానస దేవి అంటే కోరికల తీర్చే దైవం అని అర్థం. మానస దేవి దర్శనం కోసం రోజూ భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు దారాన్ని కట్టే సంప్రదాయం కూడా ఉంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు తమ కోరికలను తీర్చమని అమ్మవారిని వేడుకుంటూ ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్టు కొమ్మలకు దారం కడతారు. తమ కోరికలు నెరవేరిన తర్వాత, ప్రజలు చెట్టు నుంచి దారాన్ని విప్పడానికి మళ్లీ ఈ ఆలయానికి వస్తారు.