SGSTV NEWS online
SpiritualTelangana

వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్దామనకుంటున్నారా..? అయితే మీకే ఈ అలెర్ట్!



కార్తీక మాసం.. రాజన్న దర్శనం కోసం భక్తులు వేములవాడకు పోటెత్తుతున్నారు. అయితే ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా దర్శనాలను రద్దు చేశారు అధికారులు. ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులు.. ప్రధాన ఆలయాన్ని దర్శించుకునే అవకాశం లేకపోవడంతో ఉసురుమంటున్నారు. భీమేశ్వరాలయంలో మొక్కులు తీర్చుకుని తిరిగి వెళ్తున్నారు.

కార్తీక మాసం.. రాజన్న దర్శనం కోసం భక్తులు వేములవాడకు పోటెత్తుతున్నారు. అయితే ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా దర్శనాలను రద్దు చేశారు అధికారులు. ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులు.. ప్రధాన ఆలయాన్ని దర్శించుకునే అవకాశం లేకపోవడంతో ఉసురుమంటున్నారు. భీమేశ్వరాలయంలో మొక్కులు తీర్చుకుని తిరిగి వెళ్తున్నారు.

దక్షిణ కాశీగా పిలవబడే వేములవాడ దేవస్థానంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ పునర్నిర్మాణ పనులను భక్తులు స్వాగతిస్తున్నారు. అయితే ఆలయ మూసివేత విషయంలో ఇప్పటికీ అధికారులు గందరగోళం సృష్టిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండానే ఆలయాన్ని మూసివేశారు. ఎన్ని రోజులపాటు ఆలయాన్ని మూసివేస్తామని విషయాన్ని చెప్పడం లేదు. అకస్మాత్తుగా బుధవారం (నవంబర్ 11) ఉదయం నుంచి స్వామి వారి దర్శనాలను నిలిపివేశారు. దీంతో భక్తులతో పాటు హిందూ సంస్థలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దేవస్థానంలో గత కొన్ని రోజులుగా ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఆలయ విస్తీర్ణాన్ని పెంచనున్నారు. ప్రస్తుత ఆలయం 20 గుంటల్లో ఉన్నది. అయితే విస్తరణలో భాగంగా 4 ఎకరాల 2 గుంటలు పెరగనుంది. ఆలయ మూసివేత విషయంలో చాలా రోజులుగా తీవ్ర అయోమయాన్ని సృష్టిస్తున్నారు. గతంలోనే ఆలయాన్ని మూసివేసినప్పుడు భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో బీజేపీతోపాటు హిందూ సంస్థలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. తర్వాత యథావిధిగా భక్తులకు దర్శనానికి అనుమతించారు.

ఇదిలావుంటే ఆలయం మూసివేస్తే స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని భక్తులతో పాటు హిందూ సంస్థ డిమాండ్ చేస్తున్నాయి. కానీ అలా చేయకుండానే మళ్లీ బుధవారం రోజు అకస్మాత్తుగా ఆలయాన్ని మూసివేశారు. దీంతో భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కనీసం ఎన్ని రోజులపాటు ఆలయాన్ని మూసివేస్తామని విషయాన్ని ప్రకటించడం లేదు. రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులు సమాచారం లేకపోవడంతో భీమేశ్వరాలయంలో స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అందుకోసం ఏర్పాట్లు కూడా చేశారు. దర్శనం తో పాటు కోడె మొక్కులు, కుంకుమ పూజలు, ఇతర అభిషేకాలు అక్కడే నిర్వహిస్తున్నారు.

ప్రధాన ఆలయ పరిసర ప్రాంతంలో కూల్చివేతలు మొదలయ్యాయి. అయితే ఎన్ని రోజులపాటు భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చే విషయంలో స్పష్టత కరువైంది. ఈ దర్శన విషయంలో భక్తులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. గతంలో కూడా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సరైన క్లారిటీ ఇవ్వలేదు బుధవారం నుంచి దర్శనాన్ని నిలిపివేసిన అధికారులు ఎన్ని రోజులపాటు నిలిపివేస్తామని విషయాన్ని ప్రశ్నిస్తే సమాధానాన్ని దాటవేస్తున్నారు. భక్తులందరూ కూడా అభివృద్ధి పనులను స్వాగతిస్తున్నారు కానీ ఎన్ని రోజుల పాటు పనులు కొనసాగుతాయి. ఎప్పటి వరకు మూసివేస్తారో అనే అంశాన్ని తేల్చలేకపోతున్నారు.

ప్రస్తుతానికి ప్రధాన ఆలయంలో స్వామివారి రథాన్ని ప్రదర్శించారు. అందులో స్వామివారితో పాటు అమ్మవారు వినాయకుడి నమూనా విగ్రహాలు ఉన్నాయి పక్కనే ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. గర్భగుడిలో జరుగుతున్న పూజలను లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ప్రధాన ఆలయానికి వచ్చిన భక్తులు ఈ రథంతోపాటు భీమేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ప్రధాన ఆలయంలో ఉన్న గేట్లన్నింటిని కూడా క్లోజ్ చేశారు. అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా ఆలయాన్ని మూసివేసినట్లు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే గర్భగుడి పరిసర ప్రాంతంలో ఎన్ని రోజులపాటు అభివృద్ధి కార్యక్రమాలు సాగుతాయి ఎప్పుడూ ఓపెన్ చేస్తారని అంశంపైనే చర్చ సాగుతుంది.

హఠాత్తుగా ఆలయం మూసివేసిన తర్వాతనే భక్తులతో పాటు బీజేపీ నేతలు అభ్యంతర వ్యక్తం చేశారు. ఇప్పుడు కార్తీకమాసం తో పాటు వచ్చే నెలలో సమ్మక్క సారక్క దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు రానున్నారు. భక్తులు ఈ క్రమంలో శివరాత్రి వరకు ప్రధాన ఆలయంలో దర్శనానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ పెరిగింది. అయితే మేము ఎక్కడ ఆలయాన్ని మూసి వేయలేదని స్వామి వారికి పూజలు జరుగుతున్నాయని, అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే దర్శనాలు నిలిపివేస్తున్నామని అధికారులు ప్రకటించారు. కానీ ప్రభుత్వ ప్రకటన రాక భక్తులు ఇంకా అయోమయానికి గురవుతున్నారు. దర్శనాలు ఎన్ని రోజులు నిలిపివేస్తారో అనే విషయాన్ని స్పష్టం చేయాలని భక్తుల నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్.

ప్రధాన ఆలయం మూసివేసినట్లు తమకు తెలియదని భక్తులు చెబుతున్నారు. సడన్ గా ఇక్కడికి వచ్చేవరకు ఆలయం మూసివేసినట్లు ఉందని చెబుతున్నారు దీంతో భీమేశ్వర ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నామని అంటున్నారు. ముందుగానే ఆలయ మూసివేత ప్రకటన ఇస్తే బాగుండేదని అంటున్నారు.

Related posts