SGSTV NEWS
Spiritual

Kuja Dosham: జాతకంలో కుజ దోషమా.. వివాహంలో అడ్డంకులా.. ఈ పరిహారాలు చేసి చూడండి..



అబ్బాయి లేదా అమ్మాయి జాతకంలో మాంగలిక దోషం అంటే కుజ దోషం ఉన్నప్పుడు.. యువతీ యువకులకు వివాహంలో అడ్డంకులు ఏర్పడతాయి. జాతకంలో మంగళ దోషం ఉంటే జీవితంలో అనేక సమస్యలు, సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక కుజ దోష నివారణకు జ్యోతిషశాస్త్రంలో అనేక పరిష్కారాలు సూచించబడ్డాయి. జ్యోతిషశాస్త్రంలో ఇవ్వబడిన పరిహారాలు మంగళ దోషాన్ని తొలగిస్తాయి. ఈ రోజు ఈ పరిహారాల గురించి తెలుసుకుందాం.


జ్యోతిషశాస్త్రంలో కుజుడిని ఒక ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని భూమి కుమారుడు అని కూడా అంటారు. కుజుడు లేదా అంగారకగ్రహం చాలా భయంకరమైన గ్రహంగా భావిస్తారు. కుజుడు మేషం, వృశ్చిక రాశులకు అధిపతి. వివాహానికి ముందు.. వధూవరుల జాతకంలో కుజుడు స్థానం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు. జాతకంలో మంగళ దోషం కారణంగా వివాహంలో అనేక రకాల అడ్డంకులు తలెత్తుతాయి.


కుజ దోషం ఎప్పుడు వస్తుంది?
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జన్మకుండలిలో లగ్నం నుంచి 1,2,4,7,8 లేదా 12 వ స్థానంలో కుజుడు ఉన్నట్లైతే.. ఆ జాతకులకు కుజ దోషం ఉందని చెప్పబడింది. దీనితో పాటు కొంతమంది జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం మంగళ దోషం మూడు లగ్నాలైన చంద్ర లగ్నం, సూర్య లగ్నం, శుక్ర లగ్నం నుంచి కూడా కనిపిస్తుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. మంగళ దోష ప్రభావం 28 సంవత్సరాల వయస్సు తర్వాత తగ్గుతుంది. అయితే.. ఆ దోషం పూర్తిగా తొలగి పోదు.

కుజ దోషం తొలగడానికి చేయాల్సిన పరిహారాలు
అబ్బాయి లేదా అమ్మాయి ఎవరి జాతకంలోనైనా మంగళ దోషం ఉంటే.. మంగళ దోషం ఉన్న అబ్బాయిని లేదా అమ్మాయిని మాత్రమే వివాహం చేసుకోవాలని జ్యోతిష్య శాస్త్రం సూచించి. జ్యోతిషశాస్త్రంలో జాతకంలో కుజ దోష తొలగడానికి అనేక పరిష్కారాలు సూచించారు. కుజ దోషం ఉన్న అబ్బాయి లేదా అమ్మాయి జ్యోతిషశాస్త్రంలో సూచించిన పరిహారాలను పాటిస్తే.. వారి వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. కనుక ఈ రోజు పరిహారాల గురించి తెలుసుకుందాం..



మంగళవారం రోజున వీటిని దానం చేయండి
మంగళవారం రోజున ఎండు మిరపకాయలు, పప్పులు, ఎరుపు రంగు దుస్తులను దానం చేయాలి. ఇలా చేయడం ద్వారా జాతకంలోని మంగళ దోషం క్రమంగా తొలగిపోతుంది. అప్పుడు వివాహంలో అడ్డంకులు తొలగిపోతాయి.

ఈ మంత్రాలను జపించండి
మంగళవారం రోజున పూజ సమయంలో



‘ఓం అం అంగారకాయ నమః’ ,

   ఓం భౌం భౌమాయ నమః’



అనే మంత్రాలను 5 నిమిషాల్లో 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల జాతకంలోని మంగళ దోషం తొలగిపోతుంది. జాతకంలో కుజ బలం పెరుగుతుంది. వివాహ విషయంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.

హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి
21 మంగళవారాలు హనుమంతుడి ఆలయానికి వెళ్లి పూజ చేసి సింధూరాన్ని సమర్పించండి. బజరంగబలికి బూందీ లడ్డు, తమలపాకులు, లవంగాలు, యాలకులు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జాతకంలోని మంగళ దోషం తొలగిపోతుంది. హనుమాన్ చాలీసాను ప్రతిరోజూ పారాయణం చేయాలి. సుందరకాండ పారాయణం చేయాలి. ఈ పరిహారాలు చేయడం వలన జాతకంలో కుజ దోషం తొలగిపోతుంది

Related posts

Share this