వారణాశి 12 జ్యోతిర్లింగ క్షేత్రంలో ఒకటి. విశ్వనాథుడుగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఈ నగరంలో ఎన్నో ఆలయాలున్నాయి. వాటిల్లో ఒకొక్క ఆలయం ఒకొక్క ఖ్యాతిని సొంతం చేసుకున్నాయి. పురాతన శివాలయాలకు వాటి సొంత పురాణ కథలు ఉన్నాయి. అలాంటి కాశీలోని ఒక ప్రత్యేక దేవాలయం ఓంకారేశ్వర్ ఆలయం. ఇది చాలా పురాతనమైన శివుని ఆలయం. ఇది బ్రహ్మ కోరికపై శివుడు స్వయంగా ఉద్భవించాడని నమ్మకం.
లయకారుడైన శివుడికి సంబంధించిన అనేక పురాతన క్షేత్రాలు ఆధ్యాత్మిక ఆలయాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో ద్వాదశ జ్యోతిర్లింగంగ క్షేత్రాలను దర్శించుకోవాలని ప్రతి ఒక్క హిందువు కోరుకుంటాడు. ఈ జ్యోతిర్లింగ ఆలయాలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. అలాంటి జ్యోతిర్లింగ క్షేత్రం ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాశి. ఇది 12 జ్యోతిర్లింగ క్షేత్రంలో ఒకటి. విశ్వనాథుడుగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఈ నగరంలో ఎన్నో ఆలయాలున్నాయి. వాటిల్లో ఒకొక్క ఆలయం ఒకొక్క ఖ్యాతిని సొంతం చేసుకున్నాయి. పురాతన శివాలయాలకు వాటి సొంత పురాణ కథలు ఉన్నాయి. అలాంటి కాశీలోని ఒక ప్రత్యేక దేవాలయం ఓంకారేశ్వర్ ఆలయం. ఇది చాలా పురాతనమైన శివుని ఆలయం. ఇది బ్రహ్మ కోరికపై శివుడు స్వయంగా ఉద్భవించాడని నమ్మకం.
ఈ శివాలయం చాలా అతీంద్రియమైన శక్తిని కలదని నమ్మకం. ఏ భక్తుడైనా ఇక్కడి శివుడిని చిత్తశుద్ధితో పూజించి అభిషేకం చేస్తే కోరిన కోరికలు తీరతాయి. ఇక్కడ పూజలు చేయడం ద్వారా భగవంతుడు ప్రసన్నుడవుతాడని.. భక్తుల జీవితంలో ఏర్పడే అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. ఈ ఓంకారేశ్వరాలయానికి సంబంధించిన ఆధారాలు కాశీ ఖండంలో ఉన్నాయి.
శివపురాణంలో ఆలయ ప్రస్తావన
ఈ ఆలయం గురించి కాశీ ఖండంలోని 86వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. అంతేకాదు ఓంకారేశ్వర జ్యోతిర్లింగ స్వరూపం, గొప్పతనం గురించి శివ మహాపురాణంలో ఇవ్వబడింది. పూర్వం శివపంచాయతీకి ప్రాతినిధ్యం వహించే ఐదు శివలింగాలు ఉండేవి. అకారేశ్వర, ఓంకారేశ్వర, మకరేశ్వర, నాదేశ్వర, బిందు లింగాలు. ఇప్పుడు అకారేశ్వర, ఓంకారేశ్వర , మకరేశ్వర అనే మూడు లింగాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఓంకారేశ్వర లింగాన్ని కపిలేశ్వరుడు, నాదేశ్వరుడు అని కూడా అంటారు. ఓంకారేశ్వర లింగం మత్స్యోదరి తీర్థం ఒడ్డున ఉందని.. ఇక్కడ వర్షాకాలంలో గంగా నది కూడా ప్రవహిస్తుంది. అష్టమి, చతుర్దశి రోజున మత్స్యోదరి క్షేత్రంలో స్నానం చేసి ఓంకారేశ్వరుడిని ప్రార్థిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని విశ్వాసం. ఓంకారేశ్వర ఆలయంలో ప్రార్థించే వ్యక్తి నిజంగా అదృష్టవంతుడు.. స్వర్గంలో స్థానం పొందుతాడని విశ్వాసం. అంతేకాదు ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల విశ్వంలోని అన్ని శివాలయాలను దర్శించినంత ఫలితం లభిస్తుందని నమ్మకం.
బ్రహ్మ కోరికపై మహాదేవుడు ప్రత్యక్షం
బ్రహ్మ దేవుడు తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. సృష్టిని సృష్టించిన తరువాత శివుడిని అభ్యర్థించాడు. ఆ తర్వాత ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ రూపంలో ఈ ప్రదేశంలో శివుడు బ్రహ్మకు దర్శనం ఇచ్చాడు. మత్స్యోదరి క్షేత్రంలో పుణ్యస్నానం చేసి ఓంకారేశ్వరుడిని పూజించిన భక్తుడికి పునర్జన్మ ఉందని నమ్మకం. అంతేకాదు కేవలం ఆలయాన్ని సందర్శించడం ద్వారా అశ్వమేధ యాగం చేసిన పుణ్యఫలాన్ని పొందుతాడు..