SGSTV NEWS
Hindu Temple HistorySports

Lord Ganesha: మూడు తొండాలు, ఆరు చేతులున్న గణపతి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..!



హిందువులు పూజ, శుభ కార్యాలలు అసలు ఏ పని చేయాలన్నా మొదట వినాయకుడిని పుజిస్తారు. విఘ్నాలు కలగకుండా ఆ పని నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటారు. ఏకదంతాయ వక్రతుండాయ అంటూ పుజిస్తారు. అయితే ఎపుడైనా మూడు తొండలు ఉన్న వినాయకుడిని చూశారా.. అవును మహారాష్ట్రలో గణేశుడికి అంకితం చేయబడిన మూడు తొండాలున్న ఒక ప్రత్యేకమైన ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం..


పూణేలోని త్రిసూంద్ గణపతి గణపతి ఆలయం ఉంది. దీనినే త్రిశూండ్య మయూరేశ్వర్ గణపతి మందిరం అని కూడా పిలుస్తారు. గణేశుడికి అంకితం చేయబడిన ఒక ప్రత్యేకమైన ఆలయం, మూడు తొండాలున్న వినాయక విగ్రహంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని “త్రిసూంద్” అంటే మూడు తొండాలు అనే పేరు వచ్చింది. సోమ్వర్ పేట్ జిల్లాలోని నజగిరి అనే నదీ తీరంలో ఉన్న ఈ త్రిసూంద్ గణపతి దేవాలయం. చిన్నదే.. కానీ అందమైన ఆలయం. ఇక్కడ గర్భ గుడిలో కొలువైన గణపతికి మూడు తొండాలు, ఆరు చేతులు ఉంటాయి. నెమలిని సింహాసనంగా చేసుకుని కూర్చున్న అరుదైన విగ్రహం.


ఆలయ నిర్మాణ శైలి, శాసనాలు

ఇండోర్ సమీపంలోని ధంపూర్‌కు చెందిన భీమ్జిగిరి గోసావి అనే భక్తుడు ఈ ఆలయ నిర్మాణాన్ని 1754లో మొదలుపెట్టారట. పదహారు ఏళ్ల తరువాత 1770లో వినాయకుడిని ప్రతిష్టించారు. రాజస్థానీ, మాల్వా ,దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలులను మిళితం చేసి, దక్కన్ రాతి బసాల్ట్ ఉపయోగించి నిర్మించబడింది. ఆలయ గర్భగుడి గోడల మీద సంస్కృతం, పర్షియన్ భాషలలో శాసనాలు, భగవద్గీతలోని శ్లోకాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎక్కడా లేని విధంగా వినాయకుడికి మూడు తొండాలు, ఆరు చేతులు స్వామి నెమలి వాహనంపై ఆశీనుడై ఉంటాడట.



ఈ ఆలయం ఎత్తైన వేదికపై నిర్మించబడింది. ఆలయానికి వెళ్లేందుకు మెట్లు ఉన్నాయి. మందిరం ప్రవేశ ద్వారానికి దారితీసే ఒక చిన్న ప్రాంగణం ఉంది. ద్వారపాలకుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. ఆలయంప్రాంగణంలో దేవతా విగ్రహాలు, ఏనుగులు, గుర్రాలు సహా అనేక రకాల జంతువుల విగ్రహాల శిల్పాలు ఎంతో అందంగా కనిపిస్తాయి.

ఈ ఆలయంలో ఒక గోడ మీద అమెరికన్ సైనికుడు ఖడ్గ మృగాన్ని ఇనప చైనులతో కడుతున్నట్టుగా ఉండే శిల్పం కనిపిస్తుంది. ఇలాంటిది మన దేశంలో మరే ఆలయంలో కనిపించదు. అంతేకాదు ఈ ఆలయంలో విగ్రహం కింద ఉన్న గదిలో ఆలయాన్ని నిర్మించిన మహంత్ శ్రీ దత్తగురు గోసవి మహారాజ్ సమాధి కూడా ఉంది. ఆలయం క్రింద భాగంలో కొలనును నిర్మించారు. ఏడాడంతా నీటితో ఉండే ఆ కొలనుని గురుపూర్ణిమ రోజు నీటిని తీసి పొడిగా ఉంచుతారు. ఆలయ నిర్మాణకర్త గోసవికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

Related posts

Share this