ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ద్వితీయ తిథి ఈరోజు తెల్లవారుజామున 3.44 నుంచి ప్రారంభమై జూలై 8వ తేదీ తెల్లవారుజామున 4.14 వరకు ఉండనుంది. ఈ నేపధ్యంలో జగన్నాథుడు రథయాత్ర రేపటి వరకూ జరగనున్నట్లు సమాచారం. జగన్నాథ రథయాత్ర సమయంలో ఈ సారి సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడనున్నదట. ఈ శుభ సమయంలో రథయాత్ర జరగనుంది.
Also read :Chappan Bhog: జగన్నాథుడుకి 56 రకాల నైవేద్యాలు సమర్పించిన అనంతరం వేప పొడిని ఎందుకు ఇస్తారో తెలుసా..
జగన్నాథుని వార్షిక రథయాత్ర ఉత్సవాలకు ఒడిశాలోని పూరీ నగరం సర్వం సిద్ధమైంది. నేడు జగన్నాధుడు తన అన్నా చెల్లిలితో కలిసి నగరంలో రథాలపై విహరించనున్నాడు. 53 ఏళ్ల తర్వాత రథ యాత్ర రెండు రోజులు జరగనుంది. మీడియా కథనాల ప్రకారం ఈసారి రథయాత్ర రోజున అరుదైన శుభ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ద్వితీయ తిథి ఈరోజు తెల్లవారుజామున 3.44 నుంచి ప్రారంభమై జూలై 8వ తేదీ తెల్లవారుజామున 4.14 వరకు ఉండనుంది. ఈ నేపధ్యంలో జగన్నాథుడు రథయాత్ర రేపటి వరకూ జరగనున్నట్లు సమాచారం.
జగన్నాథ రథయాత్ర సమయంలో ఈ సారి సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడనున్నదట. ఈ శుభ సమయంలో రథయాత్ర జరగనుంది. అంతే కాదు ఈరోజు (జూలై 7 ఆదివారం) నాడు, రవి పుష్య నక్షత్రం, సర్వార్థ సిద్ధి యోగం, శివాస్తో సహా అనేక శుభ యోగాలు ఏర్పడ్డాయి. రవి పుష్య యోగంలో బంగారం, వెండి, ఇల్లు, వాహనం కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంతే కాకుండా, ఈ శుభ యోగంలో గృహ ప్రవేశం, కొత్త పనిని ప్రారంభించడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
Also read :Ratha Yatra 2024: జగన్నాథుని యాత్ర ఎందుకు జరుగుతుంది? పురాణాల ప్రకారం రథయాత్ర కోరిక ఎవరిదంటే?
రెండు రోజుల పర్యటన
గ్రహాలు, రాశుల లెక్కల ప్రకారం ఈ సంవత్సరం రెండు రోజుల యాత్ర నిర్వహించనున్నారు. అయితే చివరిసారిగా 1971లో రెండు రోజుల యాత్ర నిర్వహించబడింది
సోమవారం, జూలై 8, 2024
జూలై 8వ తేదీ ఉదయం మళ్లీ రథం ముందుకు కదలనుంది. రథయాత్ర సోమవారం గుండిచా ఆలయానికి చేరుకుంటుంది. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైతే రథం మంగళవారం ఆలయానికి చేరుకుంటుంది.
8-15 జూలై 2024
జగన్నాథుడు, బలరాముడు, సుభద్రల రథాలు గుండిచా ఆలయంలోనే ఉంటాయి. వారి కోసం ఇక్కడ అనేక రకాల వంటకాలు తయారుచేస్తారు. దేవునికి నైవేద్యాలు సమర్పిస్తారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం నేటికీ పూర్తిగా పాటిస్తున్నారు.
16 జూలై 2024
రథయాత్ర జూలై 16 న నీలాద్రి విజయ అనే ఆచారంతో ముగుస్తుంది. ముగ్గురు దేవుళ్లు కలిసి తిరిగి జగన్నాథ ఆలయానికి వస్తారు.
జగన్నాథ దేవాలయం సింహద్వారం
వాస్తవంగా మూడు రథాలను జగన్నాథ దేవాలయంలోని సింహద్వారం ముందు నిలిపి అక్కడి నుంచి గుండిచా ఆలయానికి తీసుకువెళతారు. ఒక వారం పాటు రథాలు అక్కడే ఉంటాయి. ఈ రోజు మధ్యాహ్నం భక్తులు రథాన్ని లాగనున్నారు. ఈ సంవత్సరం రథయాత్రకు సంబంధిత ‘నవ యవ్వన దర్శనం’ , ‘నేత్ర ఉత్సవం’ వంటి ఆచారాలు ఈ రోజున ఒకేసారి నిర్వహించనున్నారు. ఈ ఆచారాలు సాధారణంగా రథయాత్రకు ముందు నిర్వహిస్తారు.
నేత్ర ఉత్సవం అని పిలువబడే ప్రత్యేక ఆచారం
పురాణాల ప్రకారం జేష్ఠ పూర్ణిమ రోజున అధికంగా స్నానం చేయడం వలన జగన్నాధుడు, సుభద్ర, బలారాముడు అస్వస్థతకు గురవుతారని నమ్మకం. అందుకనే ఈ సమయంలో లోపల ఉంటారు. నవ యవ్వన దర్శనం ముందు.. పూజారులు ‘నేత్ర ఉత్సవం’ అనే ప్రత్యేక ఆచారాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో జగన్నాధుడు, సుభద్ర, బలారాముడి కళ్లకు రంగులు వేస్తారు.
Also read :Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఆషాఢమాసం ఉత్సవాలు.. ఆగస్ట్ 4 వరకు అమ్మవారికి సారె సమర్పణ
హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఈ రోజు జగనున్న జగన్నాధుడు రధయాత్రలో దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు. అంతేకాదు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆదివారం భక్తులతో కలిసి రథయాత్రను వీక్షించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి రాక సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రథయాత్రలో ఎటువంటి అవాంచనీయ సంఘటలు జరగకుండా చూసేందుకు.. రధయాత్ర సజావుగా సాగేందుకు ఒడిశా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు.