SGSTV NEWS online
Spiritual

హోలికా ఎవరు…? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే అసలైన హోలీ..!

 

Holika story: హిందూ మతంలో ప్రతీ పండగ వెనుక ఏదో ఒక కారణం, చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటాయి. మరికొద్ది రోజుల్లో మనం జరుపుకోబోతున్న పవిత్రమైన పండుగ హోలీ..వెనుక కూడా కొన్ని ఆధ్యాత్మిక విశేషాలున్నాయి. హోలీ పండగను మనం ఎందుకు జరుపుకుంటాం. హోలీకా లేదా కామ దహనాన్ని ఎందుకు చేస్తామనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సనాతన ధర్మంలో ప్రతి పండుగ, ప్రతి ఆచారం వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక కారణాలు, పురాణ కథనాలు, ఒక నీతిబోధ దాగి ఉంటుంది. చెడుపై మంచి గెలిచిన సందర్భాలను స్మరించుకోవడమే కాకుండా.. ధర్మం ఎప్పటికీ నిలిచిపోతుందనే విశ్వాసాన్ని బలపరచడానికే ఈ పండుగలు. ప్రస్తుతం కలియుగ ప్రభావంతో అధర్మం ఎంత విస్తరించినా.. చివరికి ధర్మమే విజయం సాధిస్తుందనే సందేశాన్ని మన పండుగలు మనకు ఎప్పుడూ గుర్తు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో మనం జరుపుకోబోతున్న పవిత్రమైన పండుగ.. హోలీ గురించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. హోలీ పండగను మనం ఎందుకు జరుపుకుంటాం. హోలీకా లేదా కామ దహనాన్ని ఎందుకు చేస్తామనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

హోలీకా ఎవరు?

హిందూ పురాణాల ప్రకారం హోలీకా.. రాక్షసరాజు హిరణ్యకశిపు సోదరి, ప్రహ్లాదుడుకి అత్త. ప్రహ్లాదుడు జన్మతః మహా విష్ణుభక్తుడు. కానీ విష్ణువును ద్వేషించే హిరణ్యకశిపుడు తన కుమారుడిని భక్తి మార్గం నుంచి తప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. ఎంత ప్రయత్నించినా, విష్ణు తన భక్తుడైన ప్రహ్లాదుడిని అన్ని అపాయాల నుంచి కాపాడుతూనే ఉన్నాడు.

చివరికి హిరణ్యకశిపుడు ఒక కపట యోచన చేశాడు. అగ్నిలో కాలిపోని వరం కలిగిన హోలీకాను, ప్రహ్లాదుడిని ఒడిలో పెట్టుకుని అగ్నిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు. కానీ, దైవశక్తితో పరిస్థితి మారింది. భక్తుడైన ప్రహ్లాదుడు అగ్నిలోనూ క్షేమంగా బయటపడగా.. హోలీకా మాత్రం తన దురుద్దేశం కారణంగా అగ్నిలో కాలిపోయింది. ఈ సంఘటన చెడుపై మంచి గెలిచిన విజయానికి ప్రతీకగా నిలిచింది. అయితే, ఆ హోలిక రాక్షసి మరణం తర్వాత రఘు మహా రాజు రాజ్యంలోని ప్రజలు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటారు.

నాటి నుంచే హోలికా దహనం.

అప్పటి నుంచి హోలీకి ముందు రోజు “హోలీకా దహనం” నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఆ రోజు రాత్రి ఇంటి ముందో, వీధి మధ్యలో కట్టెలను పేర్చి, ఉపయోగం లేని వస్తువులను వేసి దహనం చేస్తారు. దీని ద్వారా చెడు, అహంకారం, అసూయ వంటి దుష్ప్రవర్తనలు దహించబడతాయని భావిస్తారు.

హోలీకా దహనం తర్వాత ఆ బూడిదను పవిత్రంగా భావించి నుదుటి మీద తిలకంగా ధరించుకుంటారు. మరుసటి రోజు రంగులతో ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హర్షోత్సాహాలతో హోలీ జరుపుకుంటారు. తీపి వంటకాలు తయారు చేసి శ్రీకృష్ణుడుకు సమర్పించి భక్తితో పూజిస్తారు.

కామదహనం – అంతరార్థం

పురాణాలలో మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పార్వతి దేవి, పరమశివుడును వివాహం చేసుకోవాలనే సంకల్పంతో, ఆయన తపస్సును భంగపరచమని కామదేవుడును ప్రార్థిస్తుంది. కామదేవుడు పూలబాణాన్ని ప్రయోగించి శివుని ఏకాగ్రతను భంగపరచడానికి ప్రయత్నిస్తాడు. అయితే, తపస్సుకు భంగం కలిగిందని ఆగ్రహించిన శివుడు తన మూడో నేత్రాన్ని తెరిచి కామదేవున్ని భస్మం చేస్తాడు. కామదేవుని భార్య రతి ప్రార్థనతో.. ఆ తర్వాత శివుడు అతన్ని అనంగ రూపంలో పునర్జీవింపజేస్తాడు. ఈ సంఘటన మనిషిలోని అశ్రేయస్కర కోరికలను నియంత్రించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది.

హోలీ పండుగలోని సందేశం

హోలీకా దహనం, కామదహనం వంటి ఆచారాలు కేవలం పురాణగాథలు మాత్రమే కావు. అవి మనలోని అహంకారం, అసూయ, కోపం, అధర్మం, అశుద్ధ కోరికలను దహింపజేసి, సత్సంకల్పాలతో జీవించాలనే సందేశాన్ని అందిస్తాయి. రంగుల పండుగగా హోలీ ఆనందాన్ని పంచుతూనే, మనసులోని మలినాలను తొలగించి సత్స్వరూపాన్ని ఆవిష్కరించుకోవాలని బోధిస్తుంది. ఈ హోలీని మనం కేవలం సంబరాలకే పరిమితం కాకుండా, అంతరార్థాన్ని గ్రహించి ధర్మపథంలో నడిచే సంకల్పంతో జరుపుకుంటే, ఆ పండుగ మరింత పవిత్రమవుతుంది

Also read

Related posts