April 15, 2025
SGSTV NEWS
Spiritual

Hindu Puja Tips: దేవుడికి పెట్టిన పువ్వు పూజ సమయంలో కింద పడితే దేనికి సంకేతమో తెలుసా..!



హిందూ మతంలో పూజ సమయంలో దేవుడి పటాలకు లేదా విగ్రహాలకు దండలు వేస్తారు. పువ్వులతో పూజ చేస్తారు. ఇలా చేస్తున్న సమయంలో పువ్వులు అకస్మాత్తుగా కింద పడిపోతే అప్పుడు మన మనస్సులో అనేక రకాల సందేహాలు తలెత్తుతాయి. కొంతమంది దీనిని శుభ సంకేతంగా భావిస్తారు. మరికొందరు ఏదైనా చెడు జరగబోతుందనే సంకేతంగా భావిస్తారు.



హిందూ మతంలో దాదాపు ప్రతి ఇంట్లో ఉదయాన్నే దేవుడిని పూజిస్తారు. భగవంతుని పూజలో ఉపయోగించే ముఖ్యమైన వాటిల్లో పువ్వులు ఒకటి. పువ్వులు లేకుండా ఏ పూజైనా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. గుడికి వెళ్లినా లేదా ఇంట్లో పూజ చేసినా దేవుడికి పూలు లేదా దండలు సమర్పించుకుంటారు. అయితే ఆ సమయంలో పువ్వు లేదా దండ కింద పడిపోతే.. ఆందోళన కలుగుతుంది. ఆ సమయంలో మన మనస్సులో అనేక రకాల సందేహాలు తలెత్తుతాయి. కొంతమంది దీనిని శుభ సూచకంగా భావిస్తారు. మరికొందరు ఏదైనా చెడు జరగబోతోందనడానికి ముందుగా దీనిని సంకేతంగా భావిస్తారు. అయితే అసలు అర్థం ఏమిటో తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించరు.


ఇలా జరిగితే ప్రమాదానికి సంకేతం
ఆలయాన్ని సందర్శించిన తర్వాత దేవుడికి సమర్పించిన పువ్వు లేదా పువ్వుల దండ దేవుడి నుంచి కింద పడిపోవడం మీ జీవితంలో మార్పుకి సంబంధించినడి అని మీరు ఏదైనా నిర్ణయం తీసుకుని ఉంటె దానిని మళ్ళీ పరిశీలించమని నొక్కిచెప్పే సంఘటన అని.. ఇది రాబోయే ఇబ్బందులకు సంకేతం అని కొందరు నమ్ముతారు. తద్వారా మీ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలి. అదే సమయంలో భవిష్యత్ ఎదురుకానున్న సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని ఓ సూచన అని అంటారు.

సమయం, ప్రదేశం.. ప్రభావం
దేవునికి సమర్పించిన తర్వాత పువ్వులు మాలలోని పువ్వు.. లేదా మాల కింద పడితే అది స్థలం లేదా సమయం బట్టి ఫలితం ఉంటుందని నమ్ముతారు. ఉదాహరణకు తప్పుడు సమయంలో పూజ చేశారనీ లేదా తప్పుడు స్థలంలో కూర్చొని పూలు లేదా దండలు సమర్పించారని దీనికి అర్ధమట. దేవుడికి సమర్పించిన పువ్వులు లేదా దండలు నేల పడటం అశుభ సంకేతం అని కొందరు నమ్ముతారు. ఇలా జరగడం అంటే దేవుడు మీ పూజను ప్రార్ధనను అంగీకరించలేదని.. మీరు కోరుకున్న కోరిక నెరవేరదని సూచనట.




భగవంతుడి సందేశం ఏమిటంటే..
పురాణ గ్రంధాల ప్రకారం దేవుడికి సమర్పించిన పూల మాల లేదా ఒక పువ్వు అకస్మాత్తుగా పడిపోవడం అంటే దేవుడు అక్కడ ఉన్నాడని.. మీ భక్తిని చూస్తుంన్నాడని సంకేతం. అందుకే ఈ దివ్య ఘట్టం శుభప్రదంగా కూడా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరమైన విధంగా జీవితంలో సానుకూల మార్పులు చేసుకోవాలని కొంతమంది పండితులు చెబుతున్నారు.

Related posts

Share via