SGSTV NEWS
Spiritual

రహస్యాలకు నిలయం భీముడు నిర్మించిన పరశుర సరస్సు.. ద్వాపరయుగంతో ఎలా సంబంధం ఉందంటే..

భారతదేశం ఆ సేతు హిమాచలం ఎక్కడ చూసినా ఏదోక పుణ్యక్షేత్రం, ఏదొక అద్భుతం కనిపిస్తూనే ఉంటుంది. మనల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. అలాంటి అద్భుతాల వెనుక పురాణం కథలు ఉంటాయి. నేటికీ మానవ మేథస్సుకి సవాల్ విసిరే మిస్టరీలు ఉంటాయి. అలాంటి మిస్టరీ ప్రదేశంలో ఒకటి పరాశర సరస్సు. హిమాచల్‌లో ఉన్న ఈ సరస్సుకు ద్వాపర యుగంతో సంబంధం ఉంది. అందుకనే ఈ పరాశర సరస్సుకి చారిత్రకంగానే కాదు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ అందమైన సరస్సు పాండవులతో ఎలా ముడిపడి ఉందో తెలుసుకుందాం.


హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో ఉన్న పరాశర సరస్సు ద్వాపర యుగానికి సంబంధించినది. పరాశర సరస్సు మండి నగరం నుంచి దాదాపు 49 కిలోమీటర్ల దూరంలో హిమాలయ పర్వతాలలో దౌలాధర్‌ పర్వతశ్రేణుల దగ్గర ఉంది. ఈ మడుగులోకి కేవలం మంచు కరగడం వల్లే నీరు ఏర్పడుతుంది. ఆ నీరు ఎప్పటికప్పుడు ఆవిరైపోతూ ఉంటుంది. ఈ సరస్సు సమీపంలో పరాశర అనే ఋషి పురాతన ఆలయం కూడా ఉంది. నేటికీ ప్రజలు ఈ ఆలయానికి దూర ప్రాంతాల నుంచి దర్శనం కోసం వస్తారు.

ఈ ఆలయ చరిత్ర గురించి చెప్పాలంటే, ఋషి పరాశరుడు ఈ ప్రదేశంలో తపస్సు చేశాడని నమ్ముతారు. ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో మండి రాష్ట్ర రాజు బన్సేన్ నిర్మించాడు. కానీ ఈ ప్రదేశంలో ఉన్న సరస్సు పాండవ కాలానికి సంబంధించినది. పురాణాల ప్రకారం ఈ సరస్సు ఋషి పరాశరుడికి అంకితం చేయబడింది. ఆయన ఈ సరస్సుపై తపస్సు చేసాడు.

ఈ సరస్సు వెనుక ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది. మహాభారత యుద్ధం అనంతరం పాండవులు కమ్రునాగ్‌ అనే యోధునితో కలిసి హిమాలయ పర్వతాల సమీపంలో ప్రయాణిస్తున్నారట. అప్పుడు కమ్రునాగ్ ఒక చోట ఆగి..ఇది తనకు చాలా నచ్చింది.. కనుక ఈ ప్రదేశంలోనే జీవిస్తానని పాండవులకు చెప్పాడట. అప్పుడు తనకు దాహార్తిని తీర్చేలా ఒక సరస్సుని సృష్టించమని భీముడిని కోరగా.. భీముడు తన మోచేతితో ఓ పర్వత శిఖరాన్ని తొలగించాడట. ఈ సరస్సు మోచేయి ఆకారంలో ఉంటుంది. అలా ఏర్పడిన సరస్సే ఈ పరశుర సరస్సు అని అంటారు. అంతేకాదు ఈ సరస్సు లోటుని ఇప్పటివరకూ ఎవరూ కనిపెట్టలేకపోయరట.



ఈ సరస్సు కింద లోతైన పర్వతం ఉందనేందుకు సాక్ష్యంగా ఈ సరస్సు లోతుని ఇప్పటివరకూ ఎవరూ తెలుసుకోలేకపోయారు. మంచు తుపానుల సమయంలో సరస్సులోకి పడే వందల అడుగుల దేవదారు వృక్షాలు కంటి కూడా కనిపించకుండా మాయమైపోతూ ఉంటాయి. అంతేకాదు ఈ సరస్సు మీద తేలుతూ ఉండే ఓ చిన్న ద్వీపం కాలానుగుణంగా సరస్సులోని ఒక మూల నుంచి మరో మూలకి కదులుతూ ఉండడం మరొక విశేషం.

మరొక పురాణం కథ ప్రకారం భీముడు ఈ సరస్సును ఋషి పరాశర గౌరవార్థం నిర్మించాడని నమ్ముతారు. భీముడు తన మోచేయితో పర్వతాన్ని కొట్టి పరాశర సరస్సును సృష్టించాడు. ఈ సరస్సును ఋషి పరాశర కోసం నిర్మించారని, అతను ఇక్కడ తపస్సు చేశాడని నమ్ముతారు. అందుకే ఈ సరస్సుకు పరాశర సరస్సు అని పేరు వచ్చింది.

పరశుర రుషి ఎవరు?

పరాశర సరస్సు.. ఆలయం ఇక్కడ ఒక పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. దీనిని సందర్శించడానికి ప్రజలు దూర ప్రాంతాల నుంచి వస్తారు. ఈ ఆలయ గదిలో పరాశర మహర్షి విగ్రహం ప్రతిష్టించబడింది. పరాశర మహర్షి వశిష్ఠ మనవడు, శక్తి మహర్షి కుమారుడు. దశరథ మహారాజు గురువుగా వశిష్ఠ మహర్షిని చెబుతారు. ఆయన భూత, వర్తమాన, భవిష్యత్తు దార్శనికుడు. దేవుడు ఒకేసారి సత్య జ్ఞానాన్ని ఇచ్చిన ఏడుగురు సప్తఋషులలో వశిష్ఠ మహర్షి ఒకరు.

ప్రతి సంవత్సరం పరాశర సరస్సు వద్ద కాశీ, ఋషి పంచమి, సౌరనాహున్లి వంటి ముఖ్యమైన పండుగలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ సమయంలో ఇక్కడ ఇతర లోయల నుంచి ప్రజలంతా ఇక్కడికి చేరుకుంటారు. తమతో పాటుగా తమ గ్రామదేవతలను కూడా ఊరేగింపుగా తీసుకువస్తారు


Also read

Related posts