ఆషాఢ మాసం పౌర్ణమి రోజుని గురు పూర్ణిమగా వ్యాస పౌర్ణమిగా హిందువులు జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువు , లక్ష్మీదేవిని పూజిస్తారు. గురు పూర్ణిమ రోజున కొన్ని ప్రదేశాలలో నెయ్యితో దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా ఎవరినా డబ్బుకి ఇబ్బంది పడుతుంటే.. ఖచ్చితంగా ఈ పరిహారం చేయడం వలన ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి.
గురు పూర్ణిమ ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది. ఈ రోజుకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆషాడ గురు పౌర్ణమి శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవికి అంకితం చేయబడిందని నమ్ముతారు. అలాగే ఈ రోజున గురువులను పూజిస్తారు. ఈ పౌర్ణమి రోజున వ్యాస పౌర్ణమిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజుకి ప్రాముఖ్యత ఉంది. గురు పూర్ణిమన విష్ణువు, లక్ష్మీదేవిని పూజించడంతో పాటు కొన్ని చర్యలు తీసుకుంటే సంపద దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందవచ్చు. వీటిలో ఒకటి గురు పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో నెయ్యి దీపం వెలిగించడం. ఇలా చేయడం ద్వారా వ్యక్తి జీవితంలో డబ్బు కొరత తొలగిపోతుంది. విష్ణువు, లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఈ రోజు గురు పౌర్ణమి రోజున నెయ్యి దీపాలను ఏ ప్రదేశాలలో వెలిగించాలో తెలుసుకుందాం..
తులసి మొక్క దగ్గర దీపం వెలిగించండి:
గురు పూర్ణిమ రోజున తెల్లవారుజామున లేచి స్నానం చేసి విష్ణువు, లక్ష్మీదేవిని ఆచారాలతో పూజించాలి. అలాగే సాయంత్రం పద్ధతి ప్రకారం పూజ చేసి తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో గురు పూర్ణిమ రోజున తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే.. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. సంపద పెరగడం ప్రారంభమవుతుంది. డబ్బు కొరతను ఎదుర్కొంటుంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ప్రయత్నించండి. పేదరికం నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.
విష్ణువు ముందు నెయ్యి దీపం వెలిగించండి:
శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవికి అంకితం చేయబడిన ఈ రోజున పూజ సమయంలో విష్ణువు ముందు నెయ్యి దీపం వెలిగించి నియమాను సారం పూజిస్తే జీవితంలోని దుఃఖాల నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే విష్ణువు ఆశీస్సులు లభిస్తాయి. గురు పూర్ణిమ రోజున నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.
రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి
గురు పౌర్ణమి రోజున రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీస్సులను పొందవచ్చు. కుటుంబ సభ్యుల జీవితాల్లో సానుకూలత వస్తుంది. గురు పూర్ణిమ రోజున ఈ పరిహారం చేస్తే జీవితంలోని అడ్డంకులను కూడా తొలగించుకోవచ్చు. ఆగిన పని పూర్తి కావడం ప్రారంభమవుతుంది.
విష్ణు, లక్ష్మి దేవి ఆలయాల్లో దీపం వెలిగించండి
రోజున విష్ణువు, లక్ష్మీ ఆలయంలో నెయ్యి దీపం వెలిగించడం చాలా ఫలవంతమైనదని నమ్ముతారు. ఇలా చేయడం ద్వారా మనిషి జీవితంలోని అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆనందం ఇంటి తలుపు తట్టడం ప్రారంభమవుతుంది. గురు పూర్ణిమ రోజున నెయ్యి దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని, వ్యాపారంలో సమస్యలను కూడా అధిగమించవచ్చని నమ్ముతారు.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించండి
గురు పూర్ణిమ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం ద్వారా ఇంటి నుంచి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సానుకూల శక్తి ప్రసారం అవుతుంది. ఈ శుభ తేదీలో ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు. దీనితో పాటు కుటుంబ సభ్యుల జీవితాల్లో కూడా ఆనందం వస్తుంది.
