వాస్తు ప్రకారం..మన ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు మనకు సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. అవి వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఇంట్లో పెట్టుకునే గడియారానికి కూడా వాస్తు చూసుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో గోడకు వేలాదీసే గడియారం సరైన దిశలో పెట్టినప్పుడు మాత్రమే అది మనకు అదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు..ఇంట్లో ఆనందం తీసుకొస్తుంది. లేదంటే ఇంట్లో సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంట్లో గడియారాన్ని ఏ దిశలో ఉంచాలో వాస్తు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో గడియారం ఉంచడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇది కుటుంబ సభ్యులలో సానుకూలతను, మానసిక శాంతిని కాపాడుతుందని నమ్ముతారు. గడియారం దక్షిణ దిశలో పెట్టకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అది అనుకోకుండా పెట్టినా కూడా ఇది అశుభకరమైనదిగా పరిగణిస్తారని నిపుణులు సూచిస్తున్నారు.
దక్షిణ దిశలో గడియారం ఉంచడం వల్ల పురోగతి ఆగిపోతుందని, వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, పొరపాటున కూడా విరిగిన లేదా దెబ్బతిన్న గడియారాన్ని ఇంట్లో ఉంచకూడదని చెబుతున్నారు. గడియారానికి దుమ్ము అంటుకోకూడదని, ఇది మన చెడు కాలానికి సూచనగా చెబుతనున్నారు. గడియారానికి దుమ్ము పట్టకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచిస్తున్నారు.
అలాగే, ఇంట్లో ఆగిపోయిన గడియారం కూడా ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇది పురోగతి మందగించడానికి సంకేతం అంటున్నారు.. ముందుగా దాన్ని ఇంటి నుండి బయటకు విసిరేయాలని చెబుతున్నారు. గడియారంలోని సమయాన్ని వెనక్కి సెట్ చేయకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం గడియారంలోని సమయాన్ని కొన్ని నిమిషాలు ముందుకు సెట్ చేయవచ్చు. ఇది శ్రేయస్సును తెస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం, నీలం, నలుపు, కుంకుమ, మురికి గోడలపై గడియారాన్ని ఉంచకూడదు. ఇది ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంట్లో చెడిపోయిన గడియారం ఉంచకూడదు. ఇంటి ప్రధాన ద్వారం పైన గడియారం ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, గడియారాన్ని బహుమతిగా ఇవ్వకూడదు. అది వారికి మీ అదృష్టాన్ని ఇచ్చినట్లే.
