December 12, 2024
SGSTV NEWS
Spiritual

జీవితంలో సుఖ సంతోషాల కోసం గీతా జయంతి రోజున ఈ చర్యలు చేయండి.. శుభఫలితాలు మీ సొంతం



గీతా జయంతి రోజున శ్రీ కృష్ణ భగవానుని ఆశీర్వాదం పొంది.. జీవితంలో సంతోషం, శ్రేయస్సు తీసుకురావడానికి అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. దీని ద్వారా మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. వాటిలో కొన్ని ప్రధాన పరిష్కారాలను తెలుసుకుందాం…



గీతా జయంతి అనేది హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ. భగవద్గీత పుట్టిన రోజుని.. గీతా సారాన్ని గుర్తుచేసుకోవడానికి, జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ రోజున కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీ కృష్ణుడు గీతను ఉపదేశించాడు. జీవిత తత్వశాస్త్రం, కర్మ, మతం, మోక్షానికి సంబంధించిన జ్ఞానాన్ని గీతగా బోధించాడు. గీతా జయంతి రోజున గీతా జ్ఞాన జ్యోతి ప్రసరిస్తుంది. జీవితంలోని ప్రతి అంశాన్ని భగవద్గీతలో పేర్కొన్నారు. భగవద్గీత కర్మయోగ ప్రాముఖ్యత గురించి ప్రస్తావించాడు కృష్ణుడు.

కర్మయోగం ప్రకారం మనిషి తన పనిని తాను నిస్వార్థంగా చేస్తూనే ఉండాలి. గీతలో మోక్షాన్ని పొందే మార్గం వివరించబడింది. మోక్షం అంటే విముక్తి లేదా భగవంతునితో ఐక్యం. భగవద్గీత జీవితాన్ని జీవించే కళను నేర్పుతుంది. క్లిష్ట పరిస్థితులలో కూడా సహనం , శాంతిని కాపాడుకోవం ఎలా అనేది బోధిస్తుంది. గీతా అధ్యయనం ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది. మనిషి భగవంతునితో అనుసంధానం అయ్యే మార్గాన్ని చూపుతుంది.

పంచాంగం ప్రకారం గీతా జయంతి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ తిధి డిసెంబర్ 11వ తేదీ తెల్లవారుజామున 3.42 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 12వ తేదీ తెల్లవారుజామున 1.09 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో గీతా జయంతిని డిసెంబర్ 11 న మాత్రమే జరుపుకోవాల్సి ఉంటుంది.




గీతా జయంతి రోజున చేయాల్సిన ప్రత్యేక చర్యలు ఏమిటంటే

1  గీతా పారాయణం: గీతా జయంతి రోజున శ్రీమద్భగవద్గీత పఠించడం అత్యంత ముఖ్యమైన..పుణ్య కార్యంగా పరిగణించబడుతుంది. గీతా జ్ఞానం జీవితంలోని అనేక సమస్యలకు పరిష్కారాలను అందిస్తుంది . స్వీయ-జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.

2    శ్రీ కృష్ణుని ఆరాధన: ఈ రోజున శ్రీకృష్ణుని నియమ నిష్టలతో పూజించండి. కృష్ణుడి విగ్రహం లేదా చిత్రపటం ముందు దీపం వెలిగించి, ధూపం, పువ్వులు సమర్పించండి

3     ఉపవాసం చేయండి: గీతా జయంతి రోజున ఉపవాసం ఉండటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శ్రీ కృష్ణ భగవానుడి అనుగ్రహం లభిస్తుంది.

4   సాత్విక్త ఆహారం: ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోండి. సాత్విక ఆహారం శరీరం, మనస్సు రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుతుంది.

5   దానం: పేదలకు ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయండి. దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.

6    మంత్ర పఠనం: ఈ రోజున “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం జపించడం వలన శ్రీకృష్ణుడి అనుగ్రహం మీ సొంతం.

7   తులసి పూజ: తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. ఈ రోజున తులసి మొక్కను పూజించి, తులసి దళాలను దేవునికి సమర్పించండి.

8    శివారాధన: శివ పార్వతులను పూజించడం కూడా ప్రయోజనకరం. కనుక గీతా జయంతి రోజున ప్రతి ఒక్కరూ గీతా జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేసేందుకు ప్రయత్నించండి.


గీతా జయంతి రోజున ఈ చర్యల వల్ల కలిగే ప్రయోజనాలు

గీతాధ్యయనం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది సరైన జీవన మార్గాన్ని తెలుసుకుంటారు. గీతా బోధనలు పాటించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి ఒత్తిడి తగ్గుతుంది. గీతా జయంతి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు పాటించడం వలన జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. గీతా జ్ఞానం మోక్షానికి దారితీస్తుంది. గీతా జయంతి రోజున ఈ చర్యలు చేయడం వల్ల శ్రీకృష్ణుని అనుగ్రహం పొంది జీవితంలో విజయం సాధిస్తారు.

జీవితానికి సరైన మార్గాన్ని భగవద్గీత కృష్ణుడు వివరించాడు. కొన్ని చర్యలను చేయడం వలన.. గీతా జ్ఞానాన్ని మన జీవితంలో అన్వయించుకోవడం వలన మెరుగైన జీవితాన్ని గడపవచ్చు. గీతా జయంతి రోజున తీసుకునే ఈ చర్యలు కేవలం ఒక్కరోజు మాత్రమే కాదు ఏడాది పొడవునా పాటించవచ్చు. జీవితంలో గీతా జ్ఞానాన్ని అమలు చేయడానికి ప్రయత్నించండి. పేదలకు, ఆపన్నులకు సహాయం చేయండి

Related posts

Share via