April 19, 2025
SGSTV NEWS
Spiritual

Garuda Puranam: పాపాలు చేసే వారికి గరుడ పురాణం ప్రకారం విధించే దారుణమైన శిక్షలు ఇవే..

హిందువులు కర్మ సిద్దాంతాన్ని నమ్ముతారు. మనిషి చేసే మంచి చెడుల ఆధారంగా ఫలితాలు ఉంటాయని విశ్వాసం. ఇదే విషయాన్ని అష్టాదశ మహా పురాణాల్లో ఒకటి అయిన గరుడ పురాణంలో పేర్కొన్నారు. శ్రీ మహా విష్ణువు తన భక్తుడైన గరుత్మంతుడికి ప్రసాదించిన ఈ పురాణానికి విష్ణువే అధిపతి. గరుడ పురాణం మరణం తరువాత ఆత్మ ప్రయాణం.. కర్మలనుసరించి విధించే రకరకాల శిక్షలను చెప్పింది.

ఇది కూడ చదవండి

Garuda Puranam: మరణానంతరం గరుడ పురాణాన్ని ఎందుకు చదవాలి? నియమాలు, కథ, ప్రాముఖ్యత ఏమిటంటే

ఎవరి జీవితం అయినా మెరుగుపడాలంటే లేదా ఎవరైనా సరైన మార్గంలో నడవాలని కోరుకుంటే..వారిని గరుడ పురాణాన్ని చదవమని తరచుగా చెబుతారు. ఎందుకంటే గరుడ పురాణంలో మరణానంతర జీవితంలో మానవునికి జరిగే ప్రతిదాని గురించి వివరణ లేదా ‘వర్ణనం’ ఉంది. అది వారి కర్మ ఫలాలు కావచ్చు లేదా వారి పాపాలకు శిక్షలు కావచ్చు.. ప్రతిదీ గరుడ పురాణంలో ప్రస్తావించబడింది. వాస్తవానికి వివిధ పాపాలకు సంబంధించిన 28 రకాల నరకాలు, శిక్షలు గరుడ పురాణంలో ప్రస్తావించారు. అయితే ఈ రోజు మానవుడు చేసే పాపాలకు పడే శిక్షలలో ఏడింటి గురించి తెలుసుకుందాం..

ఇది కూడ చదవండి

Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ సంకేతాలు కనిపిస్తే మరణం ఆసన్నం అయినట్లట

తమిస్రం

ఒకరి భావాలతో ఒకరు ఆడుకునేవారు.. ఇతరుల నమ్మకాన్ని మోసం చేసేవారు. లేదా ఇతరులను మోసం చేసి దొంగిలించే వారు తమిశ్రమానికి వెళ్లాల్సి ఉంటుందని చెబుతారు. అక్కడ యమ ధర్మ రాజు మనుషులు తమ పాపాలకు పశ్చాత్తాపపడే వరకు వారిని కొరడాతో కొట్టి కొట్టి హింసిస్తారు. తమిశ్రమంలో ఆత్మలను కట్టివేసి కొరడాతో కొడుతూ విశ్రాంతి లేదా ఉపశమనం లేకుండా చేస్తారని గరుడ పురాణంలో పేర్కొన్నారు. యమదూతలు కాలపాశంతో కట్టేసే చిమ్మచీకటి నరక కూపాన్నే తమిశ్రం అంటారు.

ఇది కూడా చదవండి

Garuda Puranam: ఇంట్లో కలహాలకు కారణాలు ఇవే..! గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా..?

రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. యమ ధర్మ రాజు మరణాంతరం ఆత్మలను విచారించే మరో సాధారణ పాపం దొంగతనం. ఇతరుల సంపద, ఆస్తి, వనరులు, డబ్బు లేదా వారి వ్యక్తిగత లాభానికి సహాయపడే ఏదైనా వస్తువును దొంగిలించిన పాపి ‘రౌరవం’ వైపు వెళ్తాడు. రౌరవంలో ఇలాంటి వ్యక్తుల ఆత్మలను విష నాగులు శిక్షిస్తాయని చెబుతారు.

ఇది కూడా చదవండి

Garuda Puranam: మరణానంతర జీవితం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా..?

కుంభిపాకం

సాధు జంతువులను చంపి తినే వారిని కుంభీపాకం ద్వారా శిక్షిస్తారు. అక్కడ వారు అమాయక జంతువులను శిక్షించినట్లే శిక్షించబడతారు. పాపులను జంతువులతో వ్యవహరించినట్లుగా వేడి నూనెలో ఉడకబెట్టారు. ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది. కణకణలాడే రాగిపాత్రలాగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది. అందులో పాపులను వేసి శిక్షిస్తారు.

ఇది కూడ చదవండి

Garuda Puran: ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా సాగుతుందో తెలిస్తే.. వణికిపోతారు..

క్రిమిభోజనం

ఇంటికి వచ్చిన అతిథులును ఆదరించకుండా.. వారికీ కనీసం తినడానికి పానీయాలు, ఆహరం అందించని వారికీ క్రిమిభోజనం పెడతారు. ఇది క్రిమికీటకాలతో నరకం నిండి ఉంటుంది. అతిధులకు పెట్టకుండా తినేవారిని, ఎదుటి వాళ్ళను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరిపారేసే వాళ్ళను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు.

ఇది కూడ చదవండి

Garuda Purana: గరుడ పురాణంలో ప్రతి పాపానికి ఒక శిక్ష.. ఏయే పాపాలకు ఏ శిక్షలు విధిస్తారో తెలుసా..

అంధకుపం

తమ అధికారాన్ని దుర్వినియోగం చేసేవారిని, ఇతరులకు సహాయం చేయని.. పౌరుడిగా తమ బాధ్యతలలో విఫలమైన వ్యక్తులకు అంధకుపం నరకంలో బాధిస్తారు. చిన్న చీమకు అపకారం తలపెట్టని వాళ్లని బాధించేవారిని ఇక్కడ నిరంతర దాడి చేస్తారు. అడవి జంతువులు, కీటకాలు, సరీసృపాలచే హింసించబడతారు.

ఇది కూడ చదవండి

Garuda Puranam: మీ జీవితాన్ని మార్చేసే పది సూత్రాలు..! మీ కష్టాలన్నీ దూరం అవుతాయి..!

విసాసనం

విసాసనం అనేది అసూయ, గర్వంతో నిండి, సమాజంలో తమకు ఉన్నంత స్థానం సంపాదించి ఇచ్చిన వ్యక్తులను తక్కువగా చూసే వ్యక్తులకు మరణానంతర జీవితం విసాసనం. ఇక్కడ పేదవారిని తిట్టి, అగౌరవపరిచి, వారిని అవమానించే వ్యక్తులను ఇక్కడ శిక్షిస్తారు. విసాసనంలో పాపిని యమ కింకరులు కొట్టి హింసిస్తారు.

సారమేయాసనం

దొంగతనం చేసేవారు, దోచుకునేవారు, ఇతరులను మోసం చేసి తమ ఆస్తులను, సంపదలను పొందే వ్యక్తులు సారమేయాసనం శిక్షకు గురవుతారని నమ్మకం. ఈ నరలో తమ సామాజిక విధులను నిర్వర్తించని, సమాజాన్ని అగౌరవపరిచే వ్యక్తులకు చోటు. సారమేయాసనంలో ఆత్మపై ఆకలితో ఉన్న కుక్కలతో దాడి చేస్తాయి. ఇక్కడ జంతువులు ఆత్మ శరీరాన్ని పదే పదే చీల్చివేస్తాయని చెబుతారు.

Related posts

Share via