SGSTV NEWS
Spiritual

Garuda Puran: గరుడ పురాణం ప్రకారం ఈ అలవాట్లు ఉన్నవారు జీవితాంతం పేదరికంతోనే ఉంటారట.. వెంటనే మార్చుకోండి..

 

శ్రీ మహా విష్ణు అధినేత అయిన గరుడ పురాణాన్ని ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు మాత్రమే చదవాలని నమ్ముతారు. అయితే ఈ గరుడ పురాణంలో ఆచారఖండం, ధర్మకాండము, బ్రహ్మకాండము భాగాలు ఉన్నాయి. దీనిలోని మొదటి భాగాన్ని అంటే ఆచారఖండం లేదా పూర్వఖండం ఎప్పుడైనా పఠించవచ్చు. దీనిలో పేర్కొన్న విషయాలను తమ జీవితంలోకి అన్వయించుకోవడం వలన జీవితాన్ని మార్చుకోవచ్చు.


హిందూ మతంలో మొత్తం 18 పురాణాలున్నాయి. ఈ పురాణాలలో ఒకటి గరుడ పురాణం. ఇది మానవుని కర్మల గురించి .. వాటి ఆధారంగా మనిషికి లభించే మంచి, చెడు ఫలితాల గురించి చెప్పే గ్రంథం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆత్మకు శాంతి చేకూరాలని 13 రోజుల పాటు ఇంట్లో గరుడ పురాణం పారాయణం చేస్తారు. గరుడ పురాణం వినడం ద్వారా ఎవరైనా సరే తమ కర్మలను మార్చుకోవచ్చు ఎందుకంటే ఈ పురాణంలో అతని జీవితాన్ని మార్చగల అనేక విషయాలు ఉన్నాయి.

గరుడ పురాణంలో కూడా ఇలాంటి అనేక అలవాట్లు ప్రస్తావించబడ్డాయి. ఆ అలవాట్లు మనిషిని పేదరికం వైపు నడిపిస్తాయి. వీటిని సకాలంలో మార్చుకోకపొతే ఆ వ్యక్తి తీవ్రమైన నరకయాతన అనుభవిస్తాడు. అతని ఆత్మ చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో జీవించినంత కాలం పేదరికంలో ఉండే విధంగా చేసే అలవాట్లు.. ఆ వ్యక్తిని నరక ద్వారాలకు తీసుకెళ్ళే అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం.

ఆలస్యంగా నిద్రపోవడం: ప్రతి వ్యక్తి జీవితంలో సోమరితనం అతిపెద్ద శత్రువు. రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం ఆలస్యంగా మేల్కొనే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విజయం సాధించలేడు. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాదు విలువైన సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతారు. ఉదయాన్నే నిద్రలేచే అలవాటు మనిసి తాను కోరుకునే వస్తువులను పొందడంలో సహాయపడుతుంది.

స్వచ్ఛమైన శరీరం, స్వచ్ఛమైన మనస్సు: గరుడ పురాణం ప్రకారం రోజూ స్నానం చేయకుండా, మురికిలో నివసించే వారు పేదరికంతో ఇబ్బంది పడతారు. ఇలాంటి వ్యక్తుల ఇంట్లో లక్ష్మిదేవి అడుగు పెట్టదు. అంతేకాదు ఇలాంటి ఏపని చేద్దామనుకున్నా మళ్ళీ మళ్ళీ వైఫల్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. రోజూ స్నానం చేసి పరిశుభ్రంగా ఉండడమే కాదు స్వచ్చమైన మనసుతో ఉన్న వ్యక్తుల ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. మనిషి సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానం చేసి, దేవుడిని ధ్యానించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

వంటగదిని శుభ్రంగా ఉంచండి: జ్యోతిషశాస్త్రం ప్రకారం రాత్రి సమయంలో వంటగదిని ఎప్పుడూ మురికిగా ఉంచుకోకూడదు. రాత్రి నిదపోయే ముందు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. తిన్న తర్వాత వంట పాత్రలను వెంటనే శుభ్రం చేసుకోవాలి. కడగాలి. గరుడ పురాణం ప్రకారం వంటగది మురికిగా ఉన్న ఇంట్లో డబ్బు ఉండదు. ప్రతికూల శక్తులు అక్కడ నివసిస్తాయి.

దురాశ ఉంటే: దురాశ చెడ్డదని మీరు ఎప్పుడైనా విని ఉంటారు. అయితే ఈ దురాశ జీవితంలో విజయానికి అతిపెద్ద అడ్డంకి. గరుడ పురాణం ప్రకారం దురాశపరుడు ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. అలాంటి వ్యక్తి ఎల్లప్పుడూ ఇతరుల సుఖ సంతోషాలను, సంపదను గమనిస్తూ ఉంటాడు.. ఇతతులతో తనని తాను పోల్చుకుంటూ తన జీవితాన్ని సంతోషంగా గడపడం మరచిపోతాడు.

ఇతరులను విమర్శించేవారు: గరుడ పురాణం ప్రకారం, ఇతరులను విమర్శించే వ్యక్తుల పట్ల లక్ష్మీ దేవి ఎప్పుడూ సంతోషించదు. విమర్శించే వ్యక్తి ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించడు. ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాడు. అతని మనస్సు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. కనుక ఇలాంటి అలవాట్లు ఉన్న వ్యక్తులు ఎప్పుడూ పేదరికంతో జీవిస్తారు

Related posts

Share this