SGSTV NEWS
Spiritual

Garuda Purana: ఇలాంటి పనులు చేసిన వ్యక్తులు మరుజన్మలో కాకి, రాబందులుగా పుడతారట.. ఆ పనులు ఏమిటంటే..

 

సనాతన ధర్మం జనన మరణ చక్రాన్ని విశ్వసిస్తుంది. ప్రతి జీవికి మరణం తప్పదు.. మరణించిన జీవికి మళ్ళీ జన్మ తప్పదు అనే భావనపై ఆధారపడి ఉంటుంది. హిందూ మతంలో గరుడ పురాణాన్ని మరణం తర్వాత జీవి ప్రయాణం తెలియజేసే పురాణంగా పరిగణిస్తారు. గరుడ పురాణం ప్రకరం జీవి ప్రయాణం, తదుపరి జీవితంలో ఫలితాలను కర్మ ప్రకారం నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి తన జీవితంలో ఏ పనులు చేసే మరు జన్మలో కాకులు, రాబందులుగా పుడుతారో తెలుసుకుందాం..

అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. దీనిని స్వయంగా శ్రీ మహా విష్ణువే.. తన భక్తుడైన గరుడికి భోధించినట్లు వ్యాస మహర్షి పేర్కొన్నాడు. ఈ గరుడ పురాణంలో తప్పు ఒప్పులు, జీవి ప్రయాణం, కర్మ సిద్దాంతం వంటి వాటిని తెలియజేస్తుంది. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తప్పుడు పనులు చేయడం వల్ల చేసిన పాపాలు తదుపరి జన్మలో కూడా అతన్ని వదలవని చెప్పబడింది. పాపాలు చేసిన వ్యక్తి తదుపరి జన్మలో ఎలా బాధపడతాడో… అదేవిధంగా, గరుడ పురాణం స్నేహం గురించి కూడా చెబుతుంది. ఏ కర్మ ఒక వ్యక్తిని తదుపరి జన్మలో రాబందుగా, లేదా కాకులుగా జన్మించేలా చేస్తుందో తెలుసుకుందాం..

గరుడ పురాణం ప్రకారం ఆహ్వానం లేకుండా ఎవరి ఇంటికి అయినా వెళ్ళే వ్యక్తి, లేదా పెళ్లి విందుకు వెళ్లి అక్కడ భోజనం చేసే వ్యక్తి, తదుపరి జన్మలో కాకి గా జన్మిస్తాడు. కొంత కాలం క్రితం వరకూ ఇంటి ఆవరణలో కాకి అరిస్తే ఇంటికి అతిథి రానున్నాడని చెప్పేవారు. దీని వెనుక కారణం కాకికి సంబంధించిన కృత జన్మ అని గరుడ పురాణం పేర్కొంది.

ఎవరి ఇంటికి అయినా ఆహ్వానం లేకుండా అతిథిగా వెళ్ళితే అటువంటి వ్యక్తి తదుపరి జన్మలో కాకిగా జన్మించే శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. అందుకనే కాకి అతిధి ఇంటికి వస్తుంటే.. ముందుగా ఆ ఇంటి ఆవరణలోకి వెళ్లి యజమానికి ఎవరైనా వస్తున్నారని తెలియజేస్తుంది. తద్వారా ఇంటి యజమాని ఆతిథి రాకకు వీలైనంత వరకు సిద్ధం అయ్యే ఆవకాశం ఉంటుంది.


గరుడ పురాణం ప్రకారం ఏ వ్యక్తి అయినా తన స్నేహితుడికి ద్రోహం చేసినా లేదా ఏ విధంగానైనా తనని నమ్మిన వారిని మోసం చేసినా అటువంటి వ్యక్తి తదుపరి జన్మలో పర్వతాలలో నివసించే రాబందు జన్మని ఎత్తుతాడు. తన కడుపు నింపుకోవడానికి చనిపోయిన జంతువులను తినాల్సి ఉంటుంది.

గరుడ పురాణంలో స్నేహం చాలా మంచిదని .. స్నేహ ధర్మాన్ని వివరించింది. సుఖ దుఃఖాలలో తన స్నేహితులతో పాటు నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. అయితే నేటి కాలంలో స్నేహం పేరుతో ఇతరులను తమ సొంత ప్రయోజనం కోసం మోసం చేస్తుంటారు.. లేదా ఏదో ఒక విధంగా మోసం చేసే స్నేహితులు చాలా మంది ఉంటారు. అటువంటి వ్యక్తులు ఈ జన్మలోనే కాదు.., తదుపరి జన్మలో కూడా ఈ పాపం వదలదు వారిని. అందుకే ఇలా స్నేహం పేరుతో మనిషిని మోసం చేసే వ్యక్తుల ఆత్మలు తదుపరి జన్మలో పర్వతాలలో ఒంటరిగా నివసించే రాబందు రూపాన్ని తీసుకుంటాయి. అంతేకాదు ఇవి తన కడుపు నింపుకోవడానికి చనిపోయిన జంతువులను తినవలసి ఉంటుంది

Related posts

Share this