అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. విష్ణువు గరుత్మండికి మనిషి జీవితంలో చేసిన కర్మ గురించి.. మరణాంతరం జీవి ప్రయాణం గురించి తెలియజేస్తుంది. మరణ సమయంలో మనిషి పొందే అనుభవాలను మాత్రమే కాదు.. జీవించి ఉండగా మనిషి చేసే పనుల గురించి కూడా స్వయంగా శ్రీ మహా విష్ణువు వెల్లడించాడు. ఈ రోజు భార్య భర్తల మధ్య ఉండాల్సిన బంధం గురించి చెప్పాడు. ఒక భర్తకు ఉండాల్సిన లక్షణాలు భార్యని ఎలా చూసుకోవాలి అనే విషయం గురించి కూడా వెల్లడిస్తుంది గరుడపురాణం. ఈ రోజు భార్యని భర్త ఎలా చూసుకోవాలి? తెలుసుకుందాం..
హిందూ మతంలో భార్యాభర్తల మధ్య సంబంధం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. భార్యాభర్తల మధ్య సంబంధంలో నువ్వు గొప్ప నేను గొప్ప అనే తేడా లేదని నమ్ముతారు. ఒకరితో ఒకరు అన్నటుగా నడిచే భర్త భర్తలు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారని అంటారు. వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని నియమాలు గరుడ పురాణంలో ఇవ్వబడ్డాయి. అదే సమయంలో భర్త తన భార్యతో ఎప్పుడూ ఎలా ప్రవర్తించకూడదో కూడా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి.
గరుడ పురాణం, మనుస్మృతి, మహాభారతం ఇలా ఏ పురాణ గ్రంధాన్ని ప్రామాణికంగా తీసుకున్నా ఏ భర్త కూడా తన భార్యతో ఇలా ప్రవర్తించకూడదు. భర్త ఇలా చేస్తే.. అతను నరకం అనుభవించాల్సి ఉంటుంది. దీనితో పాటు అతను మరు జన్మలో కూడా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రోజు భర్త తన భార్యతో ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకుందాం.
శారీరక- మానసిక బాధ
గరుడ పురాణంలోని ఏడవ అధ్యాయం ప్రకారం భర్త తన భార్యను శారీరకంగా లేదా మానసికంగా హింసిస్తే.. మరణానంతరం అతడిని ‘రౌరవ నరకానికి’ పంపుతారు. రౌరవ నరకంలో రురు అనే భయంకరమైన పాము నివసిస్తుంది. అది పాపాత్ములను నిరంతరం కాటేస్తుంది. మను స్మృతి ప్రకారం తన భార్యను ఇబ్బంది పెట్టే పురుషుడు మరుజన్మలో కూడా బాధపడవలసి ఉంటుంది.
భార్యను మోసం చేసే భర్త
గరుడ పురాణంలోని 10వ శ్లోకం (యస్తు భార్యాపరిత్య పరస్త్రిషు రామేత్ నరః. స కుంభినిప్కే గోరే పచ్యతే కాలసంత్య II यस्तु भार्यापरित्य परस्त्रिषु रामेत नरः। स कुंभिनिपके गोरे पच्यते कालसंत्य ॥) ప్రకారం తన భార్యతో కాకుండా ఇతర స్త్రీలతో సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి మరణానంతరం కుంభీపాక నరకంలో పడవేయబడతాడు. అక్కడ యమ దూతలు ఆత్మను మరిగే నూనెలో విసిరి భయంకరంగా హింసిస్తారు.
భార్యని నిరంతరం అవమానించే భర్తకు మహాభారతంలోని ఆనుశాసనికపర్వంలోని 88వ అధ్యాయంలో తన భార్యను అవమానించిన వ్యక్తి మరణం తర్వాత కూడా తదుపరి జన్మలో బాధపడతాడని వ్రాయబడింది. దీనితో పాటు మనుస్మృతి ప్రకారం, స్త్రీని అవమానించే వ్యక్తి జీవితం నరకంలా మారుతుంది.
భావోద్వేగాలను విస్మరించే భర్త భార్య భావాలను పట్టించుకోని భర్త, భార్యని ప్రేమించని భర్త లేదా భర్త తన భార్యను పని చేయమని బలవంతం చేస్తే లేదా ఆమెతో పని చేయించుకుంటే.. అతను భౌతిక జీవితంలోనే కాదు ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా ఇబ్బంది పడతాడు. అటువంటి వ్యక్తి ఘోరమైన శిక్షలను అనుభవిస్తాడు.
హక్కుల ఉల్లంఘన తన భార్య హక్కులను ఉల్లంఘించే పురుషుడు అనేక జన్మల పాటు పేదరికాన్ని, నరకాన్ని అనుభవించాల్సి ఉంటుంది
