April 16, 2025
SGSTV NEWS
Hindu Temple HistorySpiritual

Ganesha Temple: బ్రహ్మచారులను ఓ ఇంటికి వారిగా చేసే ఆలయం.. కోరికల అర్జిని పెట్టుకున్న వెంటనే తీర్చే గణపతి ఎక్కడంటే

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయం ఆర్జివాలే గణపతి ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలు నెరవేరుతాయని ఈ ఆలయం గురించి ఒక నమ్మకం. ఈ ఆలయానికి దూరప్రాంతాల నుంచి భక్తులు తమ కోర్కెలు తీర్చుకునేందుకు వస్తుంటారు. ముఖ్యంగా బ్రహ్మచారులు ఈ గణపతిని దర్శించుకుని పూజలు చేస్తారు.

హిందూ మతంలో శివ పార్వతుల కుమారుడైన గణేశుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మొదట పూజను అందుకుంటాడు. ఏదైనా శుభ కార్యంలో లేదా పూజలో ముందుగా వినాయకుడిని పూజిస్తారు. దేశవ్యాప్తంగా గణపతికి అనేక ఆలయాలు ఉన్నాయి. అయితే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని షిండే కి కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న గణపతి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం 300 సంవత్సరాల చరిత్ర గల ఆలయంగా.. అతి పురాతనమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం. ఈ ఆలయంలో ఉన్న వినాయకుడి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. ఇందులో వినాయకుడు నవ్వుతూ కనిపిస్తాడు. ఈ రూపం భక్తుల మదిలో ఆనందాన్ని నింపుతుంది.

అర్జీ వాలే గణపతి ఎందుకు అంటారంటే
ఈ ఆలయం గురించి ఒక నమ్మకం ఉంది. ఎవరైనా సరే గణపతిని దర్శించుకుని భక్తి విశ్వాసాలతో పూజ చేస్తే ఆ భక్తుడి కోరికను నెరవేరుస్తాడు. ఈ నమ్మకంతోనే దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తమ కోరికలను చెప్పుకోవడానికి ఈ ఆలయానికి వస్తారు. భక్తులు తమ అర్జీలను సమర్పించేందుకు వెళ్తారు. అందుకే ఈ దేవాలయం “ఆర్జివాలే గణపతి మందిరం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది.

పెళ్ళికాని బ్రహ్మచారులు
ప్రత్యేకంగా ఈ ఆలయంలో పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలు తమకు వివాహం జరిపించమని కోరడానికి గణపతి ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ గణపతిని సందర్శించడం వల్ల పెళ్లి జరగడంలో ఏమైనా అడ్డన్కులుంటే అవి తొలగి త్వరలో పెళ్లి జరుగుతుందని నమ్ముతారు. దీంతో పాటు వైవాహిక జీవితంలోని అడ్డంకులు తొలగిపోవాలంటూ కూడా దంపతులు కోరుకుంటారు. సంతానం కలగాలని, వ్యాపారంలో పురోభివృద్ధి, ఉద్యోగావకాశాల కోసం గణపతికి దరఖాస్తు చేసుకునేందుకు కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దీంతో ఏడాది పొడవునా ఈ ఆలయం భక్తుల రద్దీతో నిండిపోతుంది.

Related posts

Share via