విఘ్నాలధిపతి వినాయకుడి ఆలయాలు మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. ముంబై సహా వివిధ ప్రాంతాల్లో పురాతన, ప్రసిద్ధ వినాయక దేవాలయాలున్నయి. భారతదేశంలో వినాయకుడికి అంకితం చేయబడిన పురాతన దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం..హిందూ మతంలో ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ ప్రాముఖ్యత ఎన్నదగినది. గణేశుడుకి చెందిన ఈ ఆలయం భక్తికి చిహ్నం. ఈ ఆలయానికి సంబంధించి ఒక అందమైన కథ ఉంది. లంకా రాజు రావణుడి మరణం అనంతరం రావణుని తమ్ముడు విభీషణుడికి రాముడు శ్రీ రంగనాథుని విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చాడని రామాయణం పేర్కొంది.
హిందూ క్యాలెండర్ ప్రకారం వినాయక చవితి పండుగ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంది. ప్రసిద్ధ పండుగను బాధ్రప్రద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి రోజున జరుపుకుంటారు. వినాయక చవితి రోజున భక్తులు ఇంట్లో గణపతిని పూజిస్తారు. దేవాలయాలలో గణపతిని దర్శించుకుంటారు. అయితే విఘ్నాలధిపతి వినాయకుడి ఆలయాలు మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. ముంబై సహా వివిధ ప్రాంతాల్లో పురాతన, ప్రసిద్ధ వినాయక దేవాలయాలున్నయి. భారతదేశంలో వినాయకుడికి అంకితం చేయబడిన పురాతన దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం..
సిద్ధివినాయక దేవాలయం, ముంబై (మహారాష్ట్ర)
సిద్ధివినాయకుని ఆలయం ముంబయిలోని ప్రభాదేవి ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఇక్కడ సిద్ధివినాయకుడిని ‘కోరికల ప్రభువు’ లేదా ‘జ్ఞానానికి ప్రభువు’ లేదా ‘జ్ఞానోదయం పొందినవాడు’ అని పూజిస్తారు. సిద్ధివినాయకుని విగ్రహం ఇతర వినాయక విగ్రహాలకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ వినాయకుడు ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉన్నాడు, నుదిటిపై మూడవ కన్ను, నాలుగు చేతులు ఉంటాయి. సిద్ధివినాయకుడి ఒక చేతిలో కమలం, గొడ్డలి, జపమాల (పవిత్రమైన పూసల దండ), ఎడమ చేతిలో మోదకం కలిగి ఉంటాడు.
శ్రీమంత్ దగ్దుషేట్ హల్వాయి ఆలయం (పుణె, మహారాష్ట్ర)
పూణేలోని శ్రీమంత్ దగ్దుషేట్ హల్వాయి గణపతి మందిరం కూడా ప్రసిద్ధి చెందిన ఆలయం. దీనిని స్వీట్స్ తయారు చేసే దగుషేట్ నిర్మించారు. ఇది మహారాష్ట్రలో రెండవ ప్రసిద్ధ దేవాలయం. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ధనిక ఆలయం. అంతేకాదు ఇక్కడ గణపతిని బంగారు నగలతో అలంకరిస్తారు. ఆలయంలోని వినాయక విగ్రహం ₹10 మిలియన్లకు బీమా చేశారు.
గ్యాంగ్‌టక్ గణేష్ ఆలయం (గ్యాంగ్టక్, సిక్కిం)
సముద్ర మట్టానికి 6500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ ఆలయం గణేశుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయానికి సిక్కిం రాజధాని గాంగ్టక్ పేరు పెట్టారు.
గణపతిపూలే (రత్నగిరి, మహారాష్ట్ర)
గణపతిపూలే దేవాలయం మహారాష్ట్ర లోని రత్నగిరి సమీపంలోని ఒక ముఖ్యమైన పవిత్ర క్షేత్రం. ఈ ఆలయంలోని వినాయకుడి విగ్రహం స్వయంభూ అని చెబుతారు. గణేశ విగ్రహం పశ్చిమాభిముఖంగా ఉంది. మహారాష్ట్రలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి.
రాక్‌ఫోర్ట్ ఉచి పిళ్లై ఆలయం (తిరుచిరాపల్లి, తమిళనాడు)
హిందూ మతంలో ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ ప్రాముఖ్యత ఎన్నదగినది. గణేశుడుకి చెందిన ఈ ఆలయం భక్తికి చిహ్నం. ఈ ఆలయానికి సంబంధించి ఒక అందమైన కథ ఉంది. లంకా రాజు రావణుడి మరణం అనంతరం రావణుని తమ్ముడు విభీషణుడికి రాముడు శ్రీ రంగనాథుని విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చాడని రామాయణం పేర్కొంది. విభీషణుడు ఆ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లాడు. అయితే ఇది స్వర్గంలోని దేవతలకు నచ్చలేదట. ఆ సమయంలో విగ్రహం అతని వద్ద ఉండకూడదని దేవతలు గణేశుడి సహాయం కోరారు. దేవతల అభ్యర్థనకు స్పందించిన గణేశుడు ఆవు వేషంలో విభీషణుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. విభీషణుడు కావేరి నదిలో స్నానం చేయాలనుకుని… అతను చేతిలోని శ్రీ రంగనాథుని విగ్రహాన్ని నేలపై ఉంచాడు. దీంతో విగ్రహాన్ని తరలించలేని పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనతో విభీషణుడుకి కోపం వచ్చింది. ఆవు రూపంలో ఉన్న గణేష్‌ని ఉచ్చి పిళ్లై వద్దకు తీసుకెళ్లాడు. ఆవును అక్కడ పట్టుకున్నప్పుడు.. వినాయకుడు మారువేషంలో తన వద్దకు వచ్చాడని గ్రహించాడు. అలా అక్కడ వినాయకుడు స్వయం భుగా వెలసినట్లు కథనం.
కర్పగ వినాయగర్ దేవాలయం (పిళ్ళయార్‌పట్టి, తమిళనాడు)
ఈ ఆలయంలో 7వ శతాబ్దంలో రాతితో చెక్కబడిన గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. తమిళనాడులోని పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. అయితే ఇక్కడ వినాయకుడి విగ్రహం సాధారణ విగ్రహానికి భిన్నంగా ఉంటుంది. నాలుగు చేతులు ఉండవు. ఈ ఆలయంలోని విగ్రహానికి కేవలం 2 చేతులు మాత్రమే ఉన్నాయి.
మోతీ దుంగ్రి ఆలయం(జైపూర్, రాజస్థాన్)
నాలుగు వందల సంవత్సరాల కంటే పాతది. జైపూర్‌లోని మోతీ డంగ్రీ కొండ దిగువన నిర్మించబడిన ఈ ఆలయం రాజస్థాన్‌లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఏడాది పొడవునా భక్తులతో రద్దీగా ఉంటుంది.
త్రినేత్ర గణేశ దేవాలయం (రణతంబర్, రాజస్థాన్)
వెయ్యేళ్ల నాటి రణతంబోర్ కోటలో ఉంది. ఈ ఆలయంలో స్వీయ నిర్మిత గణేశ శిల్పం ఉంది. ఇక్కడ వినాయకుడి విగ్రహానికి త్రినేత్రుడిలా మూడు కళ్ళు ఉంటాయి.