SGSTV NEWS
Spiritual

Festivals in August 2025: ఆగష్టు నెలలో ముఖ్యమైన పండగల ఇవే.. తేదీలు, శుభ సమయం తెలుసుకోండి..



హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెల ఆధ్యాత్మికత పరంగా చాలా ముఖ్యమైనది. ఈ నెలలో అనేక పెద్ద పండుగలున్నాయి. ఈ పండగల్లో వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, జన్మాష్టమి, వినాయక చవితి ప్రధానమైనవి. ఈ రోజు ఆగస్టు 2025లో పండగలు, ఉపవాసం పూజా శుభ సమయం గురించి తెలుసుకోండి.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెల ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనది. ఈ నెలలో అనేక ప్రధాన పండుగలున్నాయి. ఇవి మతపరమైన దృక్కోణంలో చాలా ప్రత్యేకమైనవి మాత్రమే కాదు వాటితో ముడిపడి ఉన్న సంప్రదాయాలు ప్రజలను సామాజికంగా, సాంస్కృతికంగా కూడా కలుపుతాయి ఆగస్టు 2025లో జరుపుకునే ముఖ్యమైన పండగలు ఏమిటో తెలుసుకుందాం..

ఆగస్టు 2025 నెల భక్తితో నిండి ఉంటుంది. పూజలు, ఉపవాసం వంటి వాటిపై విశ్వాసం ఉన్నవారికి ఈ నెల చాలా ఫలవంతమైనది. ప్రతి తిథి, పూజా ముహూర్తాన్ని అనుసరించి పూజ చేయడం వలన ఆధ్యాత్మిక ప్రయోజనాలను మాత్రమే కాదు మానసిక ప్రశాంతతను, సానుకూల శక్తిని కూడా పొందవచ్చు. ఈ నెలలో ఏఏ పండుగలు ఏఏ తేదేల్లో వచ్చాయి? పూజా శుభ సమయాలు ఏమిటో తెలుసుకుందాం..

ఆగస్టు నెలలో పండుగలు


ఆగష్టు 01 : రెండో శ్రావణ శుక్రవారం

ఆగష్టు 05 : శ్రావణ మంగళవారం. అంతేకాదు పుత్రద ఏకాదశి ఉపవాసం మంగళవారం,5 ఆగస్టు 2025 న జరుపుకుంటారు. సంతానం కావాలని కోరుకునే దంపతులు జరుపుకునే ఒక ముఖ్యమైన హిందూ పండుగ. ఈ పుత్రద ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన పిల్లల ఆనందం, శ్రేయస్సు కోసం ఆచరిస్తారు. ఈ రోజున విష్ణువును పూజించడం, ఉపవాసం ఉండటం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

పూజ ముహూర్తం: ఉదయం 6:10 నుంచి 8:20 వరకు.

ఆగస్టు 6వ తేదీ బుధవారం నాడు శుక్ల పక్ష ప్రదోష వ్రతం జరుపుకుంటారు. ఈ రోజున సాయంత్రం శివుడిని పూజిస్తారు. ఉపవాసం ఉండటం వల్ల వ్యాధి, దుఃఖం, పేదరికం తొలగిపోతాయి.

సాయంత్రం పూజ సమయం సాయంత్రం 6:45 నుంచి రాత్రి 8:15 వరకు.

ఆగస్టు 8వ తేదీ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహిత స్త్రీలు తమ కుటుంబ ఆనందం, శ్రేయస్సు, సిరి సంపదల కోసం ఆచరిస్తారు.

శుభ ముహూర్తం: ఉదయం 7:05 నుంచి 9:00 వరకు; పూజను రోజంతా కూడా చేయవచ్చు.

ఆగష్టు 09 : రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకి రాఖీని కట్టి, రక్షగా ఉండమని ప్రతిజ్ఞ చేస్తారు.

రాఖీ కట్టడానికి శుభ సమయం: ఉదయం 10:15 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు.

ఆగష్టు 12 : మూడో శ్రావణ మంగళవారం. సంకట హర చతుర్ధిని జరుపుకుంటారు. ఈ రోజున విఘ్నాలకదిపతి వినాయకుడిని ప్రత్యేకంగా పుజిస్తారు.

సంకష్టి చతుర్థి చంద్రోదయ పూజ – రాత్రి 8:45 నుంచి 9:30 వరకు

ఆగష్టు 14: బలరామ జయంతి

ఆగష్టు 15 : నాలుగో శ్రావణ శుక్రవారం

శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ ఆగస్టు 16, శనివారం నాడు జరుపుకుంటారు. ఈ రోజున, శ్రీకృష్ణుని జన్మదినాన్ని రాత్రి సమయంలో జరుపుకుంటారు.

నిషిత కాల పూజ ముహూర్తం – 12:04 AM (17 ఆగష్టు) నుంచి 12:47 AM వరకు.

ఆగష్టు 19 : నాలుగో శ్రావణ మంగళవారం. ఈ రోజు అజ ఏకాదశి ఉపవాసం పాటిస్తారు . ఈ ఉపవాసం మోక్షాన్ని పొందడానికి ఆచరించబడుతుంది. శ్రీ మహా విష్ణువుకు అంకితం చేయబడింది.

పూజ ముహూర్తం: ఉదయం 6:10 నుంచి 8:15 వరకు.

ఆగస్టు 20 న కృష్ణ పక్ష ప్రదోష ఉపవాసం ఉంటుంది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఉపవాసం ఆచరిస్తారు. సాయంత్రం పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

శుభ సమయం: సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:00 వరకు.

మాస శివరాత్రి ఆగస్టు 21 న జరుపుకుంటారు . ఈ పండుగ ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్దశి నాడు వస్తుంది. రాత్రి సమయంలో శివుడిని పూజించడం ద్వారా ప్రత్యేక పుణ్యం లభిస్తుంది.

రాత్రి పూజ సమయం – రాత్రి 11:45 నుంచి 12:30 వరకు.

ఆగష్టు 22: ఆఖరి శ్రావణ శుక్రవారం

ఆగష్టు 23 : శనివారం పోలాల అమావాస్య. ఈ రోజు శ్రాద్ధ కర్మలు, దానధర్మాలకు శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున పితృ పక్షంలో ఉపయోగించే కుశను సేకరించే సంప్రదాయం ఉంది.

శుభ సమయం (కుశ సేకరణ , దానం) – ఉదయం 6:00 నుంచి 8:30 వరకు.

ఆగస్టు 27 న గణేష్ చతుర్థి జరుపుకుంటారు. ఈ రోజున వినాయకుడి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ పండుగ పది రోజుల పాటు కొనసాగుతుంది.

విగ్రహ ప్రతిష్టాపన సమయం – ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 1:40 వరకు.

రాధారాణి జన్మదినమైన ఆగస్టు 31 న రాధా అష్టమి జరుపుకుంటారు. ఈ రోజు భక్తి, ప్రేమకు చిహ్నం.

పూజ ముహూర్తం ఉదయం 9:00 గంటల నుంచి 11:00 గంటల వరకు ఉంటుంది.

ఆర్థికంగా నక్కతోక తొక్కబోయే రాశులు.. ఆగస్టు మాసఫలాలు ఇలా..<br> https://sgstvnews.in/spiritual-photos-august-2025-horoscope-check-monthly-predictions-for-all-zodiac-signs-in-telugu-2/

Related posts

Share this