November 22, 2024
SGSTV NEWS
Spiritual

Dussehra 2024: దసరా ఎప్పుడు? ఆయుధ పూజ, రావణ దహనం శుభ సమయం, పూజ, పటించాల్సిన మంత్రాలు ఏమిటంటే

దసరా పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం పదవ రోజున జరుపుకుంటారు. అ ధర్మంపై , చెడుపై మంచి సాధించిన విజయంగా ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ఏడాది విజయదశమి ఎప్పుడు వచ్చింది? రావణ దహన కార్యక్రమం ఎప్పుడు నిర్వహిస్తారు తెలుసుకుందాం..


హిందూ మతంలో దసరా పండుగ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించినందున ఈ రోజును విజయ దశమి అని కూడా పిలుస్తారు. దసరా పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం పదవ రోజున జరుపుకుంటారు. అ ధర్మంపై , చెడుపై మంచి సాధించిన విజయంగా ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ఏడాది విజయదశమి ఎప్పుడు వచ్చింది? రావణ దహన కార్యక్రమం ఎప్పుడు నిర్వహిస్తారు తెలుసుకుందాం..

ఈ ఏడాది దసరా ఎప్పుడంటే


హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆశ్వయుజ మాసం దశమి తిథి అక్టోబర్ 12 ఉదయం 10:58 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే అక్టోబర్ 13 ఉదయం 9:08 వరకు కొనసాగుతుంది. ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం దసరా పండుగను అక్టోబర్ 12 శనివారం జరుపుకోనున్నారు.

రావణ దహన కార్యక్రమం 2024 శుభ సమయం
హిందూ విశ్వాసాల ప్రకారం ప్రదోష కాలంలో రావణ దహనం జరుగుతుంది. పంచాంగం ప్రకారం అక్టోబర్ 12 న రావణ దహనం శుభ సమయం సాయంత్రం 5:53 నుంచి 7:27 వరకు ఉంటుంది.

దసరా శస్త్ర పూజ లేదా ఆయుధ పూజ శుభ సమయం, శుభ ముహూర్తం


దసరా రోజున మధ్యాహ్నం 2:03 నుంచి 2:49 గంటల వరకు శస్త్రపూజ లేదా ఆయుధ పూజను నిర్వహించే శుభ సమయం. దీని ప్రకారం ఈ సంవత్సరం ఆయుధ పూజకు 46 నిమిషాల సమయం లభిస్తుంది.

దసరా రోజున ఈ మంత్రాలను పఠించండి

రామ ధ్యాన మంత్రం
ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్

శ్రీ రామ గాయత్రీ మంత్రం

ఓం దశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి

రామ మూల మంత్రం

ఓం హ్రాం హ్రీం రామ రామాయ నమః



దసరా ప్రాముఖ్యత
హిందూ మతంలో దసరాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజును అసత్యంపై సత్యం సాధించిన విజయంగా, అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. ఈ రోజున, కొత్త పనిని ప్రారంభించడం, వాహనం, ఆభరణాలు కొనుగోలు చేయడం వంటి శుభ కార్యాలు శుభప్రదంగా భావిస్తారు

సేకరణ :—ఆధురి భాను ప్రకాష్



Related posts

Share via