SGSTV NEWS
Spiritual

Durga Immersion 2025: దుర్గమ్మ నిమజ్జన వేడుక ఎప్పుడు? శుభ సమయం.. పద్ధతి తెలుసుకోండి..



దసరా నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభం అయ్యాయి.. అక్టోబర్ 2వ తేదీ గురువారం విజయదశమితో ముగుస్తుంది. ఈ రోజున మండపాలలో ప్రతిష్టించిన దుర్గమ్మ విగ్రహాలను కూడా నిమజ్జనం చేసి అమ్మవారికి వీడ్కోలు పలుకుతారు. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కోసం ప్రార్థన చేస్తారు. ఈ దసరా నవరాత్రి పండుగ భక్తి, విశ్వాసం, నూతన శక్తితో జీవితాన్ని గడిపే విధంగా ప్రతి ఒక్కరినీ ప్రేరేపిస్తుంది.


నవరాత్రి తొమ్మిది రోజుల పాటు భక్తులతో పూజలను అందుకున్న దుర్గాదేవిని దసరా రోజున నిమజ్జనం చేస్తారు. ఇది నవరాత్రి ముగింపును సూచించే ఒక ప్రత్యేక కార్యక్రమం. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో దుర్గాదేవిని సంప్రదాయంగా పూజించిన తర్వాత.. దశమి తిథి రోజున విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. దసరానే విజయదశమి అని కూడా అంటారు. ఈ రోజున భక్తులు దుర్గాదేవి విగ్రహాలను, పూజ ప్రారంభంలో ఏర్పాటు చేసిన కలశాన్ని (ఘటస్థాపన) నిమజ్జనం చేస్తారు. దుర్గామ్మకు ఘనంగా వీడ్కోలు పలుకుతూ.. వచ్చే ఏడాది తిరిగి రావాలని ప్రార్థిస్తారు.

దుర్గమ్మ విగ్రహ నిమజ్జనం 2025 తేదీ, శుభ సమయం
తేదీ: అక్టోబర్ 2, 2025, గురువారం

దశమి తిథి ప్రారంభం – అక్టోబర్ 01, 2025 రాత్రి 07:01 గంటలకు


దశమి తిథి ముగింపు – అక్టోబర్ 02, 2025 రాత్రి 07:10 గంటలకు

దుర్గా నిమజ్జనం ముహూర్తం – 06:15 ఉదయం నుంచి 08:37 ఉదయం

మొత్తం వ్యవధి: 02 గంటల 22 నిమిషాలు

దుర్గా విసర్జనానికి ఉత్తమ సమయం
2025 అక్టోబర్ 02న ఉదయం 07:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు అమ్మవారి నిమజ్జనానికి చాలా శుభప్రదమైన సమయం.

దుర్గదేవి విగ్రహాన్ని ఎలా నిమజ్జనం చేయాలంటే
దశమి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఉపవాసం ఉండి పూజ చేయండి.

దుర్గాదేవి విగ్రహం ముందు లేదా ఘటస్థాపన ముందు దీపం వెలిగించి చివరి హారతి చేయండి.

పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షత, ధూపద్రవ్యాలు, నైవేద్యాలను సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందండి.

భక్తులు పూజ సమయంలో తెలిసి తెలియక ఏదైనా అపరాధం చేస్తే క్షమించమని అమ్మవారిని కోరుకుని.. మళ్ళీ వచ్చే ఏడాది ఇంటికి రమ్మనమని అమ్మవారి రాక కోసం ప్రార్థించాలి.

విగ్రహాన్ని గంగానదిలో, నది, చెరువు లేదా ఏదైనా శుభ్రమైన నీటి వనరులలో నిమజ్జనం చేయండి.

నిమజ్జనం సమయంలో “జై మా దుర్గా” మాతా.. అంటూ ప్రార్ధించండి.

దుర్గాదేవి విగ్రహ నిమజ్జనం ప్రాముఖ్యత
ఇది నవరాత్రిలో అమ్మవారికి చేసిన పూజల పూర్తి ఫలితాలను అందిస్తుంది.

ఈ నిమజ్జనం భక్తుడి జీవితంలో సానుకూల శక్తిని , కొత్త ప్రారంభాలను తెస్తుంది.

దుర్గాదేవి ఆశీస్సులతో, ఇల్లు , కుటుంబంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు నెలకొంటాయి.

ప్రతి ప్రారంభానికి ఒక ముగింపు ఉంటుందని.. ప్రతి ముగింపుతో ఒక కొత్త ప్రారంభం ఉంటుందని ఈ పండుగ మనకు సందేశం ఇస్తుంది.

Related posts