హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో ఒకటి దీపావళి పండగ. దీనిని ధన త్రయోదశి నుంచి అన్నచెల్లెల పండగ వరకూ జరుపుకుంటారు. ఈ సమయంలో షాపింగ్ కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ రాశి ప్రకారం వస్తువులను కొనడం ఆనందం, శ్రేయస్సును తీసుకురావడమే కాదు అదృష్టాన్ని కూడా పెంచుతుంది. ఈ దీపావళికి ఏ రాశి వారికి ఏ వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదమో తెలుసుకుందాం..
దీపావళి పండగ వెలుగుల పండగ. ఆనందం, శ్రేయస్సు ను తీసుకొచ్చే పండుగ. ఈ పండుగ రోజున ఇంటిలో దీపాలను వెలిగించడమే కాదు.. జీవితంలోకి సంపద, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావడానికి ఒక సువర్ణావకాశం కూడా. జ్యోతిష శాస్త్రం ప్రకారం.. దీపావళి రోజున షాపింగ్ చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మీరు మీ రాశి ప్రకారం కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే.. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. జీవితం నుంచి పేదరికం తొలగిపోతుంది. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం దీపావళి సోమవారం, అక్టోబర్ 20వ తేదీ, 2025న జరుపుకుంటారు. ఈ శుభ సందర్భంగా మీ రాశిని పాలించే గ్రహం ప్రకారం షాపింగ్ చేయడం వలన మంచి ప్రయోజనాలను అందుకుంటారు.
దీపావళి పండగ వెలుగుల పండగ. ఆనందం, శ్రేయస్సు ను తీసుకొచ్చే పండుగ. ఈ పండుగ రోజున ఇంటిలో దీపాలను వెలిగించడమే కాదు.. జీవితంలోకి సంపద, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావడానికి ఒక సువర్ణావకాశం కూడా. జ్యోతిష శాస్త్రం ప్రకారం.. దీపావళి రోజున షాపింగ్ చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మీరు మీ రాశి ప్రకారం కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే.. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. జీవితం నుంచి పేదరికం తొలగిపోతుంది. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం దీపావళి సోమవారం, అక్టోబర్ 20వ తేదీ, 2025న జరుపుకుంటారు. ఈ శుభ సందర్భంగా మీ రాశిని పాలించే గ్రహం ప్రకారం షాపింగ్ చేయడం వలన మంచి ప్రయోజనాలను అందుకుంటారు.
మేషరాశి: ఈ రాశికి అధిపతి: కుజుడు.. మేష రాశి వారు వెండి పాత్రలు లేదా వెండి నాణేలు కొనడం చాలా శుభప్రదం. అంతేకాదు ఇత్తడి, రాగితో చేసిన వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ వస్తువులను కొనుగోళ్లు చేయడం కెరీర్‌లో పురోగతిని తెస్తాయి.
వృషభ రాశి: ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారికి వెండి నాణెం, శ్రీ యంత్రం, గోమతి చక్రం లేదా వజ్రం పొదిగిన నగలు కొనడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఇంట్లో సంపద , శ్రేయస్సును పెంచుతుంది.
మిథున రాశి: ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కాంస్య పాత్రలు, అలంకరణ వస్తువులు లేదా పచ్చ రత్నాలను కొనుగోలు చేయవచ్చు. వీటిని జ్ఞానం, శ్రేయస్సుకు చిహ్నాలుగా భావిస్తారు. గణేశ విగ్రహాన్ని కొనుగోలు చేయడం కూడా శుభప్రదం.
కర్కాటక రాశి: ఈ రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారు వెండి వస్తువులు, ముఖ్యంగా వెండి ఆభరణాలు లేదా నాణేలు కొనడం మంచిది. వీరు ముత్యాల హారాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు.
సింహ రాశి: ఈ రాశి అధిపతి సూర్యుడు. వీరు బంగారు ఆభరణాలు, రాగి పాత్రలు లేదా రూబీ రత్నాలు కొనడం ఉత్తమం. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే బంగారు పూత పూసిన వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ కొనుగోళ్లు వీరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. విజయ అవకాశాలను పెంచుతాయి.
కన్య రాశి: అధిపతి: బుధుడు. ఈ కన్య రాశికి చెందిన వారు కాంస్య లేదా పూల కుండీలు, పచ్చ రత్నాలు లేదా గణేశ విగ్రహాన్ని కొనడం శుభప్రదం. ఈ వస్తువులు మీ బుధ గ్రహాన్ని బలోపేతం చేస్తాయి. శ్రేయస్సును తెస్తాయి.
తులా రాశి: ఈ రాశి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి వెండి వస్తువులు ఉత్తమమైనవి. మీరు వజ్రాలు పొదిగిన ఆభరణాలు, వెండి నాణెం లేదా శ్రీ యంత్రాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ కొనుగోళ్లు ఆర్థిక అడ్డంకులను తొలగించడానికి సహాయపడతాయి.
వృశ్చిక రాశి అధిపతి.. కుజుడు. వృశ్చిక రాశి వారికి, రాగి పాత్రలు, ఎరుపు రంగు వస్తువులను కొనడం లేదా ఆస్తిలో పెట్టుబడి పెట్టడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది మీ అదృష్టాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ధనుస్సు రాశి: అధిపతి బృహస్పతి. ఈ రాశి వారు బంగారు ఆభరణాలు, ఇత్తడి పాత్రలు లేదా ఆధ్యాత్మిక పుస్తకాన్ని కొనుగోలు చేయాలి. ఇది వీరికి జ్ఞానం, గౌరవం, ఆర్థిక లాభాలను తెస్తుంది.
మకర రాశి: రాశి అధిపతి శనీశ్వరుడు. వీరు ఇనుము లేదా ఉక్కు పాత్రలు (సేఫ్ లేదా ఫ్రైయింగ్ పాన్ వంటివి) లేదా వాహనం కొనడం మకర రాశి వారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. రత్నం నీలమణిని కూడా కొనుగోలు చేయవచ్చు.
కుంభ రాశి: ఈ రాశి అధిపతి కూడా శనీశ్వరుడు. కుంభ రాశికి చెందిన వ్యక్తులు ఇనుప వస్తువులు, వాహనాలు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేయవచ్చు. అదనంగా దానం కోసం నల్ల నువ్వులు లేదా ఆవ నూనెను కొనుగోలు చేయడం కూడా చాలా శుభప్రదం.
మీన రాశి: ఈ రాశి అధిపతి బృహస్పతి. బంగారం, ఇత్తడి పాత్రలు లేదా పసుపు కొమ్ములు కొనడం మీన రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ జీవితంలో ఆనందం, అదృష్టాన్ని తెస్తుంది.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!