SGSTV NEWS
Spiritual

Diwali 2025: దీపావళి రోజున పాత ప్రమిదల్లో దీపాలు వెలిగించడం శుభమా? అశుభమా? నియమాలు తెలుసుకోండి..



హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం దీపావళి సోమవారం అక్టోబర్ 20, 2025న జరుపుకోనున్నారు. దీపావళి పండుగ కాంతి, శ్రేయస్సు, శుభ శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఇంటిలో, ప్రాంగణాలలో దీపాలను వెలిగిస్తారు. అసలు దీపావళి అంటేనే దీపాల వరస అని అర్ధం.. అటువంటి దీపావళి రోజున వెలిగించే దీపాలు చీకటిని పారద్రోలడమే కాదు.. సానుకూల శక్తిని, లక్ష్మీ దేవి ఆశీర్వాదాలను కూడా సూచిస్తాయి.

దీపాల పండుగ దీపావళిని చీకటిపై కాంతి విజయాన్ని, ఇంటిలో ఆనందం, శ్రేయస్సును తీసుకురావడానికి జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవి, గణేశుడిని పూజిస్తారు. దీపాలను వెలిగిస్తారు. అయితే గతంలో వెలిగించిన పాత మట్టి ప్రమిదలను మళ్ళీ ఉపయోగించడం శుభప్రదమా.. లేదా దీపావళి రోజున పూజలో ఉపయోగించిన వాటిలో తిరిగి వెలిగించడం శుభప్రదమా కదా అని చాలా మంది ఆలోచిస్తారు. ఈ రోజు పాత ప్రమిదలను ఉపయోగించవచ్చా లేదా తెలుసుకుందాం..


దీపావళి నాడు పాత ప్రమిదలను ఉపయోగించవచ్చా..!
మట్టి ప్రమిదలు: సాధారణ మట్టి ప్రమిదలను సాధారణంగా ఒకసారి మాత్రమే ఉపయోగించడం శుభప్రదంగా భావిస్తారు. పూజలో ఉపయోగించిన తర్వాత మట్టి ప్రమిదలను తిరిగి ఉపయోగించరు.

దీపావళి నాడు: దీపావళి ప్రధాన పూజలో ఉపయోగించే పాత మట్టి ప్రమిదలను (దీపాలను) ఉపయోగించడం అశుభకరమని భావిస్తారు. పూజలో ఉపయోగించిడం వలన ఇవి ప్రతికూల శక్తిని గ్రహిస్తాయని నమ్ముతారు. కనుక వాటిని తిరిగి ఉపయోగించకూడదు.


యమ దీపం: ధన త్రయోదశి లేదా నరక చతుర్దశి (ఛోటి దీపావళి) రాత్రి యముని కోసం వెలిగించే దీపాన్ని పాత ప్రమిదని ఉపయోగించవచ్చు. యమ దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించాలి. ఈ దీపం యముడికి అంకితం చేయబడింది. కుటుంబాన్ని అకాల మరణం నుంచి రక్షించమని కోరుతూ ఈ దీపాన్ని వెలిగిస్తారు.

ఇతర లోహాలతో తయారు చేసిన దీపాలకు నియమాలు
పూజ గదిలో ఇంట్లో ఇత్తడి, వెండి లేదా ఇతర లోహపు దీపాలను ఉపయోగిస్టారు. వాటిని దీపావళి రోజున ఉపయోగించాలనుకుంటే పూర్తిగా శుభ్రం చేసి, అగ్నితో తిరిగి శుద్ధి చేసిన తర్వాత తిరిగి ఉపయోగించాలి. ఈ పరిహారం తర్వాత వాటిల్లో తిరిగి దీపాలు వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

పగిలిన ప్రమిదలో వెలిగించవద్దు. దీపావళి అయినా లేదా మరే ఇతర పూజ, శుభకార్యం వంటి సందర్భమైనా పగిలిన ప్రమిదలో దీపం వెలిగించడం చాలా అశుభకరమని భావిస్తారు. ఇలా చేయడం వలన ఆర్థిక నష్టం, ప్రతికూలత ఏర్పడుతుందని నమ్ముతారు.

పాత ప్రమిదలను ఏమి చేయాలంటే
నిమజ్జనం: దీపావళి పూజ తర్వాత మట్టి ప్రమిదలను నదిలో నిమజ్జనం చేయండి లేదా వాటిని రావి చెట్టు కింద ఉంచండి.

మీరు వాటిని పారావేయడానికి ఇష్టపడక పొతే వాటిని ఇంటి అలంకరణ లేదా కళాత్మక ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.

దీపావళి రోజున దీపాలు వెలిగించడానికి ముఖ్యమైన నియమాలు
దిశానిర్దేశం: ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించేటప్పుడు.. దాని జ్వాలను లోపలికి ఉండేలా చూసుకోవాలి. యమ దీపం ఎల్లప్పుడూ దక్షిణం వైపు వెలిగించాలి.

సంఖ్య: దీపావళి నాడు దీపాల సంఖ్య 5, 7, 9, 11, 21, 51 లేదా 108 లాగా బేసిగా ఉండాలి. మీరు మీ ఇష్టానుసారం ఎన్ని దీపాలనైనా వెలిగించవచ్చు. అయితే బేసి సంఖ్య అనేది శుభప్రదంగా పరిగణిస్తారు.

మొదటి దీపం: పూజ ప్రారంభించేటప్పుడు పూజ గదిలో మొదటి దీపం వెలిగించాలి. దీపావళి నుంచి కార్తీక మాసం నెల రోజులూ వెలిగించే దీపం నెయ్యి దీపం కంటే కూడా నువ్వుల నూనె చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

స్థానం: ఇంటి ప్రధాన ద్వారం వద్ద, లివింగ్ రూమ్ వద్ద, వంటగదికి ఆగ్నేయ మూలలో, తులసి మొక్క దగ్గర, రావి చెట్టు కింద, బాల్కనీలో దీపం వెలిగించాలి.

ఒక దీపంతో మరొక దీపం వెలిగించవద్దు: మత విశ్వాసాల ప్రకారం ఎప్పుడూ ఒక దీపంతో మరొక దీపం వెలిగించకూడదు. ఇది అశుభంగా పరిగణించబడుతుంది. దీపాలను విడిగా వెలిగించాలి.

దీపం ఆర్పవద్దు: పూజ సమయంలో దీపం ఎటువంటి పరిస్థితిలో ఆరిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. దీపాన్ని చేతితో లేదా దానిని ఊది ఆర్పవద్దు. ఇది లక్ష్మీ దేవిని అగౌరవ పరిచినట్లుగా పరిగణించబడుతుంది.

Related posts